ఇండియన్ కస్టమర్ల టేస్ట్‌కు అనుగుణంగా విడుదల కానున్న ఎస్‌యువిలు

By Anil

ఇండియన్స్ ఎంచుకునే కార్లు పూర్తిగా మారిపోయాయి. ఎంచుకునే కార్ల టేస్ట్‌లో ఎన్నో మార్పులు వచ్చాయి. అందుకు నిదర్శనం ఇప్పుడు మంచి అమ్మకాలు సాధిస్తున్న ఎస్‌యువి సెగ్మెంట్. వీటి ప్రభావం మిగతా సెగ్మెంట్లలోని వాహనాల మీద కూడా పడింది. ఎంట్రీలెవల్, హ్యాచ్‌బ్యాక్‌లలో కూడా ఎస్‌యువి తరహాలో ఉన్న వాటికి మంచి డిమాండ్ ఏర్పడింది.

తయారీ దారులు కూడా వినియోగదారుల అభిరుచికి తగ్గట్లుగా ఎస్‌యువిలను తమదైన శైలిలో అందిస్తున్నారు. క్రింది కథనం ద్వారా త్వరలో విడుదల కానున్న ఎస్‌యువిల గురించి.

టాటా హెక్సా

టాటా హెక్సా

టాటా మోటార్స్ వారు ఇంతకు మునుపు అందించిన అరియా ఎస్‌యువి పెద్దాగ విజయం సాధించలేదు. ఇప్పుడు దాని పోలికలతో హెక్సా ఎస్‌యువిని అభివృద్ది చేసింది. ఇది సరికొత్త డిజైన్ లాంగ్వేజ్‌లో మన ముందుకు అతి త్వరలో రానుంది. ఇందులో అత్యంత విశ్వసనీయమైన ఫీచర్లుగా చెప్పుకునే ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్, ఎల్‌ఇడి డిఆర్ఎల్స్ మరియు అత్యంత స్పేసియస్‌గా ఉండేందుకు 4,764ఎమ్ఎమ్ పొడవు, 1895ఎమ్ఎమ్ వెడల్పు, 1,780ఎమ్ఎమ్ ఎత్తు ఉండే విధంగా డిజైన్ చేశారు.

హెక్సా ఇంజన్, ధర మరియు విడుదల వివరాలు

హెక్సా ఇంజన్, ధర మరియు విడుదల వివరాలు

టాటా మోటార్స్ ఇందులో 2.2-లీటర్ సామర్థ్యం ఉన్న నాలుగు సిలిండర్ల వారికోర్ డీజల్ ఇంజన్‌ను అందిస్తోంది. ఇది సుమారుగా 154బిహెచ్‌పి పవర్ మరియు 400ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను 6-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ ద్వారా చక్రాలకు అందుతుంది.

  • విడుదల అంచనా: అక్టోబర్ 2016
  • ధర అంచనా : 13 నుండి 18 లక్షలు.
  • నెక్ట్స్ జెన్ టయోటా ఫార్చ్యూనర్

    నెక్ట్స్ జెన్ టయోటా ఫార్చ్యూనర్

    ఇండియాలో అత్యంత పాపులారిటి తెచ్చుకున్న ఖరీదైన ఎస్‌యువిలలో ఫార్చూనర్ ఒకటి. ఇపుడు దీనిని నెక్ట్స్ జెన్ ఫార్చ్యూనర్‌గా అందుబాటులోకి తీసుకువస్తోంది టయోటా. ఇప్పటికే ఇది దేశీయ రహదారుల మీద పరీక్షలకు గురైంది. ముందున్న దానికన్నా లైట్ వెయిట్‌గా, మంచి ధృడంగా మరియు శక్తివంతంగా రూపొందిస్తున్నారు. అందుకోసం టయోటా వారి నూతన టిఎన్‌జిఎ ప్లాట్‌ఫామ్‌ను ఉపయోగిస్తున్నారు.

     ఫార్చ్యూనర్ సాంకేతిక, ధర మరియు విడుదల వివరాలు

    ఫార్చ్యూనర్ సాంకేతిక, ధర మరియు విడుదల వివరాలు

    టయోటా ఈ సరికొత్త ఫార్చ్యూనర్‌లో 148బిహెచ్‌పి పవర్ మరియు 400ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయగల 2.4-లీటర్ 2జిడి-ఎఫ్‌టివి ఇంజన్ మరియు 177బిహెచ్‌పి పవర్ మరియు 450ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయగల 1జిడి-ఎఫ్‌టివి ఇంజన్‌ను అందిస్తున్నారు. ఈ రెండు ఇంజన్‌లు కూడా 6-స్పీడ్ మ్యాన్యువల్ లేదా ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌లో వచ్చే అవకాశాలు ఉన్నాయి.

