ఓలా మరియు ఉబర్‌లకు చెక్ పెడుతూ హెచ్‌డికె క్యాబ్ సర్వీసెస్: డ్రైవర్లకు భారీ ప్రయోజనాలు

Written By:

ఓలా మరియు ఉబర్ సంస్థలతో సంతృప్తి చెందని క్యాబ్ డ్రైవర్లు ఓ యూనియన్‌గా ఏర్పడి ట్యాక్సీ ఫర్ రైడ్ ను ప్రారంభించాక, కర్ణాటకలోని జెడిఎస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు హెచ్‌డి కుమార స్వామి హెచ్‌డికె క్యాబ్ సర్వీసులను ప్రారంభిస్తున్నట్లు తెలిపాడు. పూర్తిగా క్యాబ్ డ్రైవర్ల సంక్షేమం కోసం ప్రారంభించే ఈ అప్లికేషన్‌తో ఓలా మరియు ఉబర్ సంస్థల కూసాలు కదులుతున్నాయి.

వ్యాపార ధోరణిలో కాకుండా క్యాబ్ డ్రైవర్ల సంక్షేమం కోసం సామాజిక దృక్పథంలో హెచ్‌డికె క్యాబ్ సర్వీస్ అప్లికేషన్‌ను ప్రారంభిస్తున్నట్లు హెచ్‌డి కుమార స్వామి ప్రకటించాడు.

బెంగళూరులో ఓలా మరియు ఉబర్ సంస్థలు క్యాబ్ సేవలకు ప్రసిద్దగాంచినవి. క్యాబ్ సర్వీసుల మార్కెట్లో వీటిదే పైచేయి. అయితే వీటికి సేవలందిస్తున్న క్యాబ్ డ్రైవర్లు మాత్రం చాలా అసంతృప్తిగా ఉన్నారు.

గరిష్ట పని గంటల మేర క్యాబ్ నిర్వహిస్తున్నప్పటికీ ఆశించిన స్థాయిలో డబ్బులు రాకపోవడంతో, కుటుంబ పోషణ మరియు కారు నిర్వహణ అదే విధంగా వాయిదాల చెల్లించలేక అనేక మంది ఇబ్బందుల్లో కూరుకుపోతున్నారు.

వీరిని గట్టెక్కించేందుకు వ్యాపార మార్గంలోనే క్యాబ్ డ్రైవర్లు మరియు వాటి కుటుంబ సంక్షేమం కోసం హెచ్‌డికె క్యాబ్ సర్వీస్ త్వరలో అందుబాటులోకి రానుంది.

హెచ్‌డికె క్యాబ్ సర్వీసుల్లో మొదటి ప్రత్యేక ఇందులో డ్రైవర్లు కేవలం 5 శాతం మాత్రమే కమీషన్‌గా సంస్థకు చెల్లించాల్సి ఉంటుంది. మిగతా అన్నింటితో పోల్చితే ఇది చాలా తక్కువ.

ఈ ఐదు శాతం కూడా సంస్థకు వెళ్లకుండా భారీ మొత్తంలో పోగయ్యే కమీషన్ సొమ్ముతో క్యాబ్ డ్రైవర్ల జీవితోన్నతికి వినియోగించనుంది హెచ్‌డికె సంస్థ.

కారు నిర్వహణ భారంగా మారుతున్నందున, ప్రతి నెలకు రెండు సార్లు ఉచిత కారు వాష్, ప్రతి ఏడాది ఉచిత సర్వీసింగ్, ప్రతి 10 వేల కిలమీటర్లకు ఒక సారి ఆయిల్ చేంజ్, రూ. 20,000 ల వరకు ఇయర్లీ ఇన్సూరెన్స్ మరియు సంవత్సరపు ట్యాక్స్ కూడా హెచ్‌డికె సంస్థ చేయించనుంది.

క్యాబ్ డ్రైవర్ కోసం రూ. 10 లక్షల వరకు జీవిత భీమా మరియు డ్రైవర్ కుటుంబానికి ఉచిత మెడికల్ ఇన్సూరెన్స్ కల్పించనుంది హెచ్‌డికె సంస్థ.

క్యాబ్ డ్రైవర్ల పిల్లలకు ఉచిత పుస్తకాలు, బ్యాగులు మరియు ఉచిత విద్య మీద దృష్టిపెట్టినట్లు హెచ్‌డి కుమార స్వామి తెలిపారు. అంతే కాకుండా తమ ప్రణాళికలో ఉచిత గృహ కల్పన కూడా ఉన్నట్లు ఆయన తెలిపారు

నగర వ్యాప్తంగా ఉన్న సుమారుగా 45,000 మంది క్యాబ్ డ్రైవర్లు, ఇందులో ఉన్న 13 యూనియన్లు ఇందుకు అంగీకరించినట్లు ఓలా-ట్యాక్సీఫర్‌ష్యూర్ మరియు ఉబర్ సంస్థల కోఆర్డినేటర్ మరియు డ్రైవర్స్ యూనియన్ అసోసియేషన్ తన్వీర్ పాషా వెల్లడించారు.

హెచ్‌డికె క్యాబ్ సర్వీస్ సంస్థ యొక్క సాంకేతిక అభివృద్దికి కావాల్సిన పెట్టుబడి మొత్తం తానే దగ్గరుండి చూసుకుంటానని కుమార స్వామి ప్రకటించాడు.

డ్రైవింగ్ వచ్చి కారు కొనుగోలు చేసే స్తోమత లేని వారికి, క్యాబ్‌ను కొనివ్వడానికి కూడా సుముఖత చూపారు.

ఉబర్ మరియు ఓలా సంస్థలో కుదుపులు

అనేక క్యాబ్ సర్వీసుల సంస్థలు అందుబాటులోకి వచ్చినప్పటికీ అవన్నీ మొగ్గప్రాయంలోనే కూలిపోయాయి. కాని ఓలా మరియు ఉబర్ సంస్థలు సింహభాగంలో వెలిగొందాయి. ఇప్పుడు హెచ్‌డికె రాకతో ఈ రెండు సంస్థల్లో ఇప్పుడే ముసలం అలుముకుంది.

2018 ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఇది చేపడుతున్నారా అని హెచ్‌డి కుమార స్వామిని మీడియా ప్రశ్నించిగా, కాదని కొట్టిపారేసారు. మానవతా దృక్పథంతో డ్రైవర్ల సమస్యలను తెలుసుకుని ఇది చేస్తున్నట్లు తెలిపాడు.

అంతర్జాతీయ సంస్థకు దోచిపెట్టడం కన్నా ఇది బావుంది కదా. మరి మన హైదరాబాద్ నగరంలో కూడా ఇలా ప్రభుత్వం చొరవతో ఓ ప్రత్యేక వేదికను ఏర్పాటు చేసి క్యాబ్ డ్రైవర్లకు అండగా నిలిస్తే ఎంతో బాగుటుంది.

 

Click to compare, buy, and renew Car Insurance online

Buy InsuranceBuy Now

Story first published: Wednesday, April 19, 2017, 10:44 [IST]
English summary
Read In Telugu To Know About Bengaluru HDK Cabs To Counter Ola And Uber
Please Wait while comments are loading...

Latest Photos