ట్రక్కు డ్రైవర్లకు డైమ్లర్ ఇండియా శుభవార్త

Written By:

చాలా మంది ట్రక్కు మరియు లారీ డ్రైవర్లు ఎక్కువ ఒత్తిడి కారణంగా మరియు వేడి ఉక్కపోతల కారణంగా యాక్సిడెంట్స్ చేసే అవకాశం ఉంది. అందుకోసం డ్రైవర్ క్యాబిన్‌లలో ఇక మీదట డైమ్లర్ ఇండియా తాము ఉత్పత్తి చేసే అన్ని ట్రక్కుల్లో కూడా ఏ/సి ని అందివ్వడానికి సిద్దమైంది.

కమర్షియల్ వాహనాల తయారీ సంస్థ డైమ్లర్ ఇండియా కమర్షియల్ వెహికల్స్ (DICV) దేశీయంగా ట్రాఫిక్ సేఫ్టీ కోసం తమ అన్ని వాహనాలలో తప్పనిసరిగా ఎయిర్ కండీషనింగ్ సిస్టమ్ అందివ్వడానికి సుముఖంగా ఉన్నట్లు ప్రకటించింది.

డైమ్లర్ ఇండియా ఓ ప్రకటనలో తెలిపిన వివరాల మేరకు కొన్ని ఇండియన్ కమర్షియల్ వాహనాల తయారీ సంస్థలు ఏ/సి కి బదులుగా చిన్న పరిమాణంలో ఉన్న బ్లోయర్ సిస్టమ్‌లను అందివ్వడానికి ప్రయత్నిస్తున్నాయి, అయితే డైమ్లర్ తప్పకుండా ఏ/సి అందిస్తున్నట్లు ప్రకటించింది.

డైమ్లర్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ మరియు సిఇఒ ఎరిచ్ నెస్సెల్‌హాఫ్ మాట్లాడుతూ, "పెద్ద పెద్ద లారీల్లో మరియు ట్రక్కుల్లో ఏ/సి అందివ్వడం ఒక సౌకర్యవంతమైన లగ్జరీ ఫీచర్ కాదు. ఇది తప్పకుండా కమర్షియల్ వాహనాల్లో ఉండి తీరాల్సిన ఫీచర్. ఎందుకంటే చాలా మంది డ్రైవర్లు అనేక గంటలు పాటు ప్రయాణించాల్సి ఉంటుంది. కాబట్టి వారి శ్రేయస్సు కోసం ఏ/సి తప్పకుండా అందిస్తున్నామని తెలిపాడు."

ఏ/సి లకు ప్రత్యామ్నాయంగా వినియోగించే బ్లోయర్ సిస్టమ్ గురించి ప్రస్తావిస్తూ, ఇవి చాలా చవకైనవి మరియు ఆశించిన స్థాయిలో పనిచేయవు, అందుకోసం వీటికి బదులు ఏ/సి లను అందించే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు పేర్కొన్నాడు.

డ్రైవర్ క్యాబిన్ ఉష్ణోగ్రతను బాహ్య వాతావరణంలోని ఉష్టోగ్రత కన్నా తక్కువకు తీసుకొచ్చేందుకు బ్లోయర్ సిస్టమ్‌లో ఎలాంటి సాంకేతికత లేదు. బ్లోయర్ వినియోగించడం ద్వారా క్యాబిన్ మొత్తం దుమ్ముధూళి పేరుకుపోయే అవకాశం ఉంది.

డైమ్లర్ ఆధ్వర్యంలో కమర్షియల్ వాహనాలను విక్రయిస్తున్న భారత్‌బెంజ్ ప్రస్తుతం 9 నుండి 49 టన్నుల రేంజ్ గల అన్ని కమర్షియల్ వాహనాలలో ఏ/సి అందిస్తోంది. ఏ/సి వినియోగించడం ద్వారా మైలేజ్ తగ్గిపోతుందనే దురభిప్రాయాన్ని తొలగించేందుకు ప్రయత్నిస్తోంది.

వినియోగదారులు భారత్‌బెంజ్ ట్రక్స్ సంస్థకు ఇచ్చిన ఫీడ్ బ్యాక్ మేరకు, ట్రక్కుల్లో ఏ/సి ఉండటం వలన మునుపటి కన్నా ఇప్పుడు ఎక్కువ కిలోమీటర్లు మేర ఎలాంటి ఇబ్బంది లేకుండా నడుపుతున్నట్లు తెలిసింది. తద్వారా ఆదాయం కూడా పెరుగుతోంది.
ఇతరులు ఎక్కువగా చదువుతున్న కథనాలు:


డ్రైవ్‌స్పార్క్‌లో మాత్రమే వీక్షించగల ఫోటో గ్యాలరీ...

మారుతి సుజుకి ఈ ఏడాది మార్కెట్లోకి విడుదల చేయనున్న 2017 స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్ ఫోటోలను వీక్షించండి...

 

Click to compare, buy, and renew Car Insurance online

Buy InsuranceBuy Now

English summary
AC In Trucks Can Help Prevent Accidents — Daimler India
Please Wait while comments are loading...

Latest Photos