ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ఖరీదైన టాప్ 25 కార్లు

By Anil

మన దేశంలో అత్యంత చవకైన కారుగా టాటా నానో మొదటి స్థానంలో ఉంది. ఇండియాలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా కూడా అత్యంత చౌక కారు ఇదే.అయితే నానో, ఆల్టో లతో పాటు ఖరీదైన ఆడి, మెర్సిడెస్ బెంజ్, బిఎమ్‌డబ్ల్యూ మరియు వోల్వోలతో పాటు రేంజ్ రోవర్, ల్యాంబోర్గిని, మరియు పోర్షే వంటి సంస్థలకు చెందిన అత్యంత ఖరీదైన కార్లను కొనుగోలు చేసేవారున్నారు.

అయితే ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ఖరీదైన టాప్ 25 కార్ల గురించి ప్రస్తావిస్తే అందులో ఒకటి కూడా ఇండియాలో లేదు. అత్యంత ఖరీదైన కార్ల వివరాలు మరియు వాటి ధరల వివరాలు....

25. 2017 రిమాక్ కాన్సెప్ట్ వన్ - 9,41,000 అమెరికన్ డాలర్లు

25. 2017 రిమాక్ కాన్సెప్ట్ వన్ - 9,41,000 అమెరికన్ డాలర్లు

రిమాక్ కాన్సెప్ట్ వన్ కారు మొదటి సారిగా 2016 జెనవా మోటార్ షోలో ప్రదర్శించారు. ఈ కారులో నాలుగు శక్తివంతమైన మ్యాగ్నెట్ ఎలక్ట్రిక్ మోటార్లు కలవు. ఇది సుమారుగా 1,088బిహెచ్‌పి పవర్ మరియు 1,600ఎన్ఎమ్ టార్క్‌ ఉత్పత్తి చేయును. కేవలం 2.6సెంకండ్ల కాలంలోనే 0-100కిలోమీటర్ వేగాన్ని అందుకుంటుంది మరియు దీని గరిష్ట వేగం గంటకు 355కిలోమీటర్లుగా ఉంది.

24. అపోలో యారో - 1.1మిలియన్ అమెరికన్ డాలర్లు (అంచనా)

24. అపోలో యారో - 1.1మిలియన్ అమెరికన్ డాలర్లు (అంచనా)

అపోలో ఆటోమొబైల్స్ యొక్కఅదునాతన కారు ఈ అపోలో యారో. అపోలో దీనిని మొదటి సారిగా 2016 జెనీవా మోటార్ షోలో ప్రదర్శించారు. ఇందులోని శక్తింవంతమైన 4.0-లీటర్ ట్విన్ టుర్బో ఆడి వి8 ఇంజన్ కలదు. ఇది సుమారుగా 986బిహెచ్‌పి పవర్ ఉత్పత్తి చేయును. కేవలం 2.9 సెకండ్లలోనే 0-100కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. దీని గరిష్ట వేగం గంటకు 360కిలోమీటర్లుగా ఉంది.

23. Mazzanti Evantra Millecavalli - 1.2 మిలియన్ అమెరికన్ డాలర్లు

23. Mazzanti Evantra Millecavalli - 1.2 మిలియన్ అమెరికన్ డాలర్లు

2016 జూన్ లో ఇటలీలో ప్రదర్శించబడిన Mazzanti Evantra Millecavalli కారు 25 యూనిట్లు మాత్రమే ఉత్పత్తి చేయబడ్డాయి. ఇందులోని 7.0-లీటర్ సామర్థ్యం గల షెవర్లే ఎల్ఎస్7 ట్విన్ టుర్బో వి8 ఇంజన్ సుమారుగా 1000బిహెచ్‌పి పవర్ ఉత్పత్తి చేయగలదు. కేవంల 2.4 సెంకండ్ల నిడివిలో 0-100కిలమీటర్ల వేగాన్ని అందుకుంటుంది మరియు దీని గరిష్ట వేగం గంటకు 402కిలోమీటర్లుగా ఉంది.

