ప్రపంచంలో మొదటి కీ లెస్ ఎంట్రీ కారు "వోల్వో"

Written By:

మన కారు లేదా బైకు తాళాలను మాటల్లో పడి ఎక్కడో పడేసి ఉంటాము, తీరా ఎంత వెతికినా కూడా దొరకవు. ఇలా ఎంతో మంది ఎన్నో సార్లు వారి కార్ల తాళాలను పడేసుకున్న సందర్బాలు చాలానే ఉంటాయి. అయితే ఇలాంటి సమస్యకు వోల్వో సంస్థ చెక్ పెట్టనుంది.

తాజాగా వోల్వో తమ అన్ని కార్లకు కీ లెస్ ఎంట్రీ సౌకర్యాన్ని కల్పించనుంది. దీని ద్వారా కీ లేకుండా ఎవరైనా కార్లను నడపవచ్చు. దీనికి చెందిన మరిన్ని వివరాలు క్రింది కథనం ద్వారా క్లుప్తంగా తెలుసుకోగలరు.

వోల్వో 2017 నుండి మార్కెట్లోకి అందుబాటులోకి తీసుకురానున్న కార్లకు కీ లేకుండా అందివ్వనుంది. వీటి స్థానంలో డిజిటల్ కీ లను అందుబాటులోకి తీసుకువస్తోంది.

కారును కొన్న తరువాత కారులోని బ్లూటూత్ ద్వారా మీ స్మార్ట్ ఫోన్‌లోని వోల్వో యాప్ ద్వారా కనెక్ట్ కావాల్సి ఉంటుంది. దీనినే డిజిటల్ కీ అంటారు.

ఈ డిజిటల్ కీ ద్వారా సాధారణ కీ చేసే అన్ని పనులు కూడా జరిగిపోతాయి. డోర్ లాక్ మరియు అన్ లాక్ మరియు ఇంజన్ స్టార్ట్ అండ్ స్టాప్‌లకు ఈ డిజిటల్‌ కీ ను వినియోగించుకోవచ్చు.

ఈ యాప్ ద్వారా ఏ ప్రదేశంలో ఉన్న కార్లను కూడా స్మార్ట్ ఫోన్ ద్వారా డిజిటల్‌ కీ ని వినియోగించుకుని కారును వినియోగించుకోవచ్చు. అయితే యాక్సెస్ అనేది తప్పనిసరిగా ఉండాలి.

ఈ యాప్ ద్వారా ప్రపంచ వ్యాప్తంగా వినియోగదారులు తమ ప్రయాణానికి కావాల్సిన కార్లను అద్దె కోసం మరియు బుక్ చేసుకోవచ్చు. ఇందుకు స్మార్ట్ ఫోన్‌లోని సాఫ్ట్ వేర్ ద్వారా పనిచేసే డిజిటల్ కీ ఎంతో ఉపయోగపడుతుంది.

దీని ద్వారా వినియోగదారులు ముందుగా కారును జిపిఎస్ ద్వారా కారు ఉన్న ప్రదేశాన్ని గుర్తించి తరువాత దానిని మీ స్మార్ట్ ఫోన్ యాక్సెస్ ద్వారా అన్‌లాక్ చేసి రైల్వే స్టేషన్ లేదా ఎయిర్ పోర్ట్ వంటి ప్రదేశాలకు స్వయంగా డ్రైవ్ చేసుకుంటూ వెళ్లవచ్చు.

కాని ఈ పరిజ్ఞానం కారు కొన్న వారికే పరిమితం అనుకుంటే మీరు తప్పులో కాలేసినట్లే. ఎందుకంటే మీరు కారును మీ కుటుంబ సభ్యులకు ఇవ్వాలి అనుకుంటే దాని తాలూకు యాక్సెస్ వివరాలను మీ స్మార్ట్‌ ఫోన్ నుండి మీ వారి ఫోన్‌లకు పంపవచ్చు.

వోల్వో సంస్థను దీని పనితీరును పరీక్షించడానికి వోల్వో వారి సరికొత్త టెక్నాలజీతో సన్‌ఫ్లీట్ నుండి స్వీడెన్ లోని గొత్తెన్‌బర్గ్ వరకు ప్రయోగాత్మకంగా పరీక్షించి చూశారు. ఈ పరీక్షలు విజయవంతమయ్యాయి.

వోల్వో కార్ల సంస్థకు చెందిన అధికారి హెన్రిక్ గ్రీన్ మాట్లాడుతూ, వోల్వో వినియోగదారుల సమయాన్ని ఆదాచేయడానికి మరియు వారికి సులభతరమైన ఫీచర్లను ఇవ్వడానికి ఎప్పటికప్పుడు నూతన టెక్నాలజీలను పరిచయం చేస్తోంది వివరించారు.

వోల్వో ఈ నూతన టెక్నాలజీ గల కారును బార్సిలోనాలో జరిగిన 2016 మొబైల్ వరల్డ్ కాంగ్రెస్‌ (ఫిబ్రవరి 22 నుండి 25 మధ్య జరుగుతున్న) లో గల ఎరిక్సన్ బూత్ స్టాల్ మీద ప్రదర్శించారు.

Click to compare, buy, and renew Car Insurance online

Buy InsuranceBuy Now

Read more on: #వోల్వో #volvo
English summary
Volvo To Become The First Car Manufacturer To Launch Keyless Car
Please Wait while comments are loading...

Latest Photos