ప్రతి భారతీయుని స్థోమతకు సరితూగే ఐదు డీజల్ కార్లు: ప్రత్యేక కలెక్షన్

By Anil

కార్ల యుగం మొదలైనప్పటి నుండి డీజల్ కార్లు ఎంతో ప్రత్యేకం. వీటి డిమాండ్ అంతా ఇంతా కాదు మార్కెట్లో వీటి డిమాండ్ ఎంతుంటుందో మీకే తెలుసుంటుంది. మైలేజ్ పరంగా, పనితీరు, అధిక బరువులను సైతం లెక్కచేయకుండా లాగడంలో ఇవి ఎంతో ప్రత్యేకం. అయితే ఒక్క ధర విషయంలో పెట్రోల్ కార్లు డీజల్ కార్ల ప్రభావాన్ని తగ్గించివేశాయి.

పెట్రోల్ కార్లు విరివిగా అందుబాటులోకి వచ్చినప్పటికీ డీజల్ కార్లను ఎంచుకునే వారు లేకపోలేదు. అలాంటి వారి కోసం తక్కువ ధరతో మరియు ధరకు తగ్గ సరైన విలువను జోడించే ఐదు ఉత్తమ కార్లకు సంభందిచిన సమాచారం క్రింది కథనంలో....

టాటా టియాగో

టాటా టియాగో

టాటా మోటార్స్ ఇండియన్ మార్కెట్లోకి అందించిన తాజా మోడల్ టియాగో హ్యాచ్‌బ్యాక్. ఎన్నో ఏళ్ల తరువాత టాటా మోటార్స్ ఈ టియాగో ద్వారా విజయాన్ని రుచించింది. అంతేకాకుండా అన్ని అంశాల పరంగా ఎంతో ఉత్తమంగా నిలిచిన ఈ కారును భారతీయులు కూడా అదే స్థాయిలో. కేవలం అతి తక్కువ కాలంలోనే టాటా మోటార్స్ యొక్క బెస్ట్ సెల్లింగ్ కారుగా నిలిచింది.

ప్రత్యేకతలు

ప్రత్యేకతలు

టాటా మోటార్స్ ఈ టియాగో హ్యాచ్‌బ్యాక్ కారును పెట్రోల్ మరియు డీజల్ ఇంజన్ ఆప్షన్‌లో అందించారు. ఇందులోని డీజల్ పరంగా చూస్తే 69బిహెచ్‌పి పవర్ మరియు 140ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేసే 1.05 లీటర్ మూడు సిలిండర్ల డీజల్ ఇంజన్ కలదు. దీనికి 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌ను అనుసంధానం చేశారు. దీని ఆన్ రోడ్ హైదరాబాద్ ధర రూ. 4.75 లక్షలుగా ఉంది. దీని మైలేజ్ లీటర్‌కు 27.28 కిమీలు.

మారుతి సుజుకి సెలెరియో

మారుతి సుజుకి సెలెరియో

అత్యంత సరసమైన డీజల్ కార్ల జాబితాలో ఉన్న రెండవ కారు మారుతి సుజుకి సెలెరియో. మారుతి వారి ఎంట్రీ లెవల్ డీజల్ ఉత్పత్తి కూడా ఇదే. ప్రయోగాత్మకంగా మారుతి సుజుకి దీని ద్వారా కూడా మంచి అమ్మకాలను రాబట్టుకుంది. మారుతి సుజుకి సెలెరియో డీజల్ ప్రారంభ వేరియంట్ ఆన్ రోడ్ హైదరాబాద్ ధర రూ. 5.70 లక్షలుగాఉంది. మరియు దీని మైలేజ్ లీటర్‌కు 27.62 కిమీలుగా ఉంది.

ప్రత్యేకతలు

ప్రత్యేకతలు

మారుతి సుజుకి ఈ సెలెరియోలో 793 సీసీ సామర్థ్యం ఉన్న డీజల్ ఇంజన్‌ను వినియోగించింది. ఇది సుమారుగా 46బిహెచ్‌పి@3,500RPM మరియు 125ఎన్ఎమ్ గరిష్ట టార్క్@2,000RPM ఉత్పత్తి చేయును. ఇందులోని ఇంజన్‌కు 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌ను అనుసంధానం చేశారు.

