టయోటా సుప్రా గురించి విడుదలైన వివరాలు

By Anil

అత్యంత ఖరీదైన సంస్థలు మాత్రమే సూపర్ కార్లను తయారు చేసేవి, ఇది ఒకప్పటి మాట. నేడు, ప్రతి ఆటోమొబైల్ తయారీ సంస్థ కూడా తమకంటూ ఒక సూపర్‌ కారు ఉండాలి అనేది నేటి మాట. ఇందుకోసమే కాబోలు టయోటా మోటార్స్ సరికొత్త ట్విన్-టుర్బో వి6 ఇంజన్‌ మీద చాలా కష్టపడుతోంది.

టయోటా సుప్రా

కొన్ని సమాచార వర్గాల కథనం మేరకు టయోటా మోటార్స్ తమ సుప్రా అనే పేరుతో పిలువబడే సూపర్ కారులో 3.0-లీటర్ సామర్థ్యం ఉన్న ట్విన్-టుర్బో వి6 ఇంజన్‌ను అందిస్తున్నట్లు తెలిసింది. టయోటా చరిత్రలో మొదటి సారిగా అందుబాటులోకి వస్తున్న మొదటి వి6 ఇంజన్ ఇది.
Also Read: టయోటా అప్ కమింగ్ కార్లు
టయోటా సుప్రా గురించి మ్యాగ్-ఎక్స్ అనే సంస్థ తెలిపిన వివరాల మేరకు దీనిని 943ఎఫ్ అనే కోడ్ పేరుతో పిలువనున్నట్లు టయోటా అధికారులు వెల్లడించినట్లు తెలిసింది. ఇందులోని ఇంజన్ సుమారుగా 400బిహెచ్‌పి పవర్ మరియు 440ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు.

ప్రపంచ మొత్తం ఎదురు చూస్తున్న సుప్రా కారులో టర్బో ఛార్జ‌డ్ ఇన్‌లైన్ ఆరు సిలిండర్ల 2జెజడ్ ఇంజన్‌తో రానున్నట్లు ఆ మధ్యనే ఆధారం లేని వార్తలు వచ్చాయి. అప్పట్లో దీనికి 943ఎఫ్ అనే కోడ్ పేరును నిర్ణయించినట్లు తెలిసింది.

టయోటా సుప్రా

సరికొత్త సుప్రా లో హైబ్రిడ్ వ్యవస్థను కూడా పరిచయం చేసే అవకాశాలు చాలా వరకు ఉన్నాయి. అందుకోసం ఆరు సిలిండర్ల ఇంజన్‌కు ఎలక్ట్రిక్ మోటార్‌ను అనుసంధానం చేయనున్నారు. జపాన్‌కు చెందిన సంస్థ కాబట్టి దీనిని తమ దేశానికి చెందిన తరహాలోనే పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానుంది.
Most Read Articles

Read more on: #టయోటా #toyota
English summary
New Rumors Emerge About The Toyota Supra's Engine Specs
Story first published: Monday, July 25, 2016, 14:46 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X