70 ఏళ్ల ప్రతిష్టను ఫ్రెంచ్ దిగ్గజానికి అమ్మేసిన హిందుస్తాన్ మోటార్స్

Written By:

సికె బిర్లా గ్రూపునకు చెందిన హిందుస్తాన్ మోటార్స్ లో అంబాసిడర్ కారు బ్రాండ్ అత్యంత ముఖ్యమైనది, చాలా మంది హిందుస్తాన్ మోటార్స్ పేరు అంబాసిడర్‌గానే సుపరిచితం. సాధారణ ప్రజానీకం నుండి దేశ ప్రధాని వరకు వినియోగించిన అంబాసిడర్ కారు బ్రాండ్ ను ప్యూజో సంస్థ దక్కించుకుంది.

ఫ్రెంచ్ కు చెందిన దిగ్గజ కార్లు మరియు బైకుల తయారీ సంస్థ ప్యూజో హిందుస్తాన్ మోటార్స్ యొక్క పేరెన్నికగన్న బ్రాండ్ పేరు అంబాసిడర్‌ను సుమారుగా రూ. 80 కోట్ల రుపాయలకు కోనుగోలు చేసింది.

ప్యూజో యొక్క భాగస్వామ్యపు సంస్థ ఎస్ఎ గ్రూప్ తో జరిగిన చర్చల అనంతరం హిందాస్తాన్ మోటార్స్‌కు చెందిన అంబాసిడర్ కారు బ్రాండ్ పేరు మరియు దీని చిహ్నాలకు చెందిన సర్వహక్కులను ఇరు సంస్థల యొక్క పరస్పర అంగీకారంతో అమ్మేసినట్లు సికె బిర్లా గ్రూపు తరపున వార్త ఒకటి వెలువడింది.

ప్రస్తుతం వచ్చే సొమ్మును అమ్మకందారులకు మరియు రుణదాతల యొక్క బకాయిలను చెల్లించడానికి వినియోగించనున్నట్లు సికె బిర్లా గ్రూప్ పేర్కొంది.

హిందుస్తాన్ మోటార్స్ అంబాసిడర్ కార్ బ్రాండ్ పేరును తొలిసారిగా 70 ఏళ్ల క్రితం పరిచయం చేసింది. హిందుస్తాన్ మోటార్స్ తొలినాళ్లలో మోరిస్ ఆక్స్‌ఫర్డ్ సిరీస్ II ను స్వల్ప మార్పులతో ఉత్పత్తి చేస్తున్న సందర్భంలో ఈ పేరును పరిచయం చేసింది.

విశాలవంతమైన క్యాబిన్ స్పేస్ ద్వారా మంచి పాపులారిటీని దక్కించుకున్న అంబాసిడర్ 1980 ల కాలంలో ఇండియన్ రోడ్ల మీద ఎటు చూసినా ఈ కార్లే దర్శనమిచ్చేవి.

అయితే 2013 నుండి 2014 మధ్య కాలంలో వీటి అమ్మకాలు బాగా క్షీణించిపోయాయి. ఒకానొక దశలో ఏడాది పొడవునా 2,500 కన్నా తక్కువ కార్లు అమ్ముడయ్యేవి.

దేశీయంగా తమ కార్ల తయారీని ప్రారంభించి అమ్మకాలకు రంగం సిద్దం చేసుకుంటున్న ప్యూజో కార్ల తయారీ సంస్థ అంబాసిడర్ బ్రాండ్ పేరును తమ కార్లకు వినియోగించుకుంటుందా..? లేదా అన్న విషయం ఇంకా స్పష్టం కాలేదు.

మారుతి సుజుకి ఈ ఏడాది 2017 స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్‌ను విడుదల చేస్తోంది. కొత్త హ్యాచ్‌బ్యాక్ కొనే ఉద్దేశం ఉన్నట్లయితే దీనికి వేచి ఉండండి. ఆలోపు ఫోటోల మీద ఓ లుక్కేసుకోండి.

 

English summary
Iconic Indian Car Brand Ambassador Sold To Peugeot
Please Wait while comments are loading...

Latest Photos