షెవర్లే బీట్

షెవర్లే బీట్

షెవర్లే బీట్ ఇది పట్టణ ప్రాంత రవాణాకు ఎంతో బాగా నప్పుతుంది. డీజల్ విభాగంలో ఉన్న ఎంట్రీలెవల్ బీట్ కార్లు ఎంతో బాగుంటాయి. అయితే డిజైన్ గురించి మాట్లాడాల్సిన అవసరం ఏ మాత్రం ఉండదు ఎందుకంటే ఇదంతా ఆకర్షణకు సంభందించిన అంశం. చిన్న కుటుంబ మరియు స్నేహాలకు ఇది బాగా సరిపోతుంది.

ప్రత్యేకతలు

ప్రత్యేకతలు

ఇందులో 936సీసీ సామర్థ్యం ఉన్న డీజల్ ఇంజన్ కలదు. ఇది సుమారుగా 57బిహెచ్‌పి పవర్ మరియు 150ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇందులోని ఇంజన్ 85-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌మను అనుసంధానం చేశారు, ఇది లీటర్‌కు 25.44 కిమీల మైలేజ్‌నిస్తుందియ. దీని ఆన్ రోడ్ హైదరాబాద్ ధర రూ. 6.30 లక్షలుగా ఉంది.

హ్యుందాయ్ గ్రాండ్ ఐ10

హ్యుందాయ్ గ్రాండ్ ఐ10

బడ్జెట్ డీజల్ కార్ల మార్కెట్లో అద్భుతమైన డిజైన్ కలిగిన కారు. మరియు అధిక ఫీచర్లతో నిండిన హ్యాచ్‌బ్యాక్ కారు కూడాను. అంతే కాకుండా ధృఢమైన విఢి భాగాలు ఈ జాబితాలో ఉన్న వాటికన్నా దీనిని మరింత ప్రత్యేకం చేశాయి.

ప్రత్యేకతలు

ప్రత్యేకతలు

హ్యుందాయ్ మోటార్స్ ఈ గ్రాండ్ ఐ10 లో 1120 సీసీ సామర్థ్యం ఉన్న డీజల్ ఇంజన్‌ను అందించారు. ఇది 70బిహెచ్‌పి పవర్ మరియు 160ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయును. ఇందులోని ఇంజన్‌కు 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌ను అనుసంధానం చేశారు. లీటర్‌కు 24 కిలోమీటర్ల మైలేజ్‌నివ్వగల దీని ఆన్ రోడ్ హైదరాబాద్ ధర రూ. 6.81 లక్షలుగా ఉంది.

మహీంద్రా కెయువి100

మహీంద్రా కెయువి100

హ్యాచ్‌బ్యాక్ లలో ఎంట్రీలెవల్ డీజల్ కార్ల విభాగంలోని దీనిని ఎందుకు అందించారు అనుకుంటున్నారా ? చూడటానికి మినిఎస్‌యువిని పోలి ఉన్నప్పటికీ దీని ధర వీటి ఇంతుకు ముందు తెలిపిన కార్ల మధ్యనే ఉంటుంది. మహీంద్రా కెయువి100 అని పిలువబడే ఇది డీజల్ మరియు పెట్రోల్ వేరియంట్లలో లభిస్తోంది. ఇందులో ఆరు మంది కూర్చునే సౌలభ్యాన్ని కూడా కల్పించారు.

ప్రత్యేకతలు

ప్రత్యేకతలు

మహీంద్రా అండ్ మహీంద్రా వారు ఇందులో 1198సీసీ సామర్థ్యం ఉన్న డీజల్ ఇంజన్‌ను అందించారు. ఇది సుమారుగా 77బిహెచ్‌పి పవర్ మరియు 190ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీనికి 5-స్పీడ్ మ్యాన్యుల్ ట్రాన్స్‌మిషన్‌ అనుసంధానం చేశారు. ఇది లీటర్‌కు 25.32 కిమీల మైలేజ్‌ను ఇస్తుంది. దీని ఆన్ రోడ్ హైదరాబాద్ ధర రూ. 6.50 లక్షలుగా ఉంది.

ప్రతి భారతీయుని స్థోమతకు సరితూగే ఐదు డీజల్ కార్లు

హైదరాబాద్ నుండి ఢిల్లీకి కేవలం రూ. 91 లతో ప్రయాణించవచ్చు

Most Read Articles

English summary
Top 5 Most Affordable Diesel Cars India
Story first published: Saturday, July 2, 2016, 17:57 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X