22. 2017 హెన్నెస్సే వెనామ్ జిటి స్పైడర్ డబ్ల్యూఆర్ఇ - 1.3మిలియన్ అమెరికన్ డాలర్లు

22. 2017 హెన్నెస్సే వెనామ్ జిటి స్పైడర్ డబ్ల్యూఆర్ఇ - 1.3మిలియన్ అమెరికన్ డాలర్లు

ఫాస్టెస్ట్ ఒపెన్ కార్ వరల్డ్ స్పీడ్ రికార్డును నెలకొల్పింది ఈ హెన్నెస్సే వెనామ్ జిటి స్పైడర్ డబ్ల్యూఆర్ఇ. గరిష్టంగా 427కిలోమీటర్ల వేగాన్ని అందుకుంది. ఇందులోని 7.0-లీటర్ వి8 ఇంజన్ సుమారుగా 1,451బిహెచ్‌పి పవర్ మరియు 1,744ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేయును. ఇది కేవలం 2.4-సెకండ్ల నిడివిలో 0-100కిలోమీటర్ల వేగాన్ని చేరుకుంటుంది.

21. ఎస్‌సిజి003సిఎస్ - 1.3 మిలియన్ అమెరికన్ డాలర్లు

21. ఎస్‌సిజి003సిఎస్ - 1.3 మిలియన్ అమెరికన్ డాలర్లు

మల్టీ మిలియనీర్ జిమ్ గ్లికన్‌హాస్ మొదటి సారిగా ఈ స్ట్రీట్ లీగస్ ఎస్‌సిజి003సిఎస్ ను మోంటెరరీ కార్ వీక్ 2016 లో ప్రదర్శించారు. ఇందులో 4.4-లీటర్, ట్విన్ టుర్బో వి8 ఇంజన్ సుమారుగా 800బిహెచ్‌పి పవర్ ఉత్పత్తి చేయును.

20. నెక్ట్స్ఇవి హైపర్ కారు - 1.31 మిలియన్ అమెరికన్ డాలర్లు

20. నెక్ట్స్ఇవి హైపర్ కారు - 1.31 మిలియన్ అమెరికన్ డాలర్లు

ఫార్మాలా-ఇ ఫేమ్ నెక్ట్స్ ఇవి కొత్త ఎలక్ట్రిక్ హైపర్ కారును ఈ ఏడాదిలోపు ప్రదర్శించనుంది. దీని ధర సుమారుగా 1.31మిలియన్ అమెరికన్ డాలర్లుగా ఉండనుంది. దీని గురించి ఏ విధమైన సమాచారం లేదు. అయితే 1 మెగావాట్ కన్నా ఎక్కువ ఇవితో ఇది రానుంది.

19. 2017 అరష్ ఏఎఫ్10 హైబ్రిడ్ - 1.57మిలియన్ అమెరికన్ డాలర్లు

19. 2017 అరష్ ఏఎఫ్10 హైబ్రిడ్ - 1.57మిలియన్ అమెరికన్ డాలర్లు

2017 అరష్ ఏఎఫ్10 హైబ్రిడ్ కారు మొదటి సారిగా జెనీవా మోటార్ షో 2016 లో ప్రదర్శించారు. 2017 అరష్ ఏఎఫ్10 హైబ్రిడ్ లో 6.2-లీటర్ సామర్థ్యం గల ఎల్ఎస్ వి8 ఇంజన్ కలదు, ఇది సుమారుగా 550బిహెచ్‌పి పవర్ ఉత్పత్తి చేయగలదు.

