13 మంది మారుతి సుజుకి కార్మికులకు జీవిత ఖైదు శిక్ష: ఎందుకో తెలుసా ?

Written By:

2012 లో మానేసర్ లోని మారుతి సుజుకి ఉత్పత్తి ప్లాంటులో అప్పటి ఉద్యోగులు భారీ విధ్వంసాన్ని సృష్టించారు. అందులో 13 మంది కార్మికులకు మానేసర్ ప్లాంటు పరిధిలోని గుర్గావ్ కోర్టు సంచలమైన తీర్పును వెలువరించింది. ఈ 13 మంది మాజీ కార్మికులకు ఏకంగా జీవిత ఖైదు శిక్షను విధిస్తూ తీర్పునిచ్చింది.

వీరు చేసిన నేరం ఏమిటి ? ఏకంగా 13 మందికి ఒకే సారి జీవిత ఖైదు విధించడం ఏమిటి ? అసలు 2012 లో మానేసర్ ప్రొడక్షన్ ప్లాంటులో ఏం జరిగింది ? వంటి అనేక ప్రశ్నలకు సమాధానం నేటి కథనంలో....

హత్యారోప నిందను ఎదుర్కుంటున్న ఈ 13 మందికి మరణ శిక్షణను విధించాలని ప్రాసిక్యూషన్ న్యాయవాది అనురాగ్ వాధించారు. అయితే సెషన్స్ న్యాయమూర్తి ఆర్‌పి గోయెల్ వీరికి జీవిత ఖైదు శిక్షను విధిస్తూ తీర్పునిచ్చారు.

2012 లో మారుతి సుజుకి మానేసర్ ప్రొడక్షన్ ప్లాంటులో సృష్టించిన అల్లర్లలో మానవ వనరుల(HR) డిపార్ట్‌మెంట్‌కు చెందిన జనరల్ మేనేజర్ అవనీష్ కుమార్ దేవ్ మంటల్లో చిక్కుకొని మరణించాడు.

అప్పటి కార్మికులు ప్లాంటులో సృష్టించిన ఆందోళనల్లో సుమారుగా 95 మంది మేనేజర్లు, సూపర్‌వైజర్లు మరియు తొమ్మిది మంది పోలీసులు తీవ్రంగా గాయపడ్డారు. ఆయుధాలతో భారీ దాడులు జరిపిన 145 మంది మారుతి సుజుకి కార్మికులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఇందులో 11 మందిని అరెస్ట్ చేసి మిగతా ఉద్యోగులను విడుదల చేసారు. వారిలో అదే విధంగా 18 మంది ఉద్యోగుల్లో ఐదు మంది 5 ఏళ్ల పాటు ఖైదు విధించగా, మిగిలిన 13 మందికి జీవిత ఖైదు విధించారు. మరియు 2,500 రుపాయలు జరిమానా చెల్లించిన 14 మందిని విడుదల చేశారు.

మారుతి సుజుకి మానేసర్ ప్లాంటులో ఒకప్పటి ఉద్యోగులైన యూనియన్ ప్రెసిడెంట్, సందీప్ ధిలాన్, రామ్ బిలాస్, సరబ్‌జీత్ సింగ్, పవన్ కుమార్, సోహాన్ కుమార్, ప్రదీప్ కుమార్, అజ్మీర్ సింగ్, జియా లాల్, అమర్‌జీత్, ధనరాజ్ బాంబి, యోగేశ్వర్ కుమార్ మరియు ప్రదీప్ గుజ్జర్‌లు లకు జీవిత ఖైదు శిక్షను విధించడం జరిగింది.

అయితే ఈ ఘటనకు మరియు జీవిత ఖైదు విధించబడిన కార్మికులకు ఎలాంటి సంభందంలేదని వ్యతిరేకిస్తూ మార్చి 23, 2017 న మారుతి సుజుకి వర్కర్స్ యూనియన్ నిరసనకు పిలుపునిచ్చింది.

"చలో మానేసార్" పిలుపుతో దేశవ్యాప్తంగా ఉన్న ఆరు మారుతి సుజుకి ప్లాంటులో ఒక గంట పాటు పనిని బహిష్కరించాలని నిర్ణయం తీసుకున్నారు.

 

Click to compare, buy, and renew Car Insurance online

Buy InsuranceBuy Now

English summary
Also Read In Telugu: 13 Maruti Employees Get Life Imprisonment Over 2012 Manesar Violence
Please Wait while comments are loading...

Latest Photos