రికార్డుల పంట పండిస్తున్న సిఎస్ సంతోష్: వరుసగా స్టేజి 4 లో ఆధిక్యం

Written By:

15 వ ఎడిషన్ డెసర్ట్ స్టార్మ్ ర్యాలీలోని నాలుగవ స్టేజ్ పూర్తయ్యింది. పోటీదారులను నుండి తీవ్ర పోటీని ఎదుర్కొంటున్న సురేశ్ రాణా ఇతని న్యావిగేటర్ అశ్విన్ నాయక్ ఎప్పటిలాగే మొదటి స్థానంలో నిలవగా, సిఎస్ సంతోష్ మోటో కెటగిరీలో మల్లీ మొదటి స్థానాన్ని సొంతం చేసుకున్నాడు. స్టేజ్ 4 ర్యాలీ మొత్తం 300 కిలోమీటర్ల మేర సాగింది.

2017 డెసర్ట్ స్టార్మ్ ర్యాలీలో ఎక్స్‌ట్రీమ్ కెటగిరీలో సురేశ్ రాణా ఇతని న్యావిగేటర్ అశ్విన్ నాయక్ లు మారుతి సుజుకి గ్రాండ్ వితారా, నిజు పాడియా ఇతని న్యావిగేటర్ నిరవ్ మెహ్తా తమ పజేరో వాహనంతో రెండవ మరియు సందీప్ శర్మ ఇతని న్యావిగేటర్ కర్యన్ ఆర్య జోడి మూడవ స్థానానికి పరిమితం అయ్యింది.

డెసర్ట్ స్టార్మ్ ర్యాలీలో మోటో కెటగిరీ మరింత ఉత్సాహవంతమైనది. ఇందులో సిఎస్ సంతోష్, టీవీఎస్ రేసింగ్ రైడర్స్ తరపున ఆర్.నటరాజ్ రెండవ మరియు తన్వీర్ అబ్దుల్ వహీద్ మూడవ స్థానంలో నిలిచారు.

ఎన్‌డ్యూర్ కెటగిరీ లో పోటీదారులు ర్యాలీలో ఇచ్చిన కాలానికి అనుగుణంగా, వేగాన్ని మరియు దూరాన్ని సమం చేయకపోతే విధించే జరిమానాలను అధిగమిస్తూ స్టేజ్ 4 ర్యాలీని పూర్తి చేసారు.

ఈ సారి ర్యాలీ పూర్తయ్యే సమయానికి నికుంజ్ తోష్నివాలా మరియు సువర్జిత్ దత్ జోడి మొదటి స్థానాన్ని చేరుకోగా, అర్పిత్ గుప్తా మరియు టి.నాగరాజన్ జోడి రెండవ స్థానానికి పడిపోయింది. సురేష్ కుమార్ మరియు రంజిత్ పురుషోత్తమన్ మూడవ స్థానంలో నిలిచారు.

నేడు ప్రారంభించిన ఎక్స్‌ప్లోర్ బి కెటగిరీలో కార్తిక్ మరుతి మరియు శంకర్ ఆనంద్ జోడి మొదటి స్థానాన్ని మరియు రాజేష్ చలానా న్యావిగేటర్ గోపాల్‌క్రిష్ణా అదే విధంగా అలీ అజ్గర్ న్యావిగేటర్ మొహ్మద్ ముస్తఫా వరుసగా ద్వితీయ మరియు తృతీయ స్థానాలలో నిలిచారు.

మహిళా పోటీదారులలో బనియాదవ్ ముందు రోజు ర్యాలీలో తొమ్మిదవ స్థానంలో నిలవగా, ఈ సారి కాస్త మెరుగైన ఫలితాలను సాధించేందుకు పోటీదారులతో తన మారుతి సుజుకి జిప్సీ వాహనంతో గట్టిగా పోటీపడింది.

2017 మారుతి సుజుకి డెసర్ట్ స్టార్మ్ ర్యాలీ స్టేజ్ 4 ఫలితాలు

ఎక్స్‌ట్రీమ్ కెటగిరీ
1.సురేశ్ రాణా/ అశ్విన్ నాయక్ - 09:21:41
2. నిజు పాడియా/ నిరవ్ మెహ్తా - 09:33:19
3. సందీప్ శర్మ/ కర్యన్ ఆర్య - 09:46:56

మోటో కెటగిరీ

1. సిఎస్.సంతోష్ - 7:20:57
2. ఆర్ నటరాజ్ - 07:30:08
3. తన్వీర్ అబ్దుల్ వహీద్ - 07:46:10

మారుతి సుజుకి 2017 డెసర్ట్ స్టార్మ్ ర్యాలీని మొబిల్ కంపెనీ యొక్క భాగస్వామ్యంతో నిర్వహిస్తోంది. ఈ ర్యాలీకి మొబిల్1 అధికారిక ఫ్యూయల్ మరియు లుబ్రికేషన్ పార్టనర్‌గా వ్యవహరిస్తోంది.

మొదటి స్టేజ్ నుండి నాలుగవ స్టేజ్ వరకు మొత్తం ఫోటోల కోసం....
 

Click to compare, buy, and renew Car Insurance online

Buy InsuranceBuy Now

English summary
2017 Maruti Suzuki Desert Storm: Suresh Rana And CS Santosh Maintain Their Lead After Leg 4
Please Wait while comments are loading...

Latest Photos