18.2016 కొయినిగ్‌సెగ్ అగెరా ఆర్ఎస్ - 1.6మిలియన్ అమెరికన్ డాలర్లు

18.2016 కొయినిగ్‌సెగ్ అగెరా ఆర్ఎస్ - 1.6మిలియన్ అమెరికన్ డాలర్లు

కొయినిగ్‌సెగ్ అగెరా ఆర్ఎస్ కార్లు కేవలం 25 మాత్రమే ఉత్పత్తి అయ్యాయి. అయితే అన్ని కార్లు కూడా అమ్ముడుపోయాయి. కొయినిగ్‌సెగ్ బయటి ప్రపంచానికి ఇంత వరకు తమ ఉత్పత్తుల ధరల వివరాలు వెల్లడించిన దాఖలాలు. అయితే దీని ధర సుమారుగా 1.6 మిలియన్ అమెరికన్ డాలర్లుగా ఉండే అవకాశం ఉంది.

17. 2017 జెన్వో టిఎస్1 - 1.8మిలియన్ అమెరికన్ డాలర్లు

17. 2017 జెన్వో టిఎస్1 - 1.8మిలియన్ అమెరికన్ డాలర్లు

జెన్వో టిఎస్1 కారును మొదటిసారిగా జెనీవా మోటార్ షో 2016 లో ప్రదర్శించారు. ఇందులో 5.2-లీటర్ సామర్థ్యం గల వి8 ఇంజన్ కలదు. దీని ధర సుమారుగా 1.8 మిలియన్ల అమెరికన్ డాలర్ల కన్నా ఎక్కవ ఉండే అవకాశం ఉంది.

16. ఫెనిర్ సూపర్‌స్పోర్ట్ - 1.85 మిలియన్ అమెరికన్ డాలర్లు

16. ఫెనిర్ సూపర్‌స్పోర్ట్ - 1.85 మిలియన్ అమెరికన్ డాలర్లు

డబ్లూ మోటార్స్ యొక్క రెండవ కారు ఈ ఫెనిర్ సూపర్‌స్పోర్ట్. డబ్ల్యూ మోటార్స్ యొక్క ఎంట్రీ లెవల్ కారు ఇప్పుడు ఈ జాబితాలో 16 వ స్థానంలో ఉంది. దీని ధర 1.85 మిలియన్ డాలర్లుగా ఉంది. ఇందులో 4.0-లీటర్ సార్థ్యం గల ఆరు సమాంతర సింలిండర్లు గల ఇంజన్ కలదు, ఇది 900బిహెచ్‌పి పవర్ ఉత్పత్తి చేయును. కేవలం 2.7 సెంకడ్ల వ్యవధిలో 0-100కిమీల వేగాన్ని అందుకుంటుంది. మరియు దీని గరిష్ట వేగం గంటకు 400కిలోమీటర్లుగా ఉంది.

15. కొయినిగ్‌సెగ్ రెగెరా - 1.9 మిలియన్ అమెరికన్ డాలర్లు

15. కొయినిగ్‌సెగ్ రెగెరా - 1.9 మిలియన్ అమెరికన్ డాలర్లు

కొయినిగ్‌సెగ్ రెగెరా కారు మొదటి సారిగా జెనీవా మోటార్ షో 2016 లో ప్రదర్శించబడింది. ప్లగ్-ఇన్ హైబ్రిడ్ హైపర్ కారును కేవలం 80 యూనిట్లుగా మాత్రమే ఉత్పత్తి చేయనున్నారు. మార్చి 2016 నాటికి 40 యూనిట్లను అమ్మేసారు. ఇందులోని 5.0-లీటర్ వి8 ట్విన్ టుర్బో ఇంజన్‌కు మూడు ఎలక్ట్రిక్ మోటార్లు అనుసంధానం చేశారు. మొత్తం కలిసి 1,822బిహెచ్‌పి పవర్ ఉత్పత్తి చేయును.

