కార్ల పండుగ: ఇండియన్ మార్కెట్లోకి వరుసగా విడుదల కానున్న 20 కార్లు

By Anil

రెండు వారాల క్రితం దేశ రాజధాని నగరం ఢిల్లీలో జరిగిన 2016 ఆటో ఎక్స్ పో వేదిక మీద దాదాపుగా 100 కు పైగా కొత్త ప్రదర్శించబడ్డాయి. ఆటో ఎక్స్ పో గడిచిన ఒక వారం కూడా తిరునాళ్లలా, జాతరలా మొత్తానికి కన్నుల పండుగలా జరిగిపోయింది.

కాని ఆ వేదిక మీద ప్రదర్శించిన వాటిలో దాదాపుగా 20 కార్లు మరియు ఇతర వాహనాలు ఈ ఏడాది ముగిసే సమయానికి వరుసగా విడుదల కానున్న. ఒక విధంగా చెప్పాలంటే కార్లను ప్రేమించే వారికి ఇదొక తీపి కబురు. అదే ఎన్నో వాహన తయారీ సంస్థలు వివిధ రకాల కొత్త వాహనాలతో తమ జాతకాలను పరీక్షించుకోనన్నాయి.

తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ పాఠకుల కోసం వరుసగా విడుదలకు సిద్దమైన 20 కార్ల గురించి క్రింది ఈ శీర్షకలో ఇవ్వడం జరిగింది. పూర్తి వివరాలకు క్రింద గల స్లైడర్లను గమనించండి.

20. 2016 స్కోడా సూపర్బ్

20. 2016 స్కోడా సూపర్బ్

స్కోడా ప్రస్తుతం దేశీయ మార్కెట్లో నాలుగు విశిష్ట మోడల్లను మాత్రమే అందిస్తోంది. అయితే ఈ ఏడాది 2016 స్కోడా సూపర్బ్ కారును వీటి సరసన చేరనుంది. ఈ లగ్జరీ సెడాన్ కారును ఈ నెల 23 వ తేదీన మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చుకోనుంది.

Also Read: 2016 స్కోడా సూపర్బ్ లగ్జరీ సెడాన్ కారు గురించి పూర్తి వివరాల కోసం

19. నిస్సాన్ జిటి-ఆర్

19. నిస్సాన్ జిటి-ఆర్

నిస్సాన్ జిటి-ఆర్ సూపర్ కారును నిస్సాన్ మెర్సిడెస్ బెంజ్ వారి ఎఎమ్‌జి జిటిఎస్ మరియు పోర్షే 911 రేంజ్ కార్ల నోర్లు మూయించడానికి ఈ ఏడాది సెప్టెంబర్ లో విడుదల కావడానికి సిద్దమౌతోంది.

Also Read: గాడ్జిల్లా అనే ముద్దుగా సంభోదించే జిటి-ఆర్ గురించి మరిన్ని వివరాలు మరియు ఫోటోల కోసం

18. ఫోర్డ్ మస్టాంగ్

18. ఫోర్డ్ మస్టాంగ్

ఫోర్డ్ మోటార్స్ వారి ఉత్పత్తులన్నింలోకెల్లా అత్యంత విశిష్టమైన కారు మస్టాంగ్. ఫోర్డ్ మోటార్స్ ప్రపంచ వ్యాప్తంగా గత 50 సంవత్సరాల నుండి ఏజాదికి ఒకటి చెప్పున మస్టాంగ్ కారును విడుదల చేసేది. అయితే గత నెల 28 న ఫోర్డ్ ఆరవ తరానికి చెందిన మస్టాంగ్‌ను దేశీయ మార్కెట్లోకి మొదటి సారిగా విడుదల చేసింది.

Also Read: ఫోర్డ్ మస్టాంగ్ గురించి మరిన్ని వివరాలకు.

17. జీప్ బ్రాండ్ ఉత్పత్తులు

17. జీప్ బ్రాండ్ ఉత్పత్తులు

జీప్ బ్రాండ్ తన 75 వార్షికోత్సవం సందర్బంగా దేశీయ మార్కెట్లోకి మూడు సరికొత్త ఆఫ్ రోడ్ వాహనాలతో 2016 ఇండియన్ ఆటో ఎక్స్ పో వేదిక ద్వారా పరిచం చేసింది. అతి త్వరలో వీటిని ఇండియన్ రోడ్ల మీద చూడబోతున్నాం. వీటి దెబ్బతో మార్కెట్లో ఉన్న మహీంద్రా థార్ మరియు బొలెరో వంటి వాటికి పోటీ పెరగనుంది.