    • విడుదల అంచనా : జనవరి 2017
    • ధర అంచనా : 28 నుండి 32 లక్షలు.
    • హ్యుందాయ్ టుసాన్

      హ్యుందాయ్ టుసాన్

      హ్యుందాయ్ మోటార్స్ ఇండియన్ మార్కెట్ కోసం రూపొందిస్తున్న టుసాన్ ఎస్‌యువిని ప్రస్తుతం ఉన్న క్రెటా మరియు శాంటా ఫి వాహనాల మధ్య స్థానాన్ని భర్తీ చేయనుంది. దీనిని ఫ్లూయిడిక్ స్కల్ప్‌చర్ 2.0 డిజైన్ భాషలో అభివృద్ది చేస్తున్నారు. ఇందులో డ్రైవింగ్‌కు అత్యంత సౌలభ్యం కలిగించే విధంగా అటానమస్ ఎమర్జెన్సీ బ్రేకింగ్, లేన్ కీపింగ్ అసిస్ట్ మరియు బ్లైండ్ స్పాట్ డిటెక్షన్ ఫీచర్లను అందిస్తోంది. అదే విధంగా సీట్లు, అప్ హోల్‌స్ట్రే, స్టీరింగ్, గేర్ నాబ్ వంటి వాటికి లెథర్ తొడుగులు అందిస్తున్నారు.

      టుసాన్ సాంకేతిక, ధర మరియు విడుదల వివరాలు

      టుసాన్ సాంకేతిక, ధర మరియు విడుదల వివరాలు

      ఈ టుసాన్‌ ఎస్‌యువిలో వచ్చే ఇంజన్ గురించి హ్యుందాయ్ ఇంకా ప్రకటించలేదు. అయితే ఇందులో రెండు రకాలుగా పవర్ ఉత్పత్తి చేసే 2.0-లీటర్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ రెండు డీజల్ ఇంజన్‌లు వరుసగా 134బిహెచ్‌పి పవర్ మరియు 181బిహెచ్‌పి పవర్ ‌ను ఉత్పత్తి చేయును. ఈ రెండింటికి 6-స్పీడ్ మ్యాన్యువల్ లేదా ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి.

      • విడుదల అంచనా : అక్టోబర్ 2016
      • ధర అంచనా : 18 నుండి 22 లక్షలు.
      • జాగ్వార్ ఎఫ్-పేస్

        జాగ్వార్ ఎఫ్-పేస్

        జాగ్వార్ వారి మొట్ట మొదటి ఎస్‌యువి ఎఫ్-పేస్ అతి త్వరలో ఇండియన్ రహదారి తీరాలను తాకనుంది. వచ్చే పండుగ సీజన్ నాటికి దీనిని దేశీయంగా అందుబాటులోకి తీసుకురావడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రారంభంలో పెట్రోల్ వేరియంట్లో అందించి నెమ్మదిగా డీజల్ వేరియంట్ ఎఫ్-పేస్‌లను విడుదల చేయనున్నారు. ఇందులో టెర్రైన్ రెస్పాన్స్ సిస్టమ్ మరియు ఎస్‌యువిలలో ఉండాల్సిన అతి ముఖ్యమైన ఫీచర్లు పరిచయం కానున్నాయి.

        జాగ్వార్ ఎఫ్-పేస్ లోని సాంకేతిక, ధర మరియు విడుదల వివరాలు

        జాగ్వార్ ఎఫ్-పేస్ లోని సాంకేతిక, ధర మరియు విడుదల వివరాలు

        జాగ్వార్ తమ ఎఫ్-పేస్ ఎస్‌యువిలో 2.0-లీటర్ సామర్థ్యం ఉన్న పెట్రోల్ ఇంజన్‌ను అందివ్వనున్నారు, ఇది సుమారుగా 177బిహెచ్‌పి పవర్ మరియు 240ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయును. ఇక డీజల్ వేరియంట్‌ను 2017 చివరి నాటికి అందుబాటులోకి తీసుకురానున్నారు.

        • విడుదల అంచనా : అక్టోబర్ 2016
        • ధర అంచనా : 75 నుండి 90 లక్షలు.
        • జీప్ గ్రాండ్ చిరోకీ

          జీప్ గ్రాండ్ చిరోకీ

          జీప్ సంస్థ చాలా కాలం తరువాత తమ ఉత్పత్తి గ్రాండ్ చిరీకో ద్వారా దేశీయంగా కార్యకలాపాలను ప్రారంభించనుంది. జీప్ తమ గ్రాండ్ చిరోకీ మరియు వ్రాంగ్లర్‌లను సెప్టెంబర్ 1 న దేశీయంగా విడుదల చేయనుంది. గ్రాండ్ చిరోకీలో 240బిహెచ్‌పి పవర్‌ ఉత్పత్తి చేయగల 3.0-లీటర్ వి6 ఎకో డీజల్ ఇంజన్‌ను అందివ్వనుంది

