ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో విడుదలవుతున్న కార్లు, వాటి వివరాలు

ఇండియన్ మార్కెట్లోకి వివిధ కార్ల తయారీ సంస్థలు ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ గల కార్లను విడుదల చేయడానికి సిద్దమయ్యాయి. వాటి గురించి క్లుప్తంగా...

By Anil

ప్రతి కార్ల తయారీ సంస్థ కూడా తమ అన్ని ఉత్పత్తుల్లో కనీసం ఒక్క వేరియంట్లో అయినా ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఫీచర్‌ను పరిచయం చేయడం ఆనవాయితీగా వస్తోంది. ఈ మధ్య కాలంలో ఆటోమేటిక్ కార్లు అత్యంత ఆదరణ పొందుతున్న నేపథ్యంలో వీటికి డిమాండ్ బాగా పెరిగిపోయింది.

త్వరలో విడుదల కానున్న ఆటోమేటిక్ కార్లు

దీనిని క్యాష్ చేసుకోవడానికి కార్ల తయారీ కంపెనీలు మార్కెట్లోకి విడుదల చేసే తమ ప్రతి ఉత్పత్తిని కూడా ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ వేరియంట్లో విడుదల చేస్తున్నాయి. అందులో ఈ ఏడాది కాలంలో దేశీయంగా విడుదలైన కొన్ని ఉత్పత్తులు ఇప్పుడు ఏఎమ్‌టి ఫీచర్‌ సొగలసులతో మళ్లీ విడుదలకు సిద్దమయ్యాయి. వాటి గురించి నేటి ప్రత్యేక కథనం.

మారుతి సుజుకి వితారా బ్రిజా ఏఎమ్‌టి

మారుతి సుజుకి వితారా బ్రిజా ఏఎమ్‌టి

భారతీయులకు ప్రపథమంగా ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ గల గేర్‌బాక్స్‌ను పరిచయం చేసింది మారుతి సుజుకినే. సెలెరియో ద్వారా పరిచయం చేసి ఆల్టో కె10 కలో అందించి ఇప్పడు మారుతి లోని పెద్ద ఉత్పత్తి వితారా బ్రిజా లో కూడా ఏఎమ్‌టిని ఆటో షిఫ్ట్ గేర్ పేరుతో అందివ్వనుంది.

త్వరలో విడుదల కానున్న ఆటోమేటిక్ కార్లు

మారుతి సుజుకి వితారా బ్రిజా ఆటోమేటిక్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ వేరియంట్లో అదే 1.3-లీటక్ సామర్థ్యం ఉన్న డిడిఐఎస్ డీజల్ ఇంజన్ రానుంది. ఇది సుమారుగా 89బిహెచ్‌పి పవర్ మరియు 200ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయును.

  • విడుదల అంచనా 2016 చివరి నాటికి
  • ధర అంచనా రూ. 9.90-11 లక్షల శ్రేణిలో
  • రెనో లాజీ ఏఎమ్‌టి

    రెనో లాజీ ఏఎమ్‌టి

    ఇండియన్ మార్కెట్లో కార్లు తయారు చేస్తున్న అతి నూతన సంస్థ రెనో. రెనో తాజాగా అభివృద్ది చేసిన ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌కు ఈజీ-ఆర్ పేరుతో నామకరణం చేసింది. ఇప్పటికే ఈజీ-ఆర్ ట్రాన్స్‌మిషన్‌ను తమ బెస్ట్ సెల్లింగ్ కాంపాక్ట్ ఎస్‌యువి డస్టర్‌లో అందించింది. భవిష్యత్తులో తమ శ్రేణిలో ఉన్న ఉత్పత్తుల్లో ఈజీ-ఆర్ ను పరిచయం చేయనుంది. అందులో మొదటిది లాజీ ఎమ్‌పివి వాహనం.

    త్వరలో విడుదల కానున్న ఆటోమేటిక్ కార్లు

    ప్రస్తుతం రెనో తమ లాజీ ఎమ్‌పివిలో ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌ను అందివ్వడానికి ఈజీ-ఆర్ ను అభివృద్ది చేస్తోంది. రెనో లాజీ 1.5-లీటర్ సామర్థ్యం గల డీజల్ ఇంజన్ కలదు. ఇది సుమారుగా బిహెచ్‌పి పవర్ మరియు ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేయగలదు.