14. ల్యాంబోర్గిని సెంటెనారియో - 1.94 మిలియన్ అమెరికన్ డాలర్లు

14. ల్యాంబోర్గిని సెంటెనారియో - 1.94 మిలియన్ అమెరికన్ డాలర్లు

Ferruccio Lamborghini యొక్క 100 వ జన్మదిన వేడుకల సందర్భంగా ల్యాంబోర్గిని మరో లిమిటెడ్ ఎడిషన్ సూపర్ కారును సెంటెనారియో పేరుతో విడుదల చేసింది. మొదటి సారిగా ఈ కారును 2016 జెనీవా మటార్ షో వేదిక మీద ప్రదర్శించారు. ఇందులో 6.5-లీటర్ వి12 ఇంజన్ కలదు. ఇది సుమారుగా 759బిహెచ్‌పి పవర్ ఉత్పత్తి చేయగలదు.

13. ల్యాంబోర్గిని సెంటెనారియో రోడ్‌స్టర్ - 2.27 మిలియన్ అమెరికన్ డాలర్లు

13. ల్యాంబోర్గిని సెంటెనారియో రోడ్‌స్టర్ - 2.27 మిలియన్ అమెరికన్ డాలర్లు

ల్యాంబోర్గిని ఈ సెంటెనారియో రోడ్‌స్టర్‌ను మోంటెరరీ కార్ వీక్ 2016 లో ప్రదర్శించబడింది. వీటిని కేవలం 20 యూనిట్లుగా మాత్రమే ఉత్పత్తి చేశారు. అయితే అన్నింటిని అమ్మేశారు. సుమారుగా 2.27మిలియన్ ధరతో అమ్మినట్లు తెలిసింది.

12. ఆస్టన్ మార్టిన్ వల్కన్ - 2.3 అమెరికన్ మిలియన్ డాలర్లు

12. ఆస్టన్ మార్టిన్ వల్కన్ - 2.3 అమెరికన్ మిలియన్ డాలర్లు

ఆస్టన్ మార్టిన్ ప్రపంచ వ్యాప్తంగా కేవలం 24 వల్కన్ కార్లను మాత్రమే ఉత్పత్తి చేసింది. 24 లో ఒక కారుని గరిష్టంగా 3.4మిలియన్ అమెరికన్ డాలర్లకు అమ్మింది. ఇందులో 800బిహెచ్‌పి పవర్ ఉత్పత్తి చేయగల 7-లీటర్ వి12 ఇంజన్ కలదు.

11. కెన్ ఒకుయుమా కొడె57 - 2.5మిలియన్ అమెరికన్ డాలర్లు

11. కెన్ ఒకుయుమా కొడె57 - 2.5మిలియన్ అమెరికన్ డాలర్లు

కెన్ ఒకుయుమా అనే వ్యక్తి ప్రఖ్యాత కార్ల డిజైనర్. ఫెరారీ ఎంజో మరియు మసెరాటి క్వాట్రోపోర్ట్ వంటి కార్లను డిజైన్ చేసింది ఇతనే. అంతే కాకుండా రెట్రో డిజైన్ ఆధారంతో కొడె57 అనే కారును కూడా డిజైన్ చేశాడు. ఇందులో 600బిహెచ్‌పి పవర్ ఉత్పత్తి చేయగల వి12 ఇంజన్ కలదు.

10. పినిన్ఫారినా హెచ్2 స్పీడ్ - 2.5 మిలియన్ అమెరికన్ డాలర్లు

10. పినిన్ఫారినా హెచ్2 స్పీడ్ - 2.5 మిలియన్ అమెరికన్ డాలర్లు

ఎఫ్ఐఎ ఎల్ఎమ్‌పి2 ఛాసిస్ ఆధారంతో రూపొందించబడిన పినిన్పారినా హెచ్2 స్పీడ్ కారు హైడ్రోజన్ ప్యూయల్ సెల్ కాన్సెప్ట్ ఆధారంతో అభివృద్ది చేయబడిన దీనిని 2016 జెనీవా మోటార్ షో లో ప్రదర్శించారు. ఇందులోని రెండు ఎలక్ట్రిక్ మోటార్లు సుమారుగా 503బిహెచ్‌పి పవర్ ఉత్పత్తి చేయును.

