జూలై 2016 లో టాప్-10 ప్యాసింజర్ వెహికల్ బ్రాండ్లు

By Anil

ఇండియన్ మార్కెట్లోని కార్ల అమ్మకాల ఆటలో గెలుపొందాలంటే ఏ తయారీ దారులకైనా అతి ముఖ్యమైన కీ ప్యాసింజర్ సెగ్మెంట్. ఎంట్రీ లెవల్ కార్లు తయారీ దారులకు అమ్మకాల సంఖ్యను సూచిస్తే, టాప్ ఎండ్ వేరియంట్ కార్లు ఆ సంస్థల యొక్క ఫీచర్లు మరియు టెక్నాలజీలను సూచిస్తాయి.

అయితే గత నాలుగైదేళ్ల నుండి చాలా కార్ల తయారీ సంస్థలకు హాట్‌-స్పాట్‌గా మారిపోయింది. హ్యాచ్‌బ్యాక్స్, సెడాన్స్ మరియు ఎస్‌యువిలు అనే విభిన్నమైన సెగ్మెంట్ల వారిగా వివిధ రకాల ఉత్పత్తులను అందుబాటులోకి తీసుకువస్తున్నాయి.అయితే ప్రస్తుతం ఉన్న వాటిలో ఏ సంస్థ ముందుంది అనేదాని కోసం ఇండియాలో టాప్-10 కార్ల తయారీ సంస్థల గురించి క్రింది కథనంలో....

10. వోక్స్‌వ్యాగన్

10. వోక్స్‌వ్యాగన్

ఇండియాలో టాప్-10 కార్ల తయారీ సంస్థలు అనే జాబితాలో జర్మనీకి చెందిన వోక్స్‌వ్యాగన్ సంస్థ 10 వ స్థానంలో నిలిచింది. వోక్స్‌‌వ్యాగన్ సంస్థ దేశీయ మార్కెట్లో పెద్దగా సరసమైన కార్లను అందివ్వలేదు. ఈ మధ్యనే అమెయో కాంపాక్ట్ సెడాన్‌ను విడుదల చేసింది, మరియు పోలో హ్యాచ్‌బ్యాక్‌ను ఇంకా విడుదల చేయాల్సి ఉంది. వోక్స్‌వ్యాగన్ గడిచిన జూలై 2016 లో దేశ వ్యాప్తంగా మొత్తం 4,301 యూనిట్ల అమ్మకాలను చేపట్టింది.

09. నిస్సాన్

09. నిస్సాన్

జపాన్‌కు చెందిన కార్ల తయారీ సంస్థ నిస్సాన్ దేశీయంగా జూలై 2016 లో 6,418 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసుకుని తొమ్మిదవ స్థానంలో నిలిచింది. నిస్సాన్ ఇండియన్ మార్కెట్లో అత్యంత సరసమైన ఉత్పత్తి మైక్రా ఆక్టివ్‌ను అందుబాటులో ఉంచింది. ఇది కేవలం పెట్రోల్ వేరియంట్లో మాత్రమే లభించును.

08. ఫోర్డ్

08. ఫోర్డ్

ఫోర్డ్ ఇండియా గడిచిన జూలై 2016 లో 7,088 యూనిట్ల అమ్మకాలు జరిపి ఎనిమిదవ స్థానంలో నిలిచింది. అమెరికాకు చెందిన ఫోర్డ్ ఇండియాలోకి ఎండీవర్, ఎకో స్పోర్ట్ మరియు ఫిగో హ్యాచ్‌బ్యాక్ కార్లను అందివ్వడంతో మళ్లీ పుట్టింగదని చెప్పవచ్చు. ఫిగో హ్యాచ్‌బ్యాక్‌తో పాటు ఆస్పైర్ కాంపాక్ట్ సెడాన్‌ను కూడా అందించి. ఎకో స్పోర్ట్ ఎప్పటిలాగే బెస్ట్ సెల్లింగ్ వాహనంగా నిలిచింది.

07. రెనో

07. రెనో

ఏడవ స్థానంలో నిలిచిన రెనో గడిచిన జూలై 2016 లో 11,968 యూనిట్లు అమ్మకాలు జరిపింది. రెనోకు డస్టర్ ఎస్‌యువి మంచి అమ్మకాలు సాధించింది. డస్టర్ తరువాత విడుదలైన క్విడ్ ఊహించిన విధంగా స్వల్ప కాలంలోనే అమ్మకాలను పుంజుకుంది. గత జూలై అమ్మకాలను పరిశీలిస్తే ఒక్క రెనో క్విడ్ మాత్రమే 75 శాతం అమ్మకాలు జరిపింది.