Also Read: జీప్ బ్రాండ్ పరిచయం చేసిన ఉత్పత్తుల ఫోటోలు మరియు సాంకేతిక వివరాలు

16.వోక్స్‌వ్యాగన్ పోలో జిటిఐ

16.వోక్స్‌వ్యాగన్ పోలో జిటిఐ

ఇండియన్ హ్యాచ్‌బ్యాక్‌ల లిస్ట్‌లోకి సరికొత్త పోలో జిటిఐ ను ప్రవేశపెట్టి విధ్వసం సృష్టించాలని వోక్స్‌వ్యాగన్ పథకం వేస్తోంది. దీనికి 2016 సంవత్సరాన్ని వేదికగా చేసుకుంటోంది. మూడు డోర్లతో వస్తున్న మొట్ట మొదటి కారు కూడా ఇదే. Also Read: వోక్స్‌వ్యాగన్ పోలో జిటిఐ గురించి మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

15. ఫియట్ లీనియా

15. ఫియట్ లీనియా

ఫియట్ మోటార్స్ వారు ఢిల్లీలో జరిగిన 2016 ఇండియన్ ఆటో ఎక్స్ పో వేదిక మీద సరికొత్త ఫియట్ లీనియా 125 ఎస్ అనే సెడాన్ కారును ప్రదర్శించింది. దీనిని కూడా ఏడాదిలో మార్కెట్లోకి విడుదల చేయడానికి ఏర్పాట్లు చేసుకుంటోంది. Also Read: ది బెస్ట్ సెడాన్ అని ఎక్స్ పోలో పేరు తెచ్చుకున్న లీనియా 125 ఎస్ గురించి మరిన్ని వివరాలకు

14. టయోటా ప్రియస్

14. టయోటా ప్రియస్

హైబ్రిడ్ కార్లను ప్రవేశపెట్టడంలో టయోటా మోటార్స్‌కు ఎవ్వరూ సాటిరారు. టయోటా తమ నాలుగవ తరానికి చెందిన సరికొత్త టయోటా ప్రియస్ హైబ్రిడ్ కారును ఏడాదిలోపు విడుదల కానుంది. Also Read: టయోటా ప్రియస్ హైబ్రిడ్ కారు గురించి పూర్తి వివరాలకు.

13. హోండా అకార్డ్

13. హోండా అకార్డ్

హోండా మోటార్స్ గతవారంలో థాయిలాండ్‌లో తమ అకార్డ్ సెడాన్ కారును విడుదల చేసింది. భారతీయ మార్కెట్లో దీని విడుదల గురించి హోండా ప్రతినిధులను మా బృదం కదిలించగా, ఈ అకార్డ్ కారును ఈ ఏడాదిన ఇండియాలో విడుదల చేయనున్నారు. ఈ మాటతో ఇది కూడా భారత్‌లో విడుదలకు సిద్దమైన కార్ల జాబితాలో చేరిపోయింది. Also Read: హోండా అకార్డ్ గురించి సంక్షిప్త సమాచారం కోసం

12.హ్యుందాయ్ టుసాన్

12.హ్యుందాయ్ టుసాన్

హ్యుందాయ్ ఇప్పటికే మార్కెట్లోకి విడుదల చేసిన క్రెటా మంచి ఫలితాలను సాధిస్తోంది. అయితే మరొక సారి విప్లవాన్ని తీసుకురావడానికన్నట్లుగా టుసాన్ ఎస్‌యువిని విడుదల చేయనుంది. Also Read: హ్యుందాయ్ టుసాన్ ధర, సాంకేతిక వివరాలకు.