09. పగని హుయరా బిసి - 2.5మిలియన్ అమెరికన్ డాలర్లు

09. పగని హుయరా బిసి - 2.5మిలియన్ అమెరికన్ డాలర్లు

పగని సంస్థ హుయరా తరువాత హుయరా బిసిని ఆవిష్కరించింది. ప్రపంచ వ్యాప్తంగా కేవలం 20 హుయరా బిసి కార్లను మాత్రమే అందుబాటులోకి వచ్చింది. వీటి ఒక్కొక్కటి ధర రూ. 2.5మిలియన్ అమెరికన్ డాలర్లుగా ఉంది. పగని ఇందులో అదే 750బిహెచ్‌పి పవర్ ఉత్పత్తి చేయగల 6.0-లీటర్ వి12 టుర్బో ఇంజన్ అందించింది.

08. మెక్‌లారెన్ పి1 జిటిఆర్ - 2.59మిలియన్ అమెరికన్ డాలర్లు

08. మెక్‌లారెన్ పి1 జిటిఆర్ - 2.59మిలియన్ అమెరికన్ డాలర్లు

మెక్‌లారెన్ తమ పి1 జిటిఆర్ కారును కేవలం పి1 ఓనర్లకు మాత్రమే అమ్ముతోంది. నాన్ రోడ్ పి1 జిటిఆర్ ధర సుమారుగా 3 మిలియన్ అమెరికన్ డాలర్లుగా ఉండే అవకాశం ఉంది. ఇక సాధారణ రహదారి మీద నడిచే పి1 జిటిఆర్ ధర సుమారుగా 6మిలియన్ అమెరికన్ డాలర్ల పైమాటే ఉంటుంది.

07. బుగట్టి చిరాన్ - 2.6 మిలియన్ అమెరికన్ డాలర్లు

07. బుగట్టి చిరాన్ - 2.6 మిలియన్ అమెరికన్ డాలర్లు

బుగట్టి వెయార్న్ విజయానికి కొనసాగింపుగా ఈ చిరాన్ ను అభివృద్ది చేసింది. బుగట్టి ఈ చిరాన్‌లో వేయార్న్ యొక్క డబ్ల్యూ 16 ఇంజన్ అందించింది. ఇది సుమారుగా 1,500బిహెచ్‌పి పవర్ ఉత్పత్తి చేయగలదు, దీని గరిష్ట వేగం గంటకు 420కిలోమీటర్లుగా ఉంది.

06. ఇకొనా వల్కానో టైటానియమ్ - 2.7 మిలియన్ అమెరికన్ డాలర్లు

06. ఇకొనా వల్కానో టైటానియమ్ - 2.7 మిలియన్ అమెరికన్ డాలర్లు

ప్రపంచపు మొదటి టైటానియమ్ సూపర్ కారు ఇది. ఇందులో 6.2-లీటర్ సామర్థ్యం గల వి8 సూపర్ ఛార్జ్‌డ్ ఇంజన్ అందించారు. ఇది సుమారుగా 670బిహెచ్‌పి పవర్ మరియు 820ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేయగలదు. దీని గరిష్ట వేగం గంటకు 355కిలోమీటర్లుగా ఉంది.

