అమియో కాంపాక్ట్ సెడాన్ కారును విడుదల చేసిన వోక్స్‌వ్యాగన్

By Anil

జర్మనీకు చెందిన ప్రముఖ కార్ల తయారీ దిగ్గజం సంస్థ వోక్స్‌‌వ్యాగన్ దేశీయ మార్కెట్లోకి అమియో పేరుతో నాలుగు మీటర్ల లోపున్న మొదటి కాంపాక్ట్ సెడాన్ కారును విడుదల చేసింది. అమియో సెడాన్ కారును ప్రారంభ ధర రూ. 5.14 లక్షలు ఎక్స్ షోరూమ్ (ముంబాయ్)గా విడుదల చేశారు. వోక్స్‌వ్యాగన్ సంస్థ ఈ అమియో కాంపాక్ట్ సెడాన్ కారును జూలై నుండి దేశ వ్యాప్తంగా అందుబాటులోకి తీసుకురానున్నారు. మరియు మొబైల్ యాప్ ద్వారా వీటికి చెందిన ముందస్తు బుకింగ్‌లను చేసుకోవచ్చు. అమియో యొక్క సాంకేతిక వివరాలు మరియు ఫీచర్లు గురించి పూర్తి వివరాల కోసం క్రింది స్లైడర్లను పరిశీలించండి.

ధర వివరాలు

ధర వివరాలు

  • ట్రెండ్ లైన్ ధర రూ. 5,24,300 లు
  • కంఫర్ట్‌లైన్ ధర రూ. 5,99,950 లు
  • హైలైన్ ధర రూ. 7,05,900 లు
  • అన్ని ధరలు ఎక్స్ షోరూమ్ (ఢిల్లీ)గా ఉన్నాయి.
    వోక్స్ వ్యాగన్ అమియో సాంకేతిక వివరాలు

    వోక్స్ వ్యాగన్ అమియో సాంకేతిక వివరాలు

    వోక్స్‌వ్యాగన్ ఇండియా తమ మొదటి కాంపాక్ట్ సెడాన్ కారు అమియోను కేవలం పెట్రోల్ ఇంజన్ వేరియంట్లో మాత్రమే అందుబాటులోకి తెచ్చింది.

    అమియో కాంపాక్ట్ సెడాన్ కారును విడుదల చేసిన వోక్స్‌వ్యాగన్

    అమియోలో వోక్స్‌వ్యాగన్ అందించిన 1.2 లీటర్ ఎమ్‌పిఐ పెట్రోల్ ఇంజన్ 74 బిహెచ్‌పి పవర్ మరియు 110 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

    అమియో కాంపాక్ట్ సెడాన్ కారును విడుదల చేసిన వోక్స్‌వ్యాగన్

    ఇందులోని ఇంజన్‌కు వోక్స్‌వ్యాగన్ వారు 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ గల ట్రాన్స్‌మిషన్‌ను అనుసంధానం చేశారు. ఇందులోని ఇంజన్‌ను మనమ పోలో కారులో కూడా గుర్తించవచ్చు.

    వోక్స్‌వ్యాగన్ అమియోలోని ఫీచర్లు

    వోక్స్‌వ్యాగన్ అమియోలోని ఫీచర్లు

    వోక్స్‌వ్యాగన్ సంస్థ ఈ సెగ్మెంట్లో ఎవ్వరూ పరిచయం చేయని విధంగా మొదటి సారిగా ఫీచర్లను అందించింది. అవి,

    • క్రూయిజ్ కంట్రోల్,
    • రెయిన్ సెన్సింగ్ పైపర్లు,
    • యాంటి పించ్ విండోలు,
    • అమియో కాంపాక్ట్ సెడాన్ కారును విడుదల చేసిన వోక్స్‌వ్యాగన్

      • రియర్ వ్యూవ్ కెమెరా,
      • పార్కింగ్ సెన్సార్లు,
      • ఐప్యాడ్ కమెక్టివిటి గల ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్,
      • కూల్డ్ గ్లూవ్ బాక్స్ మరియు
      • వెనుక వైపున గల ఏ/సి వెంట్‌లు కలవు.
      • ప్రత్యేకతలు

        ప్రత్యేకతలు

        టిల్ట్ మరియు టెలిస్కోపిక్ స్టీరింగ్, అల్లాయ్ వీల్స్, ఆటో డిమ్మింగ్ ఇవ్వగల ఐఆర్‌విఎమ్, ఎలక్ట్రిక్ ద్వారా విచ్చుకునే మరియు ముడుచుకున్ అవుట్ సైడ్ రియర్ వ్యూవ్ మిర్రర్స్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, స్టాటిక్ కార్నరింగ్ లైట్లు మరియు సెంట్రల్ లాకింగ్ వంటి అదనపు ఫీచర్లు ఇందులో ఉన్నయి.

        అమియోలోని భద్రత ఫీచర్లు

        అమియోలోని భద్రత ఫీచర్లు

        ప్రస్తుతం ఆధునిక ప్రపంచంలో కార్ల అమ్మకాలు ఆశించిన స్థాయిలో జరగాలంటే వాటిలో తగినన్ని భద్రత ఫీచర్లు తప్పనిసరిగా ఉండాలి అందుకోసం వోక్స్‌వ్యాగన్ ఈ అమియోలో

        • యాంటి లాక్ బ్రేకింగ్ సిస్టమ్
        • డ్రైవర్ మరియు ప్యాసింజర్ ఎయిర్ బ్యాగులు
        • లేన్ ఛేంజ్ ఇండికేటర్
        • ఎలక్ట్రానిక్ యాంటి థెఫ్ట్ ఇమ్మొబిలైజర్
        • అమియో సెడాన్‌ పై పోటీదారులు

          అమియో సెడాన్‌ పై పోటీదారులు

          ఇండియన్ మార్కెట్లోకి విడుదలైన అమియో కాంపాక్ట్ సెడాన్ కారు ప్రస్తుతం ఉన్న మారుతి సుజుకి స్విఫ్ట్ డిజైర్, ఫోర్డ్ ఫిగో ఆస్పైర్, హోండా అమేజ్ మరియు హ్యుందాయ్ జెంట్.

          అమియో కాంపాక్ట్ సెడాన్ కారును విడుదల చేసిన వోక్స్‌వ్యాగన్

          రిలయన్స్ దిగ్గజ అధినేత ముఖేష్ అంబానీ లగ్జరీ కారు హోమ్!

          బరాక్ ఒబామా బీస్ట్ కారు గురించి..

Most Read Articles

English summary
Volkswagen Ameo Compact Sedan Launched In India For Rs. 5.14 Lakh
Story first published: Tuesday, June 7, 2016, 11:37 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X