          విడుదల మరియు ధర వివరాలు

          విడుదల మరియు ధర వివరాలు

          • విడుదల అంచనా : ఆగష్టు 31, 2016
          • ధర అంచనా : 65 లక్షల వరకు
          • జీప్ వ్రాంగ్లర్

            జీప్ వ్రాంగ్లర్

            ఆఫ్ రోడర్‌కు ప్రత్యేకంగా ఉన్న వ్రాంగ్లర్‌ను కూడా గ్రాండ్ చిరోకీ తో దేశీయంగా విడుదల చేయనుంది. ఇందులో 197బిహెచ్‌పి పవర్ మరియు 460ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయగల ఇంజన్‌ను అందిస్తున్నారు. దీనికి 8-స్పీడ్ ఆటోమేటిర్ ట్రాన్స్‌మిషన్ గల గేర్‌బాక్స్‌ను అనుసంధానం చేస్తున్నారు.

            విడుదల మరియు ధర వివరాలు

            విడుదల మరియు ధర వివరాలు

            • విడుదల అంచనా : ఆగష్టు 31, 2016
            • ధర అంచనా : 30 లక్షల వరకు
            • మిత్సుబిషి పజేరో ఫేస్‌లిఫ్ట్

              మిత్సుబిషి పజేరో ఫేస్‌లిఫ్ట్

              చివరి మిత్సుబిషి పజేరో ఫేస్‌లిఫ్ట్‌ను 2014 లో దేశీయంగా అందుబాటులోకి తెచ్చారు. ఇప్పుడు తాజా పజేరో ఫేస్‌లిఫ్ట్‌ను ఈ ఏడాది చివరి నాటికి అందుబాటులోకి తీసుకురానున్నారు. అవుట్ ల్యాండర్‌కు ఉన్న డైనమిక్ షీల్డ్ డిజైన్ ల్యాంగ్వేజ్‌ను ఇందులో పరిచయం చేస్తున్నారు. ఎల్‌‌ఇడి డే టైమ్ రన్నింగ్ ల్యాంప్స్, పెద్ద ఎయిర్ డ్యామ్ తో రానుంది.

              పజేరో ఫేస్‌లిఫ్ట్ ఇంజన్, ధర మరియు విడుదల వివరాలు

              పజేరో ఫేస్‌లిఫ్ట్ ఇంజన్, ధర మరియు విడుదల వివరాలు

              ఇందులో మిత్సుబిషి 2.4-లీటర్ సామర్థ్యం ఉన్న ఎమ్‌ఐవిఇసి టర్బో డీజల్ ఇంజన్‌ను అందిస్తోంది. ఇది సుమారుగా 150బిహెచ్‌పి పవర్‌ను ఉత్పత్తి చేయగలదు. ఇందులోని ఇంజన్‌కు 8-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ గల గేర్‌బాక్స్‌ను అనుసంధానం చేయనున్నారు.

              • విడుదల అంచనా : నవంబర్, 2016
              • ధర అంచనా : 22 నుండి 26 లక్షల మధ్య.
              • టాటా నెక్సాన్

                టాటా నెక్సాన్

                టాటా మోటార్స్ నుండి విడుదల కావడానికి ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఎస్‌యువి నెక్సాన్. ఇప్పటికే దీని గురించి దేశ వ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి. ఈ ఏడాది చివరి నాటికి అందుబాటులోకి రానుంది. ఇది దేశీయంగా విడుదలైతే మారుతి వితార బ్రిజా, ఫోర్డ్ ఎకో స్పోర్ట్ మరియు మహీంద్రా టియువి300 లకు పోటీగా నిలవనుంది.

                నెక్సాన్ ఇంజన్, ధర మరియు విడుదల వివరాల గురించి

                నెక్సాన్ ఇంజన్, ధర మరియు విడుదల వివరాల గురించి

                టాటా మోటార్స్ ఇందులో 1.5-లీటర్ డీజల్ మరియు 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్‌లను పరిచయం చేయనుంది. ఈ రెండు ఇంజన్‌లకు 5-స్పీడ్ మ్యాన్యువల్ మరియు ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌ గల గేర్‌బాక్స్‌ను అనుసంధానం చేయనుంది.

