తక్కువ మెయింటెనెన్స్ గల పది ఉత్తమ కార్లు

తక్కువ బడ్జెట్‌తో, తక్కువ నిర్వహణ గల టాప్ 10 ఇండియన్ కార్ల గురించి ఇవాళ్టి స్టోరీలో తెలుసుకుందాం రండి.

By Anil

తక్కువ ధరలతో లభించే కార్లను మాత్రమే కాదు, భవిష్యత్తులో వాటి నిర్వహణ ఖర్చులను కూడా బేరీజు వేసుకుని కార్లను ఎంచుకోవాల్సి ఉంటుంది. లేదంటే నిర్వహణ భారం పెరిగిపోయి ఎంతో ఇష్టంగా కొనుకున్న కార్లను బేరానికి పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది.

నేడు తెలుగు పాఠకుల కోసం తక్కువ నిర్వహణ ఖర్చు గల పది అత్యుత్త కార్ల గురించి....

10. టయోటా ఎటియోస్ లివా

10. టయోటా ఎటియోస్ లివా

జపాన్‌కు చెందిన దిగ్గజ ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ టయోటా కిర్లోస్కర్ సంస్థకు చెందిన కొన్ని ఉత్పత్తులు తక్కువ మెయింటెనెన్స్ ను కలిగి ఉన్నాయి, వీటి నిర్వహణ సామర్థ్యం చాలా సులభం. అంతే కాకుండా ఉత్తమ నాణ్యత మరియు నమ్మకమైన పనితీరుకు ఉత్తమ ఉదాహరణగా చెప్పుకోవచ్చు. వాటిలోని ఎటియోస్ లివా హ్యాచ్‌బ్యాక్ మా ఈ జాబితాలో 10 స్థానంలో నిలిచింది. నిర్వహణ భారం తక్కువ అనే కారణం చేత ఎటియోస్ లివా పట్ల కొనుగోలుదారులు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు.

టాప్ 10 లో మెయింటెనెన్స్ కార్లు

సాంకేతికంగా టయోటా ఎటియోస్ లివా 1.2-లీటర్ పెట్రల్ మరియు 1.4-లీటర్ డీజల్ వేరియంట్లతో లభించును. పెట్రోల్ వేరియంట్ లీటర్‌కు 18.16కిమీలు మరియు డీజల్ వేరియంట్ లీటర్‌కు 23.59కిమీల మైలేజ్ ఇవ్వగలవు. ఎటియోస్ లివా ధరల శ్రేణి రూ. 5.64 నుండి 7.54 లక్షలు ఎక్స్ షోరూమ్‌గా ఉన్నాయి.

09. హ్యుందాయ్ గ్రాండ్ ఐ10

09. హ్యుందాయ్ గ్రాండ్ ఐ10

తక్కువ నిర్వహణ ఖర్చుతో హ్యాచ్‌బ్యాక్ ఎంచుకునేవారికి గ్రాండ్ ఐ10 ఓ ఉత్తమ ఎంపిక. విభిన్న కస్టమర్లను ఆకట్టుకునేలా పెట్రోల్ మరియు డీజల్ ఇంజన్ వేరియంట్లతో లభించును. ప్రత్యేకించి దీని అద్బుతమైన బాడీ డిజైన్ హ్యుందాయ్ మోటార్స్‌కు బెస్ట్ సెల్లింగ్ కారుగా నిలిచింది.

టాప్ 10 లో మెయింటెనెన్స్ కార్లు

సాంకేతికంగా ఇందులో 18.9కిమీల మైలేజ్ ఇవ్వగల 1.2-లీటర్ పెట్రోల్ మరియు 24కిమీల మైలేజ్ ఇవ్వగల 1.1-లీటర్ డీజల్ ఇంజన్ కలదు. ఆటోమేటిక్ మరియు మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌ అనుసంధానంతో లభించే దీని ప్రారంభ ధర రూ. 4.91 మరియు టాప్ ఎండ్ వేరియంట్ ధర రూ. 6.99 లక్షలు ఎక్స్ షోరూమ్ ఢిల్లీగా ఉన్నాయి.

