బిఎమ్‌డబ్ల్యూ 6-సిరీస్‌లో లిమిటెడ్ ఎడిషన్ ఎమ్ స్పోర్ట్ ప్యాకేజ్

Written By:

బిఎమ్‌డబ్ల్యూ తమ 6-సిరీస్ వేరియంట్లో భిన్నత్వాన్ని కోరుకునే కస్టమర్లకు లిమిటెడ్ ఎడిషన్‌గా ఎమ్ స్పోర్ట్ ప్యాకేజిని అందిస్తోంది. దీని ప్రత్యేకతలు మరియు అందుబాటులోకి వచ్చే వివరాలు గురించి పూర్తిగా తెలుసుకుందాం రండి...

బిఎమ్‌డబ్ల్యూ ఎమ్ స్పోర్ట్ లిమిటెడ్ ఎడిషన్ ప్యాకేజ్ వేరియంట్ల మీద ఆర్డర్లను ఏప్రిల్ 2017 నుండి స్వీకరించనున్నట్లు తెలిపింది. ఈ ప్యాకేజిలో ఎక్ట్సీరియర్ పెయింట్ జాబ్ అత్యంత ప్రత్యేకమైనది.

ఎమ్ స్పోర్ట్ లిమిటెడ్ ఎడిషన్ 6-సిరీస్ ఎక్ట్సీరియర్ మీద సోనిక్ స్పీడ్ బ్లూ మెటాలిక్ పెయింట్ చేయడం జరిగింది. 2017 మోడల్ కారులో ఈ పెయింట్ జాబ్ రావడం ఇదే మొదటి సారి.

అంతే కాకుండా ఈ ప్యాకేజీలో టు-టన్-20-అంగుళాల అల్లాయ్ వీల్స్ కలవు, వీటిని కేవలం లిమిటెడ్ ఎడిషన్‌గా అతి తక్కవ సంఖ్యలో అందుబాటులోకి తీసుకొస్తున్న విషయాన్ని గుర్తించగలరు.

ఎమ్ స్పోర్ట్ లిమిటెడ్ ఎడిషన్ ఇంటీరియర్ విషయానికి వస్తే సౌకర్యవంతమైన సీట్లు, నీలి రంగు సొబగులతో వ్యక్తిగత లెథర్ సీట్లు, కస్టమైజ్‌డ్ ఫ్లోర్ మ్యాట్లు, 'ఇంటీరియర్ లోని ప్రధాన భాగాలలో ఎమ్ స్పోర్ట్ లిమిటెడ్ ఎడిషన్ సూచించే ప్రత్యేక బ్యాడ్జింగ్ కలదు.

దేశీయంగా ఉన్న 6-సిరీస్ లోని ఎలాంటి వేరియంట్‌నైనా బిఎమ్‌డబ్ల్యూ యొక్క నూతన ప్యాకేజీతో ఎంచుకోవచ్చు, అయితే వారి ఛాయిస్‌ల బట్టి ధరను నిర్ణయించడం జరుగుతుంది.

బిఎమ్‌డబ్ల్యూకు చెందిన మరిన్ని కార్లను వీక్షించాలనుకుంటున్నారా...? మరెందుకు ఆలస్యం క్రింద ఉన్న గ్యాలరీ మీద క్లిక్ చేయండి, మీకు నచ్చిన ఫోటోలను పూర్తి ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోండి.

 

Click to compare, buy, and renew Car Insurance online

Buy InsuranceBuy Now

English summary
BMW Gives The New 6 Series A Much Needed M Sport Treatment
Please Wait while comments are loading...

Latest Photos