                • విడుదల అంచనా : డిసెంబర్, 2016 నాటికి
                • ధర అంచనా : 6 నుండి 10 లక్షల మధ్యన.
                • నిస్సాన్ ఎక్స్ ట్రయల్ హైబ్రిడ్

                  నిస్సాన్ ఎక్స్ ట్రయల్ హైబ్రిడ్

                  నిస్సాన్ దేశీయంగా మొదటి హైబ్రిడ్ ఎస్‌యువి ని ఎక్స్ ట్రయల్ రూపంలో తీసుకురానుంది. ఈ ఎక్స్ ట్రయల్‌ను నూతన వేదిక మీద అభివృద్ది చేస్తోంది. నిస్సాన్ పరిచయం హైబ్రిడ్ ఎస్‌యువిని పరిచయం చేస్తున్న నాలువ మార్కెట్‌ ఇది. ఇందులో గరిష్ట వీల్ బేస్‌ను అందిస్తున్నారు తద్వారా క్యాబిన్‌లో గరిష్ట లెగ్ రూమ్ ఉండే అవకాశాలు ఉన్నాయి.

                  ఎక్స్ ట్రయల్ హైబ్రిడ్ ఎస్‌యువిలోని ఇంజన్, ధర మరియు విడుదల వివరాలు

                  ఎక్స్ ట్రయల్ హైబ్రిడ్ ఎస్‌యువిలోని ఇంజన్, ధర మరియు విడుదల వివరాలు

                  ఇందులో 2.0-లీటర్ పెట్రోల్ ఇంజన్‌కు 32 కిలోవాట్ సామర్థ్యం ఉన్న ఎలక్ట్రిక్ ఇంజన్‌ను అనుసంధానం చేశారు. దీనిని పూర్తిగ కంప్లీట్లి బిల్ట్ యూనిట్‌గా విడుదల చేయనున్నారు.

                  • విడుదల అంచనా : జనవరి 2017
                  • ధర అంచనా: 30 నుండి 35 లక్షల మధ్య.
                  • వోక్స్‌వ్యాగన్ టిగువాన్

                    వోక్స్‌వ్యాగన్ టిగువాన్

                    వోక్స్‌వ్యాగన్ సంస్థ తమ మొదటి ఎస్‌యువిని అతి త్వరలో దేశీయంగా అందుబాటులోకి తీసుకురానున్నరు. దీనిని ఎక్కువ పొడవు, వెడల్పు మరియు వీల్ బేస్‌తో డిజైన్ చేస్తూనే లైట్ వెయిట్ గా ఉండటానికి ఎమ్‌క్యుబి ఫ్లాట్ ఫామ్‌ను వినియోగించుకున్నారు. టిగువాన్‌లో ఫ్రంట్ అసిస్ట్, సిటి ఎమర్జెన్సీ బ్రేకింగ్, పెడస్ట్రేన్ మానిటరింగ్, లేన్ అసిస్ట్ ఆటో మేటిక్ పోస్ట్ కొల్లిషన్ బ్రేకింగ్ సిస్టమ్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

                    టిగువాన్ ఇంజన్, ధర మరియు విడుదల వివరాలు

                    టిగువాన్ ఇంజన్, ధర మరియు విడుదల వివరాలు

                    వోక్స్‌వ్యాగన్ ఈ టిగువాన్ ఎస్‌యువిలో 2.0-లీటర్ సామర్థ్యం ఉన్న టిడిఐ ఇంజన్‌ను అందిస్తోంది. ఇది సుమారుగా 147బిహెచ్‌పి‌ పవర్‌ను ఉత్పత్తి చేయును. దీనికి 6-స్పీడ్ మ్యాన్యువల్ లేదా 7-స్పీడ్ డిఎస్‌జి గేర్‌బాక్స్‌ను అందించే అవకాశాలు ఉన్నాయి.

                    • విడుదల అంచనా : మార్చి 2017 నాటికి
                    • ధర అంచనా: 30 నుండి 35 లక్షల మద్య.
                    • స్కోడా కొడియాక్

                      స్కోడా కొడియాక్

                      స్కోడా ఆటో వారి మొదటి ఎస్‌యువి కొడియాక్ ఇండియాలో విడుదల కానుంది. అంతే కాకుండా అంతర్జాతీయ మార్కెట్లోకి కూడా దీనిని ప్రవేశ పెట్టనున్నారు. స్పై ఫోటోల ద్వారా ఇది లగ్జరీ ప్రీమియమ్ ఎస్‌యువిగా ఉండనుంది.

                      కొడియాక్ ఇంజన్, ధర మరియు విడుదల వివరాలు

                      కొడియాక్ ఇంజన్, ధర మరియు విడుదల వివరాలు

                      స్కోడా దీనిని 7-సీటింగ్ మరియు 5-సీటింగ్ ఆప్షన్‌లలో డిజైన్ చేస్తున్నారు. దీనికి సంభందించిన సాంకేతిక వివరాలను స్కోడా చాలా గోప్యంగా ఉంచింది.

                      • విడుదల అంచనా: 2017 మధ్య బాగానికి
                      • ధర అంచనా: 30 లక్షల వరకు ఉండవచ్చు

Most Read Articles

English summary
Upcoming SUVs In India — It's Worth The Wait
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X