ఇండియన్స్ ఊహించని ప్రత్యేకతలతో 2017 బిఎమ్‍‌డబ్ల్యూ ఎమ్5

Written By:

ఒకప్పుడు రియర్ వీల్ డ్రైవ్, ఆ తరువాత ఫ్రంట్ వీల్ డ్రైవ్ సిస్టమ్‌లను స్టాండర్డ్‌ వేరియంట్‌గా బిఎమ్‌డబ్ల్యూ తమ కార్లను అందుబాటులో ఉంచేది. అయితే పాత సాంప్రదాయానికి పులిస్టాప్ పెడుతూ, ఏకంగా ఆల్ వీల్ డ్రైవ్ సిస్టమ్‌ను స్టాండర్డ్ వేరియంట్లోనే తమ 2017 ఎమ్5 ద్వారా ప్రవేశపెట్టడానికి బిఎమ్‌డబ్ల్యూ సిద్దమైంది.

2017 బిఎమ్‌డబ్ల్యూ ఎమ్5 సూపర్ సెలూన్ కారు ఇప్పుడున్న ఐదవ తరానికి చెందిన వేరియంట్‌తో పోల్చుకుంటే విభిన్నంగా రీడిజైన్‌తో రానుంది. ఆల్ డ్రైవ్ సిస్టమ్‌తో మొదటి ఎమ్5 ఇండియాకు తొలిసారిగా బిఎమ్‌డబ్ల్యూ తీసుకురానుంది.

గతంలో ఉన్న ఐదవ తరానికి చెందిన ఎమ్5 లో ట్విన్ టుర్బో ఛార్జ్‌డ్ వి8 పెట్రోల్ ఇంజన్ కలదు, ఇది గరిష్టంగా 592బిహెచ్‌పి పవర్ ఉత్పత్తి చేయును. దీనికి స్టాండర్డ్‌గా 8-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ గల గేర్‌బాక్స్ అనుసంధానం కలదు.

నాలుగు చక్రాలకు పవర్ మరియు టార్క్ సరఫరా చేసే సిస్టమ్‌తో స్టాండర్డ్‌గా రానున్న 2017 బిఎమ్‌డబ్ల్యూ ఎమ్5 గురించి బిఎమ్‌డబ్ల్యూ సీనియర్ అధికారులు మాట్లాడుతూ, వేగంగా యాక్సిలరేట్ చేయగల సామర్థ్యంతో పాటు సాంకేతికంగా పోటీదారులకు గట్టి సమాధానం ఇవ్వగలదని పేర్కొన్నారు.

బిఎమ్‌డబ్ల్యూ తమ 7-సిరీస్‌లో ఎలాగైతే డ్రైవర్ లెస్ డ్రైవ్ సిస్టమ్‌ను అందించారు. అచ్చం అదే పరిజ్ఞానాన్ని ఎమ్ సిరీస్‌లో అందివ్వడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది.

రియర్ వీల్ డ్రైవ్ సిస్టమ్ ఉన్న మునుపటి వేరియంట్‌కు ఈ ఫోర్ వీల్ డ్రైవ్ సిస్టమ్‌ వేరియంట్ తోబుట్టువుగా ప్రపంచ ప్రదర్శనకు సిద్దం అవుతోంది. ముందుగా వచ్చే సెప్టెంబర్‌లో జరగనున్న 2017 ఫ్రాంక్‌ఫర్ట్ మోటార్ షో లో దీని తొలి ప్రదర్శన ఉండనుంది.

మెర్సిడెస్ ఈ మధ్యనే పరిచయం చేసిన 4.0-లీటర్ సామర్థ్యం ఉన్న వి8 ఇంజన్ గల మెర్సిడెస్ ఏఎమ్‌జి ఇ63 ఎస్ 4మ్యాటిక్ వేరియంట్‌కు గట్టి పోటీనివ్వనుంది. మరియు ఆడి యొక్క 4.0-లీటర్ వి8 ట్విన్ టుర్బో ఛార్జ్‌డ్ ఆర్ఎస్6 వేరియంట్లకు సరికొత్త బిఎమ్‌డబ్ల్యూ ఎమ్5 గట్టి పోటీనివ్వనుంది.

మీరు బిఎమ్‌డబ్ల్యూ కార్లకు ఫ్యానా..? అయితే బిఎమ్‌డబ్ల్యూ వద్ద ఉన్న అన్ని కార్లను ఫోటోల రూపంలో వీక్షించే అవకాశం మీ కోసం. మరెందుకు ఆలస్యం క్రింది గ్యాలరీ మీద క్లిక్ చేయండి... మీకు నచ్చిన కార్ల ఫోటోలను వీక్షించండి...

 

Click to compare, buy, and renew Car Insurance online

Buy InsuranceBuy Now

English summary
2017 BMW M5 To Receive 600BHP And Four-Wheel Drive System
Please Wait while comments are loading...

Latest Photos