భారత్‌లో ఫియట్‌ మోబి విడుదలకాకపోవడానికి గల ఐదు కారణాలు

Written By:

ఫియట్ మోటార్స్ తాజాగా మోబి హ్యాచ్‌బ్యాక్ కారును బ్రెజిల్ మార్కెట్లో విడుదలయింది. ఎంట్రీ లెవల్ కార్ల నుండి అత్యంత లగ్జరీ కార్ల వరకు అన్ని మోడళ్లకు ఇండియన్ మార్కెట్లో గిరాకీ ఉంది. అయితే మరి ఫియట్ వారి మోబి కారు ఎందుకు విడుదలకు నోచుకోవట్లేదంటారు. మోబి విడుదల కాకపోవడానికి ముఖ్యంగా ఐదు కారణాలు ఉన్నాయి. క్రింది కథనాన్ని విశ్లేషించండి మీకే అర్థం అవుతుంది.

1. చిన్న హ్యాచ్‌బ్యాక్ కార్లలో బహుళ ఎంపికలు

ఎస్‌యువి తరహా డిజైన్‍‌లో ఉండే ఈ మోబి కారు రెనో క్విడ్ వారి 1.0-లీటర్ వేరియంట్‌కు గట్టి పోటీగా నిలవనుంది. అంతే కాకుండా చాలా వరకు ఎంట్రీలెవల్ కార్లకు ఇది ప్రాణ సంకటంగా కూడా మారగలదు.

ప్రస్తుతం ఇండియన్ మార్కెట్లో రకరకాల ఆప్షన్లతో ఎంట్రీ లెవల్ కార్లను ఎంచుకోవడానికి ముఖ్యంగా మూడు మోడళ్లు ఉన్నాయి, అవి హ్యుందాయ్ ఐ10, మారుతి సుజుకి ఆల్టో కె10 మరియు సంచలనం సృష్టించిన రెనో క్విడ్ నుండి అతి త్వరలో విడుదల కానున్న క్విడ్1.0-వేరియంట్ వీటన్నింటికి ఫియట్ మోబి పోటిని ఇవ్వగలదు.

2. మరింత ఆకర్షణీయమైన లుక్‌తో

ప్రస్తుతం చిన్న హ్యాచ్‌బ్యాక్ కార్లలో రెనో క్విడ్ అన్నింటికన్నా ఎంతో ఆకర్షణీమైన డిజైన్‌ను కలిగి ఉంది. ఇండియన్ మార్కెట్లోకి ప్రతి కార్ల తయీర సంస్థ కూడా విడుదల చేయబోయే ప్రతి ఎంట్రీలెవల్ హ్యాచ్‌బ్యాక్ కారును డిజైన్ పరంగా ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తున్నాయి. అందులో రెనో క్విడ్ ఒక ఉత్తమ ఉదాహరణ.

ఫీచర్లు మరియు అందించే ప్యాకేజ్‌ల పరంగా కూడా ఎక్కువ ఆసక్తి చూపుతున్నాయి. ఎన్నో ఏళ్ల కాలంగా ఇండియన్ మార్కెట్లో ఉన్న మారుతి సుజుకి ఆల్టో 800 మరియు హ్యుందాయ్ ఇయాన్ వంటి కార్లలో మునుపెన్నడూ చూడనటువంటి ఫీచర్లను రెనో తమ క్విడ్ కారులో అందించింది. అయితే బ్రెజిల్‌లో విడుదలైన ఫియట్ మోబి ఫీచర్లు మరియు డిజైన్ పరంగా చూస్తే చాలా వరకు ఇండియన్ మార్కెట్లో ఉన్న రెనో క్విడ్‌ను పోలి ఉంటాయి.

3.ఫియట్

ఫియట్ సంస్థ తమ కార్లకు రూపొందించే డిజైన్ మరియు బాడీ స్ట్రక్ఛర్ అన్ని కూడా ఎంతో బాగుంటాయి మరియు భద్రతలో ఈ రెండు అంశాలు ఎంతో కీలకంగా ఉన్నాయి. అంతే కాకుండా వీరి డిజైన్ శైలి వలన ఇండియన్ రోడ్ల మీద తమ కార్లు ఎంతో పటిష్టంగా పరుగులు పెడతాయి.

బ్రాండ్ అనే విషయాన్ని అటుంచింతే గత కొన్నేళ్లుగా ఫియట్ మోటార్స్‌కు పెద్దగా చెప్పుకునే విధమైన అమ్మకాలు జరగట్లేదు. అయితే ఫియట్ సంస్థ మీద కమ్ముకున్నట్లు చీకట్లు తమ నూతన మోడల్ హ్యాచ్‌బ్యాక్ మోబీ కారు చెరిపివేసేమార్గాలు కనబడుతున్నాయి.

కొలతలు

రెనో క్విడ్‌తో పోలిస్తే ఫియట్ మోబి వారి ఎత్తు మరియు వెడల్పు రెండు కూడా ఎక్కువగానే ఉన్నాయి. తద్వారా ఇందులో సీటింగ్ సామర్థ్యం మెరుగ్గా ఉండి సౌకర్యవంతంగా ప్రయాణించే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

గ్రౌండ్ క్లియరెన్స్‌తో పోలిస్తే క్విడ్ కన్నా మోబి హ్యాచ్‌బ్యాక్ కారులో తక్కువగానే ఉంది. క్విడ్ కారులో 180 ఎమ్ఎమ్ క్లియరెన్స్ ఉండగా మోబి కారులో ఇది 156 ఎమ్ఎమ్‌గా ఉంది. అయితే గ్రౌండ్ క్లియరెన్స్‌ను ఇండియన్ రోడ్లుకు సరిపోయే విధంగా పెంచి భారతీయ మార్కెట్లోకి అందించవచ్చు.

ఫీచర్లు

బ్రెజిల్ ఆటోమొబైల్ మార్కెట్లోకి విడుదలైన ఫియట్ మోబి కారులో ప్రస్తుతం తరానికి చెందిన డ్రైవ్ బై వైర్, లేన్ ఛేంజ్ ఇండికేటర్స్, ఎమర్జెన్సీ బ్రేకింగ్ సిగ్నలింగ్, ఫాలో మీ హోం హెడ్‌ల్యాంప్స్ వంటి ఫీచర్లు కలవు.

భద్రత

ఇందులో భద్రత పరంగా రెండు ఎయిర్ బ్యాగులు, యాంటి లాక్ బ్రేకింగ్ సిస్టమ్ మరియు ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ మరియు ఇన్పోటైన్‌మెంట్ వ్యవస్థ కలదు.

పోటి

మార్కెట్లో ఎంత ఆరోగ్యకరమైన పోటీ ఉంటే వాటన్నింటిలో నుండి అత్భుతమైన ఉత్పత్తి ఒకటి బయటకు రావడం ఖాయం. ఫియట్ సంస్థ ఇండియన్ మార్కెట్లోకి ఈ మోబి హ్యాచ్‌బ్యాక్ కారును తీసుకువస్తే ఇది అత్భుతమైన పోటీని సృష్టించి అందులో బెస్ట్ కారుగా నిలుస్తుందని మా అభిప్రాయం...

 

Read more on: #ఫియట్ #fiat
English summary
Top 5 Reasons Why Fiat Should Launch The Mobi In India
Please Wait while comments are loading...

Latest Photos