11. రెనో క్విడ్ 1.0-లీటర్ ఏఎమ్‌టి మోడల్

11. రెనో క్విడ్ 1.0-లీటర్ ఏఎమ్‌టి మోడల్

రెనో క్విడ్ ఆరు మాసాల క్రితం భారతీయ ఎంట్రీలెవల్ కార్ల మార్కెట్లో మారు మ్రోగిపోయింది. దీని ఎంట్రీతో ఆల్టో కారుకు తీవ్ర పోటిని సృష్టించింది. రెనో క్విడ్ విశేష ప్రజాదరణ పొందిన నేపథ్యంలో రెనో ఈ క్విడ్ కారును 1.0-లీటర్ ఇంజన్ గల ఆటోమేటిక్ గేర్ బాక్స్‌తో విడుదల చేయనుంది.

Also Read: రెనో క్విడ్ 1.0లీటర్ ఏఎమ్‌టి గురించి పూర్తి వివరాల కోసం

10. వోక్స్‌వ్యాగన్ అమియో

10. వోక్స్‌వ్యాగన్ అమియో

వోక్స్‌వ్యాగన్ వారు తమ కాంపాక్ట్ సెడాన్ కారు అమియోను ఈ ఏడాది మలిసగంలో మార్కెట్లోకి అందుబాటులోకి తీసుకురానున్నారు. దీనిని మారుతి సుజుకి స్విఫ్ట్ డిజైర్, హ్యుందాయ్ జెంట్ మరియు హోండా అమేజ్‌లకు పోటీగా విడుదల చేయనున్నారు. ఫిబ్రవరి 2 వ తేదీన వోక్స్‌వ్యాగన్ తమ అమియో కారును ఆవిష్కరించింది,

దీనికి చెందిన మరిన్ని వివరాలకు

09. టయోటా ఇన్నోవా క్రిస్టా

09. టయోటా ఇన్నోవా క్రిస్టా

జపాన్‌కు చెందిన టయోటా మోటార్స్ వారు దేశీయ మార్కెట్లోకి విడుదల చేసిన ఇన్నోవా ఎమ్‌పివి కారు విపరీతమైన విజయం సాధించింది. అందుకోసం టయోటా ఇన్నోవా కారుకు కొన్ని మార్పులు చేర్పులు చేసి క్రిస్టా పేరు దీనిని అందుబాటులోకి తీసుకువస్తోంది. Also Read: టయోటా ఇన్నోవా క్రిస్టా కారు గురించి మరిన్ని వివరాలు ఆటో ఎక్స్ పో నుండి.

08. టాటా హెక్సా క్రాసోవర్

08. టాటా హెక్సా క్రాసోవర్

టాటా మోటార్స్ దేశ వ్యాప్తంగా తానే నిరూపించుకునే అవకాశం హెక్సా ద్వారా వచ్చింది. అవును ఎన్నో ఏళ్లుగా సరైన ఫలితాలు సాధించలేకపోతున్న టాటా మోటార్స్ ఈ సారి హెక్సా విడుదలతో భవిష్యత్తునే మార్చేసుకోనుంది. దేశీయ ఎస్‌యువి మిగతా వాటికి మంచి పోటిని ఇవ్వనుంది. Also Read: టాటా హెక్సా క్రాసోవర్ ధర, సాంకేతిక వివరాల గురించి తెలుసుకోండి.

07. టాటా జికా

07. టాటా జికా

టాటా మోటార్స్ వారు వాణిజ్య వాహనాలతో పాటు కార్లలో మంచి ఉత్పత్తులను ప్రవేశ పెడుతోంది. అందుకు నిదర్శనం అయిన లేటెస్ట్ హ్యాచ్‌బ్యాక్ కారు జికా.దీనిని బోల్ట్‌కు క్రింది స్థానంలో అందిస్తున్నట్లు టాటా మోటార్స్ తెలిపింది. Also Read: టాటా జికా టెస్ట్ డ్రైవ్ వివరాలు గురించి తెలుసుకోండి.

06. డాట్సన్ రెడి గో

06. డాట్సన్ రెడి గో

డాట్సన్ ఇండియా దేశీయ ఎంట్రీలెవల్ హ్యాచ్‌బ్యాక్ కార్లలోకి ఆల్టో, క్విడ్ మరియు హ్యుందాయ్ వారి ఇయాన్ కార్లకు గట్టి పోటీగా 3.5 లక్షల ప్రారంభ ధరతో ఈ ఏడాది మలిసగంలో మార్కెట్లోకి విడుదల చేయనున్నారు.