08. మారుతి సుజుకి స్విఫ్ట్ డిజైర్

08. మారుతి సుజుకి స్విఫ్ట్ డిజైర్

మారుతి సుజుకి ప్రతి ఏడాది అమ్మకాల్లో స్విఫ్ట్ డిజైర్ రెండవ స్థానంలో నిలుస్తోంది. దీనికి ప్రధాన కారణాలు, తక్కువ నిర్వహణ ఖర్చు మరియు దేశవ్యాప్తంగా విస్తరించిన మారుతి సర్వీస్ సెంటర్లు. మరే కార్ల తయారీ సంస్థకు ఈ విధమైన నెట్‌వర్క్ లేదంటే నమ్మండి.

టాప్ 10 లో మెయింటెనెన్స్ కార్లు

మారుతి సుజుకి లైనప్‌లో ఉన్న స్విఫ్ట్ డిజైర్ 20.85 కిమీల మైలేజ్ ఇవ్వగల 1.2-లీటర్ పెట్రోల్ మరియు 26.59కిమీల మైలేజ్ ఇవ్వగల 1248సీసీ సామర్థ్యం ఉన్న డీజల్ ఇంజన్ వేరియంట్లలో లభించును. మ్యాన్యువల్ మరియు ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ అనుసంధానంతో లభించే స్విఫ్ట్ డిజైర్ ప్రారంభ వేరియంట్ ధర రూ.5.17 లక్షలు మరియు టాప్ ఎండ్ వేరియంట్ ధర రూ. 8.58లక్షలు ఎక్స్ షోరూమ్ ఢిల్లీగా ఉన్నాయి.

 7. మారుతి సుజుకి స్విఫ్ట్

7. మారుతి సుజుకి స్విఫ్ట్

మారుతి సుజుకిలో లో తక్కువ నిర్వహణ ఖర్చులు గల కారులో స్విప్ట్ హ్యాచ్‌బ్యాక్ ఒకటి. ఇంజన్ మరియు ట్రాన్స్‌మిషన్ వంటి సాంకేతిక పరికరాలను డిజైర్ నుండి ఇది పంచుకుంది. దేశవ్యాప్తంగా విస్తారంగా అందుబాటులో ఉన్న సర్వీస్ సెంటర్లు దీని భారీ విజయానికి మరో ప్రధాన కారణం.

టాప్ 10 లో మెయింటెనెన్స్ కార్లు

1197సీసీ పెట్రోల్ మరియు 1248సీసీ సామర్థ్యం ఉన్న డీజల్ ఇంజన్ వేరియంట్లలో లభించే స్విఫ్ట్ కేవలం మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో మాత్రమే లభిస్తోంది. పెట్రోల్ వేరియంట్ మైలేజ్ 20.4కిమీలు మరియు డీజల్ వేరియంట్ మైలేజ్ కిమీలుగా ఉంది. ధరల శ్రేణి రూ. 4.76 నుండి 7.44 లక్షల మధ్య ఎక్స్ షోరూమ్ ఢిల్లీగా ఉంది.

6. హ్యుందాయ్ ఇయాన్

6. హ్యుందాయ్ ఇయాన్

దక్షిణ కొరియాకు చెందిన దిగ్గజ ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ అందుబాటులో ఉంచిన తమ ఏకైక ఎంట్రీ లెవల్ హ్యాచ్‌బ్యాక్ ఇయాన్. దీని మెయింటెనెన్స్ ఛార్జీలను చాల తక్కువగా ఉండేలా నిర్ణయించింది. తద్వారా కస్టమర్లు దీని యొక్క దీర్ఘకాలిక ప్రయోజనాలను అనుభవించే అవకాశం ఉంది.