05. 2018 మెర్సిడెస్ ఏఎమ్‌జి ఆర్50 - 3 మిలియన్ అమెరికన్ డాలర్లు (అంచనా)

05. 2018 మెర్సిడెస్ ఏఎమ్‌జి ఆర్50 - 3 మిలియన్ అమెరికన్ డాలర్లు (అంచనా)

ఎఫ్1-ప్రేరిత కారుతో హైపర్ కార్ల సామ్రాజ్యంలోకి అడుగుపెట్టనుంది మెర్సిడెస్. తాజాగా మెర్సిడెస్ ఏఎమ్‌జి ఆర్50 కారును ఏఎమ్‍‌జి యొక్క 50 సంవత్సరాల వార్షికోత్సవాన్ని పురష్కరించుకుని వచ్చే ఏడాదికి అందుబాటులోకి తీసుకురానుంది. సాంకేతిక వివరాలు ఇంకా వెల్లడి కాలేదు. దీని ధర సుమారుగ 2 నుండి 3మిలియన్ అమెరికన్ డాలర్ల మద్య ఉండే అవకాశం ఉంది.

04. బుగట్టి విజన్ గ్రాండ్ టురిస్మొ - 3 మిలియన్ అమెరికన్ డాలర్లు

04. బుగట్టి విజన్ గ్రాండ్ టురిస్మొ - 3 మిలియన్ అమెరికన్ డాలర్లు

బుగట్టి తమ విజన్ జిటి కారును కేవలం ప్రదర్శించడానికి మాత్రమే రూపొందించింది. అయితే సౌదీ రాజు గత వారంలో బుగట్టి చిరాన్ మరియు విజన్ జిటి కాన్సెప్ట్ కార్లను ఎంచుకున్నాడు.

03. 2017 మెక్‌లారెన్ పి1 ఎల్ఎమ్ - 3.7మిలియన్ అమెరికన్ డాలర్లు

03. 2017 మెక్‌లారెన్ పి1 ఎల్ఎమ్ - 3.7మిలియన్ అమెరికన్ డాలర్లు

పి1 శ్రేణిలో ఈ పి1 ఎల్ఎమ్ వెర్షన్ కారు టాప్ ఎండ్ లెవల్ అని చెప్పవచ్చు. దీనిని లాంజెంటె మెటోస్పోర్ట్స్ వారు రూపొందించారు. ఇది కూడా మెక్‌లారెన్ ఎఫ్1 ఎల్ఎమ్ తరహా పనితీరును కనబరుస్తుంది.

02. 2017 ఫెరారి లాఫెరారి అపెర్తా - 3.8 మిలియన్ అమెరికన్ డాలర్లు

02. 2017 ఫెరారి లాఫెరారి అపెర్తా - 3.8 మిలియన్ అమెరికన్ డాలర్లు

ఫెరారి లాఫెరారిలో 6.2-లీటర్ సామర్థ్యం ఉన్న వి12 HY-KERN ఇంజన్ కలిగి ఉంది. ఇది సుమారుగా 950బిహెచ్‌పి పవర్ ఉత్పత్తి చేయగలదు. దీనిని సాఫ్ట్ రూఫ్ మరియు కార్బన్ పైబర్ అనే రెండు రకాలుగా ఎంచుకోవచ్చు.

01. ఆస్టన్ మార్టిన్ రెడ్ బుల్ ఏఎమ్-ఆర్‌బి 001 - 3.9 మిలియన్ అమెరికన్ డాలర్లు

01. ఆస్టన్ మార్టిన్ రెడ్ బుల్ ఏఎమ్-ఆర్‌బి 001 - 3.9 మిలియన్ అమెరికన్ డాలర్లు

ఆస్టన్ మార్టిన్ రెడ్ బుల్ ఏఎమ్-ఆర్‌బి 001 ఎఫ్1 ప్రేరిత హైపర్ కారు. దీనిని ఆస్టన్ మార్టిన్ మరియు రెడ్ బుల్ సంయుక్తంగా అభివృద్ది చేశారు. గత మాసంలో దీనిని పూర్తి స్థాయిలో ప్రదర్శించారు. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ఖరీదైన కారు ఇదే. ఇందుసో వి12 ఇంజన్ కలదు.

Most Read Articles

English summary
Read In Telugu: Top 25 Cars That You Can Never Afford To Buy
Story first published: Friday, October 7, 2016, 19:28 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X