విజయ పథంలో టయోటా ఫార్చ్యూనర్: ధర ఏ మాత్రం సమస్య కాదంట

టయోటా మోటార్స్ ఫార్చ్యూనర్ ఎస్‌యువి 2009 లో ఇండియన్ మార్కెట్లోకి విడుదల చేసింది. అప్పటి నుండి ఇప్పటి వరకు ఈ సెగ్మెంట్లో మొదటి స్థానంలో నిలిచింది.

Written By:

టయోటా కిర్లోస్కర్ మోటార్స్ విడుదల చేసిన ఓ ప్రకటనలో తమ ప్రీమియమ్ ఎస్‌యువి ఫార్చ్యూనర్ అరుదైన, అతి ముఖ్యమైన మైలు రాయిని చేదించినట్లు పేర్కోంది. దేశీయ అమ్మకాల్లో ఒక లక్ష అమ్మకాల మైలు రాయిని దాటినట్లు టయోటా స్పష్టం చేసింది.

టయోటా ఈ ప్రీమియ్ ఎస్‌యువి ఫార్చ్యూనర్‌ను 2009 లో మొదటి సారిగా దేశీయ విపణిలోకి విడుదల చేసింది. అప్పటి నుండి ఇప్పటి వరకు ఈ విక్రయాలు నమోదైనట్లు సంస్థ తెలిపింది.

టయోటా కిర్లోస్కర్ మోటార్స్ ఇండియా డైరెక్టర్ మరియు మార్కెటింగ్ అండ్ సేల్స్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఎన్ రాజా మాట్లాడుతూ, అత్యంత పోటీని ఎదుర్కుంటున్న ప్రీమియమ్ ఎస్‌యువి సెగ్మెంట్లో ఈ విధమైన అమ్మకాలు సాధించడం నిజంగా పెద్ద సక్సెస్ అని తెలిపాడు.

రాజా గారు మాట్లాడుతూ, టయోటా నవంబర్ 7, 2016 లో అప్‌డేటెడ్ ఫార్చ్యూనర్ దేశీయ మార్కెట్లోకి విడుదలయ్యింది. దీనికి కూడా దేశీయ విపణిలో మంచి స్పందన లభిస్తోందని చెప్పుకొచ్చాడు.

అప్ డేటెడ్ ఫార్చ్యూనర్ విడుదలైన కేవలం కొన్ని వారాల్లోనే 6,000 కు పైబడి బుకింగ్స్ నమోదయ్యాయి. మరియు చివరి మాసం నవంబర్ 2016 లో 2,000 యూనిట్ల నూతన ఫార్చ్యూనర్లు అమ్ముడుపోయాయి. 2015 ఏడాది అదే మాసం యొక్క విక్రయాలతో పోల్చి చూసినట్లయితే అమ్మకాల్లో 80 శాతం వృద్దిని నమోదు చేసుకుంది.

ప్రస్తుతం కస్టమర్లు ఆర్డర్ చేసిన 5,000 బుకింగ్స్ పెండింగ్‌లో ఉన్నాయి. టయోటా వీటిని డెలివరీ ఇవ్వాల్సి ఉంది.

టయోటా తమ సరికొత్త ఫార్చ్యూనర్ ప్రీమియమ్ ఎస్‌యువిని అప్‌డేటెడ్ వేరియంట్లో రూ. 25.92 లక్షల నుండి 31.12 లక్షల ధరల శ్రేణి మధ్యన ఎక్స్ షోరూమ్ ఢిల్లీ (ధర)లతో విడుదలయ్యింది.

ప్రీమియమ్ ఎస్‌యువి సెగ్మెంట్లో ఉన్న ఫోర్డ్ ఎండీవర్, షెవర్లే ట్రయల్‌బ్లేజర్, హ్యుందాయ్ శాంటా ఫె, హోండా సిఆర్-వి మరియు మిత్సుబిషి పజేరో వంటి వాహనాలకు గట్టి పోటీగా నిలిచింది.

టయోటా ఫార్చ్యూనర్ మొత్తం ఎనిమిది వేరియంట్లలో అందుబాటులో ఉంది. వీటిలో 2.8-లీటర్ సామర్థ్యం గల డీజల్ ఇంజన్ కలదు. ఇది గరిష్టంగా 177బిహెచ్‌పి పవర్ మరియు 360ఎన్ఎమ్ గరిష్ట టా ర్క్ఉత్పత్తి చేయును.

ఈ అప్‌డేటెడ్ ఫార్చ్యూనర్ 2.7-లీటర్ సామర్థ్యం ఉన్న పెట్రోల్ ఇంజన్‌తో కూడా అందుబాటులో ఉంది. ఇది గరిష్టంగా 164బిహెచ్‌పి పవర్ మరియు 245ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పిత్తి చేయును.

టయోటా ఫార్చ్యూనర్ లోని అన్ని వేరియంట్లు కూడా 6-స్పీడ్ మ్యాన్యువల్ లేదా 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ గల గేర్‌బాక్స్‌ అనుసంధానం కలదు. ఇంజన్ విడుదల చేసే మొత్తం పవర్ ట్రాన్స్‌మిషన్ గుండా ఫోర్-వీల్ డ్రైవ్ సిస్టమ్ ద్వారా నాలుగు చక్రాలకు సరఫరా అవుతుంది.

టయోటా నూతన డిజైన్ పరిజ్ఞానం టయోటా న్యూ జనరేషన్ ఆర్కిటెక్చర్ (టిఎన్‌జిఎ) ఆధారంగా ఈ సరికొత్త ఫార్చ్యూనర్ రూపొందించబడింది. ఈ ఫ్లాట్‌మీద నూతన వాహనాల బరువు మునుపటి ఉత్పత్తుల కన్నా తక్కువ ఉండేటట్లు నిర్మించడానికి ఆస్కారం ఉంది.

 

Click to compare, buy, and renew Car Insurance online

Buy InsuranceBuy Now

English summary
Toyota Fortuner Crosses An Impressive Milestone
Please Wait while comments are loading...

Latest Photos