టాప్ 10 లో మెయింటెనెన్స్ కార్లు

ఇయాన్ సాంకేతికంగా 814సీసీ సామర్థ్యం గల పెట్రోల్ మరియు ఎల్‌పిజి ఇంజన్‌ను కలిగి ఉంది. రెండు ఇంధన వేరియంట్లు లీటర్‌కు 21.1 కిమీల మైలేజ్ ఇవ్వగలవు. మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో లభించే ఇయాన్ ధరల శ్రేణి రూ. 3.28 నుండి 4.52 లక్షల మధ్య ఎక్స్ షోరూమ్ ఢిల్లీగా ఉంది.

5. టాటా నానో జెన్ఎక్స్

5. టాటా నానో జెన్ఎక్స్

భారతదేశపు అత్యంత సరసమైన కారు టాటా జెన్ఎక్స్. టాటా మోటార్స్ ప్రత్యేకించి ఇండియన్స్ కోసం అభివృద్ది చేసిన ఈ కారు ప్రపంచంలోనే అత్యంత సరసమైన కారుగా నిలిచింది. దీని నిర్వహణ ఖర్చులు కూడా చాలా వరకు తక్కువ.

టాప్ 10 లో మెయింటెనెన్స్ కార్లు

టాటా మోటార్స్ నానో జెన్ఎక్స్ కారులో 624సీసీ సామర్థ్యం గల పెట్రోల్ ఇంజన్ అందించింది. ఆటోమేటిక్ వేరియంట్ 21.9 కిమీలు మరియు మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ వేరియంట్ 23.6కిమీల మైలేజ్ ఇవ్వగలదు. టాటా నానో జెన్ఎక్స్ ధరల శ్రేణి రూ. 2.23 నుండి 3.20 లక్షల మధ్య ఎక్స్ షోరూమ్ ఢిల్లీగా ఉంది.

4. మారుతి సుజుకి వ్యాగన్ ఆర్

4. మారుతి సుజుకి వ్యాగన్ ఆర్

సర్వీస్ మరియు మెయింటెనెన్స్ తక్కువగా ఉన్నప్పుడు వేరియంట్ ఎంత పాతదైనా అత్యుత్తమ అమ్మకాలు సాగిస్తుందనడానికి గల బెస్ట్ ఉదాహరణ వ్యాగన్ఆర్. ఎన్నెన్నో కొత్త మోడళ్లు విడుదలవుతూనే ఉన్నాయి. అయినా కూడా వాటి ప్రభావం వ్యాగన్ ఆర్ అమ్మకాలు మీద ఏ మాత్రం పడటం లేదు.

టాప్ 10 లో మెయింటెనెన్స్ కార్లు

మారుతి వ్యాగన్ ఆర్ 1.0-లీటర్ సామర్థ్యంతో పెట్రోల్ మరియు సిఎన్‌జి ఇంధన వేరియంట్లలో అందుబాటులో ఉంది. రెండు వేరియంట్లు కూడా 20.5కిమీల మైలేజ్ ఇవ్వగలవు. మ్యాన్యువల్ మరియు ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌ అనుసంధానంతో లభించే వీటి ధర ల శ్రేణి రూ. 4.10 నుండి 5.16 లక్షల మధ్య ఎక్స్ షోరూమ్ ఢిల్లీగా అందుబాటులో ఉన్నాయి.

3. మారుతి సుజుకి సెలెరియో

3. మారుతి సుజుకి సెలెరియో

మారుతి సుజుకి ప్రవేశపెట్టిన మరో సరసమైన ఎంట్రీ లెవల్ హ్యాచ్‌బ్యాక్ సెలెరియో. ఇండియన్ మార్కెట్లోకి ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ పరిచయం చేసిన మొదటి సరసమైన కారుగా నిలవడమే కాదు, తక్కువ నిర్వహణ సామర్థ్యం గల మోడల్‌గా మా ఈ జాబితాలో మూడవ స్థానంలో నిలిచింది.