Also Read: డాట్సన్ రెడి గో కారు గురించి మరిన్ని వివరాలకు

05. హోండా బిఆర్‌వి

05. హోండా బిఆర్‌వి

హోండా మోటార్స్ వారు 2016 ఆటో ఎక్స్ పో వేదిక మీద్ ప్రదర్శించిన బిఆర్‌-వి కాంపాక్ట్ ఎస్‌యువిని ఈ ఏడాదిలోపు మార్కెట్లోకి అమ్మకాలకు సిద్దం చేయనున్నారు. దీని రాకతో ఎస్‌యువి మార్కెట్లో పోటీ మరింత తీవ్రతరం అయిందని చెప్పవచ్చు. Also Read: హోండా బిఆర్‌-వి గురించి పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

04.రెనో డస్టర్ ఫేస్‌లిఫ్ట్

04.రెనో డస్టర్ ఫేస్‌లిఫ్ట్

రెనో ఇండియా ఇప్పుడిప్పుడే దేశీయ ఆటోమొబైల్ మార్కెట్లో తనకంటూ ఓ స్థానం ఏర్పరుచుకుంటోంది. అందుకు నిదర్శనం రెనో క్విడ్ మరియు రెనో డస్టర్. రెనో వారు పరిచయం చేసిన డస్టర్ ఎస్‌యువి మార్కెట్లో మంచి అమ్మకాలను సాధించడంతో ఇపుడు ఏఎమ్‌టి ఫేస్‌లిఫ్ట్ వర్షెన్‌లో దీనిని విడుదల చేయనుంది. రెనో డస్టర్ ఏఎమ్‌టి ఫేస్‌లిఫ్ట్ గురించి పూర్తి వివరాలు తెలుసుకోండి.

03.మారుతి సుజుకి బాలెనొ ఆర్‍‌‌ఎస్

03.మారుతి సుజుకి బాలెనొ ఆర్‍‌‌ఎస్

మారుతి సుజుకి వారి అత్భుతమైన డిజైన్‌లలో బాలెనొ అత్భుతం. దీని మొదటి సారిగా మార్కెట్లోకి విడుదల అయినపుడు కనీవిని ఎరుగని బుకింగ్స్‌ నమోదుచేసుకుంది. ఇపుడు భారీ అమ్మకాలను సాదిస్తోంది. అందుకోసం బాలెనొ నుండి ఆర్‌ఎస్ బ్యాడ్జితో సరికొత్త బాలెనొ కారును అతి త్వరలో విడుదల చేయనుంది. Also Read: బాలెనొ ఆర్‍‌‌ఎస్ గురించి పూర్తిగా తెలుసుకోండి

02. మారుతి సుజుకి ఇగ్నిస్

02. మారుతి సుజుకి ఇగ్నిస్

మారుతి సుజుకి క్రాసోవర్ మార్కెట్లోకి సరికొత్త ఇగ్నిస్ కారును విడుదల చేయనుంది. మంచి డిజైన్, రెండు ఇంజన్ ఆప్షన్లతో అత్యుత్తమ మైలేజ్ తో విడుదల కానున్న ఇగ్నిస్ క్రాసోవర్ ధర దాదాపుగా 4.5 లక్షల నుండి ప్రారంభం కానుంది.Also Read: మారుతి సుజుకి ఇగ్నిస్ క్రాసోవర్ గురించి పూర్తివివరాలు కోసం

01. మారుతి సుజుకి వితారా బ్రిజా

01. మారుతి సుజుకి వితారా బ్రిజా

మారుతి సుజుకి ఇండియన్ మార్కెట్లోకి ముచ్చటగా మూడవ మోడల్ వితారా బ్రిజా వాహనాన్ని అందిస్తోంది. మార్కెట్లోకి విడుదల చేయడానికి మారుతి అమితాశక్తితో ఉంది. ఈ ఎస్‌యువి మార్కెట్లోకి విడుదల అయితే ప్రారంభ ధర రూ. 7.5 లక్షలుగా ఉండనుంది.

మారుతి సుజుకి వితారా బ్రిజా గురించి పూర్తి వివరాలు కోసం

Most Read Articles

English summary
up coming car launhes in india
Story first published: Friday, February 19, 2016, 17:27 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X