ప్రపంచపు బెస్ట్ హ్యాచ్‌బ్యాక్‌ను ఇండియాకు తీసుకొస్తున్న వోక్స్‌వ్యాగన్

Written By:

వోక్స్‌వ్యాగన్ గోల్ఫ్ జిటిఐ, ప్రపంచ వ్యాప్తంగా అత్యధికంగా అమ్ముడుపోతున్న ఏకైక హ్యాచ్‌బ్యాక్. విడుదల సమయం నుండి ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాల్లో వయస్సుతో సంభందం లేకుండా ఈ గోల్ఫ్ జిటిఐ ని భారీ సంఖ్యలో ఎంచుకుంటున్నారు. వోక్స్‌వ్యాగన్ ఇప్పుడు దీనిని దేశీయ విపణిలో విడుదల చేయడానికి లైన్ క్లియర్ చేస్తోంది.

వోక్స్‌వ్యాగన్ ఇండియా ప్యాసింజర్ కార్ల విభాగాధిపతి మైకేల్ మేయర్ ప్రముఖ ఆటోమొబైల్ వార్తా పత్రిక ఆటోకార్ తో మాట్లాడుతూ, ఇండియన్ మార్కెట్లోకి అతి త్వరలో తమ బెస్ట్ సెల్లింగ్ హాట్ హ్యాచ్‌బ్యాక్ గోల్ఫ్ జిటిఐ ని విడుదల చేయడానికి వోక్స్‌వ్యాగన్ అమితాసక్తితో ఉన్నట్లు తెలిపాడు.

గోల్ప్ జిటిఐ పర్పామెన్స్ హ్యాచ్‌బ్యాక్ కంటే ముందు ఎస్‌యువి విడుదల మీద దృష్టి పెట్టినట్లు మేయర్ తెలిపాడు. వచ్చే ఏడాది వోక్స్‌వ్యాగన్ ఇండియన్ ప్రీమియమ్ ఎస్‌యువి సెగ్మెంట్లోకి తమ టిగువాన్ ఎస్‌యువిని సుమారుగా 30 లక్షల ధరతో విడుదల చేసే అవకాశం ఉంది.

ప్రపంచ దేశాల్లో ఈ గోల్ప్ జిటిఐ మోడల్‌కు భారీ డిమాండ్ ఉంది. విభిన్న అంతర్జాతీయ మార్కెట్లలో ఇప్పటికీ దీనికి పోటీ లేకపోవడం ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ప్రపంచపు ఫేవరేట్ హ్యాచ్‌ గోల్ఫ్ జిటిఐ ని వోక్స్‌వ్యాగన్ ఎమ్‌క్యూబి వేదిక ఆధారంగా డిజైన్ చేసింది.

గోల్ఫ్ జిటిఐ ధర కాస్త ఎక్కువగా ఉంటుంది. అయితే ఇప్పటికే అత్యధిక ధరతో హ్యాచ్‌బ్యాక్‌లు ఇండియాలో విడుదలయ్యాయి కాబట్టి ఇది నిశ్చింతగా విడుదలవుతోంది. గతంలో వోక్స్‌వ్యాగన్ పోలో హ్యాచ్‌బ్యాక్ ను కూడా విడుదల చేసింది.

వోక్స్‌వ్యాగన్ గోల్ఫ్ జిటిఐ ఈ మధ్యనే మిడ్-లైఫ్ ఫేస్‌లిఫ్ట్ అనే రూపంలో గత నవంబర్‌లో ప్రపంచానికి పరిచయం అయ్యింది. రీఫ్రెష్డ్ లుక్‌తో మరింత శక్తివంతమైన ఇంజన్‌తో ప్రపంచ హ్యాచ్‌బ్యాక్ మార్కెట్లోకి విడుదలయ్యింది.

సాధారణ వోక్స్‌వ్యాగన్ గోల్ప్ జిటిఐ లో 2.0-లీటర్ సామర్థ్యం గల టర్బో చార్జ్‌డ్ ఇంజన్ కలదు. ఇది గరిష్టంగా 227బిహెచ్‌పి పవర్ అదే విధంగా ఇందులో పర్ఫామెన్స్ వేరియంట్ గరిష్టంగా 241బిహెచ్‌పి పవర్ ఉత్పత్తి చేయును.

వోక్స్‌వ్యాగన్ ఈ గోల్ప్ జిటిఐ లోని అత్యంత శక్తివంతమైన ఇంజన్‌కు 7-స్పీడ్ డ్యూయల్ క్లచ్ ట్రాన్స్‌మిషన్ గల గేర్‌బాక్స్‌ను అనుసంధానం చేసింది.

గోల్ప్ జిటిఐ ఇంటీరియర్ విషయానికి వస్తే అత్యుత్తమ డిజిటల్ ఇంస్ట్రుమెంట్ క్లస్టర్ కలిగి ఉంది. 9.2-అంగుళాల పరిమాణం గల తాకే తెర గల ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ కలదు. ఈ మధ్య ఆడి కార్లలో పరిచయం అవుతున్న డ్యూయల్ డిస్ల్పేని సెట్ చేసుకునే అవకాశం గల వర్చువల్ కాక్‌పిట్ కూడా ఇందులో ఉంది.

వోక్స్‌వ్యాగన్ ఈ శక్తివంతమైన హ్యాచ్‌బ్యాక్ గోల్ప్ జిటిఐ ని కేవలం లిమిటెడ్ ఎడిషన్‌గా అందుబాటులో ఉంచనుంది. గతంలో వోక్స్‌వ్యాగన్ పోలో జిటిఐ ని కూడా ఇలానే లిమిటెడ్ ఎడిషన్‌గా విడుదల చేసింది (దేశవ్యాప్తంగా కేవలం 99 యూనిట్ల పోలో జిటిఐ లను మాత్రమే అందుబాటులో ఉంచింది).

25.65 లక్షల ప్రారంభ ధరతో విడుదలైన పోలో జిటిఐ:
వోక్స్‌వ్యాగన్ ఇండియా తమ పోలో జిటిఐ హాట్ హ్యాచ్‌బ్యాక్‌ను లిమిటెడ్ ఎడిషన్‌గా 25.65 లక్షల ప్రారంభ ధరతో దేశీయ విపణిలోకి విడుదల చేసింది.

Click to compare, buy, and renew Car Insurance online

Buy InsuranceBuy Now

Story first published: Friday, December 23, 2016, 13:06 [IST]
English summary
Volkswagen Ready To Bring The World's Most Famous Hot Hatchback To India
Please Wait while comments are loading...

Latest Photos