టాప్ 10 లో మెయింటెనెన్స్ కార్లు

సెలెరియో హ్యాచ్‌బ్యాక్ పెట్రోల్ మరియు డీజల్ ఇంజన్ వేరియంట్లలో లభించును. ఇందులోని 1.0-లీటర్ పెట్రోల్ ఇంజన్ 23.1 కిమీల మైలేజ్ మరియు 800సీసీ సామర్థ్యం గల డీజల్ వేరియంట్ 27.64కిమీల మైలేజ్ ఇవ్వలదు. సెలెరియో ధరల శ్రేణి రూ. 4.03 - 5.90 లక్షలు ఎక్స్ షోరూమ్ ఢిల్లీగా ఉంది.

2. మారుతి సుజుకి ఆల్టో కె10

2. మారుతి సుజుకి ఆల్టో కె10

ఆల్టో కె10 తక్కువ నిర్వహణ భారం ఉన్న కారు మాత్రమే కాదు, ప్రస్తుతం నగర అవసరాలకు అచ్చంగా సెట్ అవుతుంది. మారుతి వారి ఆల్టో కె10 డబ్బుకు తగ్గ విలువలను కలిగి ఉండటం మరో ప్రత్యేకత.

టాప్ 10 లో మెయింటెనెన్స్ కార్లు

కేవలం పెట్రోల్ వేరియంట్లో మాత్రమే లభించే ఈ కె10 లీటర్‌కు 24.07కిమీల మైలేజ్ ఇవ్వగలదు, ఇందులోని 1.0-లీటర్ ఇంజన్‌కు మ్యాన్యువల్ మరియు ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ అనుసంధానం కలదు. ఆల్టో కె10 ప్రారంభ వేరియంట్ ధర రూ. 3.26 లక్షలు మరియు టాప్ ఎండ్ వేరియంట్ ధర రూ. 4.11 లక్షలు ఎక్స్ షోరూమ్ ఢిల్లీగా ఉన్నాయి.

1. మారుతి సుజుకి ఆల్టో 800

1. మారుతి సుజుకి ఆల్టో 800

మారుతి ఆల్టో సరసమైన, నమ్మకమైన మరియు ప్రాక్టికల్‌గా రోజూ వారి సిటి అవసరాలకు ఉపయోగించుకునే కారు. దేశ వ్యాప్తంగా విసృతమైన సేల్స్ మరియు సర్వీసింగ్ నెట్‌వర్క్ కలిగి ఉండటంతో పాటు రోజు వారి నిర్వహణ చాలా తక్కువగా ఉండటం దీని ప్రత్యేకత. ఇండియాలో బెస్ట్ సెల్లింగ్ కార్ల జాబితాలో మొదటి జాబితాలో నిలవడానికి గల ప్రధాన అంశాలు ఇవేనని చెప్పవచ్చు.

టాప్ 10 లో మెయింటెనెన్స్ కార్లు

మారుతి సాంకేతికంగా ఇందులో లీటర్‌కు 24.7కిమీల మైలేజ్ ఇవ్వగల 800సీసీ సామర్థ్యం గల పెట్రోల్ ఇంజన్ అందించింది. మారుతి ఆల్టో ఎంట్రీ లెవల్ వేరియంట్ ధర రూ. 2.45 లక్షలు మరియు టాప్ ఎండ్ వేరియంట్ ధర రూ. 3.72 లక్షలు ఎక్స్ షోరూమ్ ఢిల్లీగా ఉన్నాయి.

టాప్ 10 లో మెయింటెనెన్స్ కార్లు

కారు కొనమని సలహా ఇస్తే... కార్ల కంపెనీనే కొనేశాడు...!!

ట్విట్టర్‌లో ఓ వ్యక్తి ఆనంద్ మహీంద్రా కు కారు కొనమని సలహా ఇచ్చాడు.... అయితే దిగ్గజ వ్యాపారవేత్త ఏకంగా ఆ కార్లు తయారు చేసే కంపెనీనే కొనేశాడు.

టాప్ 10 లో మెయింటెనెన్స్ కార్లు

ప్రతి రెడి గో ఓనర్ చదవాల్సిందే....!!

నాలుగు కార్లను మార్కెట్ నుండి తొలగించిన మారుతి సుజుకి

Most Read Articles

English summary
Best Low Maintenance Car Models In India
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X