    • విడుదల అంచనా: 2017 తొలిసగంలో
    • ధర అంచనా : 10-12 లక్షల శ్రేణిలో
    • రెనో క్విడ్ ఏఎమ్‌టి

      రెనో క్విడ్ ఏఎమ్‌టి

      రెనో ఇండియాకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందడానికి కారణం క్విడ్ అని నిర్మొహమాటంగా చెప్పొచ్చు. ఆధునిక శైలిలో ఎస్‌యువి తరహా రూపం, విభిన్నమైన ఫీచర్లతో ఎంట్రీలెవల్ హ్యాచ్‌బ్యాక్‌గా ఉత్పత్తి అయిన క్విడ్ సంచనాలు సృష్టించింది. ఈ ఏడాది లక్ష యూనిట్ల అమ్మకాల లక్ష్యంతో ఉన్న రెనో ఆగష్టు 2016 నాటికి 87,000 యూనిట్ల విక్రయాలు నమోదయ్యాయి.

      త్వరలో విడుదల కానున్న ఆటోమేటిక్ కార్లు

      ఈ విజయాన్నిఅలాగే కొనసాగించడానికి క్విడ్‌లో 1.0-లీటర్ సామర్థ్యం గల ఇంజన్‌ను అందించారు. ఇప్పడు రెనో తమ ఈజీ-ఆర్ గేర్‌బాక్స్‌ను కూడా అందివ్వడానికి పూర్తిగా సిద్దమయ్యింది. క్విడ్‌లో అనే 799సీసీ మరియు 1.0-లీటర్ సామర్థ్యం ఉన్న పెట్రోల్ ఇంజన్‌లు కలవు.

      • విడుదల అంచనా: 2016 చివరి నాటికి
      • ధర అంచనా: 3-5 లక్షల శ్రేణిలో
      • డాట్సన్ రెడి గో ఏఎమ్‌టి

        డాట్సన్ రెడి గో ఏఎమ్‌టి

        చౌక ఉత్పత్తుల తయారీ సంస్థ పేరుగాంచిన డాట్సన్ ఈ ఏడాదిలో తమ రెడి గో ఎంట్రీ లెవల్ హ్యాచ్‌బ్యాక్‌ను మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. క్విడ్‌లోని ఇంజన్‌తో సరికొత్త బాడీ స్టైల్‌తో పరిచయమైన క్విడ్ అమ్మకాల్లో మంచి ఫలితాలను సాధించింది.

        త్వరలో విడుదల కానున్న ఆటోమేటిక్ కార్లు

        సాంకేతికంగా 799సీసీ సామర్థ్యం ఉన్న పెట్రోల్ ఇంజన్‌ గల డాట్సన్ రెడి గో వేరియంట్లో 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ గల గేర్‌బాక్స్ కలదు, దీనితో పాటు ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌ను అందివ్వడానికి సన్నాహాలు చేస్తోంది డాట్సన్. ఇందుకు రెనోను ఆశ్రయించనుంది.

        • విడుదల అంచనా: ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో
        • ధర అంచనా: 3.5-4.5 లక్షల శ్రేణిలో
        • టాటా టియాగో ఏఎమ్‌టి

          టాటా టియాగో ఏఎమ్‌టి

          ఈ టియాగో విడుదల కాకపోతే టాటా మోటార్స్ మరుగునపడిపోవడం ఖాయం అనేది గ్యారంటీ. టియాగో విడుదలతో భారత దేశపు నాలుగవ అతి పెద్ద కార్ల తయారీ సంస్థగా రికార్డుకెక్కింది టాటా మోటార్స్. పెట్రోల్ మరియు డీజల్ రెండు వేరియంట్లో అందుబాటులో ఉండే టియాగో లో ఇప్పుడు ఆటోమేటిక్ గేర్‌బాక్స్ అందించి అమ్మకాల్లో వేగాన్ని పెంచనుంది.

          త్వరలో విడుదల కానున్న ఆటోమేటిక్ కార్లు

          ప్రస్తుతం టియాగోలో 1.2-లీటర్ సామర్థ్యం ఉన్న మూడు సిలిండర్ల రివట్రాన్ పెట్రోల్ మరియు 1.05-లీటర్ సామర్థ్యం ఉన్న రివొటార్క్ డీజల్ ఇంజన్ కలదు. ఈ రెంటింటిలో వచ్చే ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ జెస్ట్ కాంపాక్ట్ సెడాన్‌లో కూడా పరిచయం కానుంది.

          • విడుదల అంచనా: 2017 తొలి సగంలో
          • ధర అంచనా: 4 - 5 లక్షల ధరల శ్రేణిలో
          • త్వరలో విడుదల కానున్న ఆటోమేటిక్ కార్లు

            • ISIS దాడుల్లో బుల్లెట్లను తిప్పికొట్టిన 1990 కాలం నాటి బిఎమ్‌డబ్ల్యూ
            • ఏఎమ్‌టి కారును నడిపేటపుడు గుర్తుంచుకోవలసిన విషయాలు
            • మహీంద్రా నుండి సరికొత్త అర్మాడా ఎమ్‌యువి

Most Read Articles

English summary
Read In Telugu: Upcoming AMT Cars in India
Story first published: Monday, November 7, 2016, 13:21 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X