06. టయోటా

06. టయోటా

జపాన్‌కు చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ ప్రపంచ వ్యాప్తంగా రెండవ అతి పెద్ద కార్ల సంస్థగా నిలిచింది. కాని ఇండియాలో ఆరవ స్థానంలో నిలిచింది. దేశీయంగా దీని అమ్మకాలు క్షీణించడానికి కారణం ఢిల్లీ మరియు కేరళలో 2000సీసీ కన్నా ఎక్కువ సామర్థ్యం ఉన్న డీజల్ వాహనాల అమ్మకాలను నిషేధించడమే అని తెలిసింది. దీనిని మినహాయిస్తే గడిచిన జూలై 2016 లో 12,404 యూనిట్ల అమ్మకాలు జరపింది.

05. టాటా మోటార్స్

05. టాటా మోటార్స్

గడిచిన జూలై 2016 అమ్మకాల్లో ప్యాసింజర్ కార్ల విభాగంలో టాటా మోటార్స్ సుమారుగా 13,586 యూనిట్ల అమ్మకాలు జరిపింది. గత కొంత కాలం నుండి టాటా మోటార్స్ అమ్మకాలు నానాటికీ క్షీణిస్తూ వచ్చాయి, అయితే తాజాగా టాటా వారు విడుదల చేసిన టియాగో మంచి అమ్మకాలను సాధిస్తోంది. అందులోని టియాగోలోని పెట్రోల్ వేరియంట్ల అమ్మకాలు మరీ ఎక్కువగా ఉన్నాయి.

04. హోండా

04. హోండా

జపాన్‌కు చెందిన ప్రముఖ ప్యాసింజర్ వాహనాల తయారీ సంస్థ హోండా ఇండియాలో నాలుగవ స్థానంలో నిలిచింది. గడిచిన జూలై 2016 అమ్మకాల్లో 14,025 యూనిట్ల అమ్మకాలు జరిపింది. ఇక మంచి ఫలితాలను సాధిస్తున్న ఉత్పత్తుల గురించి చూస్తే సిటి మరియు జాజ్ మంచి అమ్మకాలను సాధిస్తున్నాయి. బిఆర్-వి మాత్రం కేవలం 3,000 వరకు అమ్ముడయ్యాయి. అమియో మరియు మొబిలియో కాస్త కష్టంగానే నడుస్తున్నాయి.

03. మహీంద్రా అండ్ మహీంద్రా

03. మహీంద్రా అండ్ మహీంద్రా

దేశీయ పరిజ్ఞానంతో ఉత్పత్తులను అందుబాటులోకి తెస్తున్న అతి వాహన తయార సంస్థ మహీంద్రా టాప్-10 జాబితాలో మూడవ స్థానంలో నిలిచింది. గడిచిన జూలై 2016 అమ్మకాల్లో సుమారుగా 16,337 యూనిట్ల అమ్మకాలు జరిపింది. మహీంద్రా లైనప్‌లో బొలెరో స్థిరమైన అమ్మకాలను సాధిస్తోంది మరియు కొత్తగా వచ్చిన కెయువి100 మంచి ఫలితాలనిస్తోంది.

02. హ్యుందాయ్

02. హ్యుందాయ్

కొరియాకు చెందిన కార్ల తయారీ సంస్థ హ్యుందాయ్ మోటార్స్ ఇండియాలో రెండవ స్థానంలో నిలిచింది. గడిచిన జూలై 2016 లో 41,201 యూనిట్ల అమ్మకాలను నమోదుచేసుకుంది. గ్రాండ్ 10 ఎప్పటిలాగే మంచి అమ్మకాలను సాధిస్తోంది. మరియు క్రెటా ఎస్‌యువి కూడా ఉత్తమ ఫలితాలను సాధిస్తోంది.

01. మారుతి సుజుకి

01. మారుతి సుజుకి

మారుతి సుజుకిని మరే ఇతర సంస్థలతో అమ్మకాల పరంగా పోల్చుకుంటే అస్సలు పొంతనే ఉండదు. గత జూలై 2016 లో మారుతి ఏకంగా 1,25,778 యూనిట్ల అమ్మకాలు జరిపి మొదటి స్థానంలో నిలిచింది. కొన్ని సంస్థలు ఏడాది పొడవునా జరిపే అమ్మకాలకు ఇది సరితూగదు. మారుతి లైనప్‌లో ఆల్టో మరియు డిజైర్ ఉత్తమ అమ్మకాలు సాధిస్తూనే ఉన్నాయి.

మరిన్ని కథనాలు .....

ఇండియాలో సన్‌రూఫ్‌తో అందుబాటులో ఉన్న కార్లు

టాప్-10 కార్ల సంస్థలకు ఆ పేర్లు ఎలా వచ్చాయి ?

Most Read Articles

English summary
Top 10 Selling Passenger Vehicle Brands In India During July 2016
Story first published: Wednesday, August 3, 2016, 10:59 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X