30 శాతం డ్రైవింగ్‌ లైసెన్స్‌లు ఫేక్ అంటున్న నితిన్ గడ్కరీ

ప్రస్తుతం దేశవ్యాప్తంగా మంజూరైన మొత్తం డ్రైవింగ్ లైసెన్సుల్లో 30 శాతం వరకు నకిలీవే అని కేంద్ర రహదారులు మరియు రవాణా శాఖ మంత్రివర్యులు నితిన్ గడ్కరీ గారు పేర్కొన్నారు.

Written By:

ఎన్‌డిటివి వార్తా సంస్థ డియాజియె భాగస్వామ్యంతో నిర్వహించిన రహగారి భద్రత సమావేశంలో కేంద్ర రహదారి రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ గారు పాల్గొన్నారు. ఈ సమావేశంలో నితిన్ గడ్కరీ గారు మాట్లాడుతూ, దేశ వ్యాప్తంగా మంజూరైన మొత్తం డ్రైవింగ్ లైసెన్సుల్లో 30 శాతం వరకు బోగస్ అని తెలిపాడు. ఇదే మంత్రిత్వ శాఖలో ఉండి ఇలా ప్రకటించడం చాలా ఇబ్బందిగా ఉన్నట్లు ఆయన పేర్కొన్నాడు.

ట్రాఫిక్ నియంత్రణ కోసం భవిష్యత్తులో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించనున్నట్లు ఆయన తెలిపాడు. అందుకోసం ఇంటెలిజెంట్ ట్రాఫిక్ సిస్టమ్‌ను ప్రవేశపెట్టనున్నారు. తద్వారా ప్రత్యక్షంగా ట్రాఫిక్ పర్యవేక్షణ, రియల్ టైమ్ ట్రాఫిక్ మరియు ట్రాఫిక్ నియమాల ఉల్లంఘనల వంటి వాటిని పర్యవేక్షించనున్నారు.

రహదారి భద్రతలో చాలా వరకు లోటుపాట్లున్నాయని కూడా ఈ సమావేశంలో పేర్కొన్నాడు. సమస్యాత్మకంగా ఉన్న ప్రదేశాలను గుర్తించి, వాటికి అనుగుణంగా రహదారుల నిర్మాణం చేపట్టాలని ప్రకటించారు.

అక్రమంగా జారీ చేయబడుతున్న బోగస్ డ్రైవింగ్ లైసెన్స్‌ల మంజూరును అరికట్టడానికి డ్రైవింగ్ లైసెన్స్ కోసం ఉన్న ప్రస్తుత పరీక్షలను మరింత కఠినతరం చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు.

రహదారి భద్రతలో భాగంగా రహదారి నియమాలను పాటించకుండా, వాటిని ఉల్లఘించే వాహనాదారులపై కఠిన చర్యలు తీసుకుని, వాటికి భారీ మొత్తంలో జరిమానా విధించడానికి కూడా సిద్దమవుతోంది రవాణా శాఖ.

2016 లో టయోటా కిర్లోస్కర్ మోటార్ ఇండియా దేశీయ విపణిలోకి ఇన్నోవా క్రిస్టా ప్రీమియమ్ ఎమ్‌పివిని విడుదల చేసింది. అధునాతన ఫీచర్లతో విడుదలైన ఇది భారీ ధరతో విడుదలైంది. అయినప్పటికీ ఊహించని స్థాయిలో అమ్ముడుపోతోంది. దీనిని అన్ని కోణాలలో వీక్షించాలనుకునే వారి కోసం ఇన్నోవా క్రిస్టా గ్యాలరీ...

 

Click to compare, buy, and renew Car Insurance online

Buy InsuranceBuy Now

English summary
Shocking! 30 Percent of All Indian Driving Licenses Are Fake: Nitin Gadkari
Please Wait while comments are loading...

Latest Photos