భారత్‌లో బిఎస్-III వాహనాల తయారీ మరియు అమ్మకాల నిషేధం

ఏప్రిల్ 1, 2017 నుండి భారత్‌లో బిఎస్-III వాహనాల అమ్మకాలపై సుప్రీం కోర్టు నిషేధం ప్రకటించింది. దీనిపై వాహన పరిశ్రమ ప్రముఖలు మరియు పర్యావరణ పరిరక్షకుల స్పందన ఎలా ఉందంటే....

By Anil

భారత సర్వోన్నత న్యాయస్థానం తీసుకున్న సంచలనాత్మక నిర్ణయాల్లో దీనినొక ప్రముఖ నిర్ణయంగా పరిగణించవచ్చు. ఆటోమొబైల్ తయారీ పరిశ్రమను అతలాకుతలం చేసే బిఎస్-III వాహనాల అమ్మకాలను నిషేధించే నిర్ణయం తీసుకుంది. ఈ తీర్పు ప్రకారం సుమారుగా 8 లక్షలకు పైగా బిఎస్-III వాహనాలు నిషేధానికి గురయ్యాయి.

భారత్‌లో బిఎస్-III వాహనాల అమ్మకాలపై నిషేధం

ప్రస్తుతం దేశీయంగా అమల్లో ఉన్న ఉద్గార నియమాలను సవరించే క్రమంలో వాహన తయారీదారులకు ఓ నిర్ణీత గడువును ఇచ్చి, గడువు తరువాత బిఎస్-III స్థానంలో బిఎస్-IV వాహనాలను మాత్రమే విక్రయించాలని సుప్రీం కోర్టు తీర్పునిచ్చింది.

భారత్‌లో బిఎస్-III వాహనాల అమ్మకాలపై నిషేధం

ఈ తీర్పు మేరకు దాదాపు అన్ని వాహన తయారీదారులు తమ బిఎస్-III ఇంజన్‌లను బిఎస్-IV కు అప్‌గ్రేడ్ చేశాయి. అయితే ఈ తీర్పు వెలువడకముందు కొన్ని తయారీ సంస్థలు బిఎస్-III వాహనాలను భారీ సంఖ్యలో ఉత్పత్తి చేసాయి.

భారత్‌లో బిఎస్-III వాహనాల అమ్మకాలపై నిషేధం

వాహన తయారీ సంస్థలుసుప్రీం కోర్టు తెలిపిన గడవు లోపు ఈ వాహనాలను విక్రయించలేకపోయాయి, అలా అమ్ముడుపోకుండా నిలిచిపోయిన బిఎస్-III వాహనాల సంఖ్య సుమారుగా 8 లక్షలకు పైమాటే అనే సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చరర్స్(SIAM) వెల్లడించింది.

తీర్పుపై వాహన పరిశ్రమ స్పందన

తీర్పుపై వాహన పరిశ్రమ స్పందన

సుప్రీం కోర్టు ఆదేశం మేరకు గడువు లోపు బిఎస్-III విక్రయాలు పూర్తి చేయాలంటే... గత రెండు నెలల క్రితం బుక్ చేసుకున్న బస్సులు మరియు లారీలు ప్రస్తుతం తయారీ దశలో ఉన్నాయి. వీటి డెలివరీ ఏప్రిల్ 1, 2017 తరువాత ఉంది. అప్పుడు రిజిస్ట్రేషన్ సమయంలో కేంద్ర నిర్ణయం ప్రకారం వెహికల్ రిజిస్ట్రేషన్ నిషేధిస్తే... ఇదే వాహనాలు బుక్ చేసుకున్నపుడు ఈ నిషేధం లేదు కదా... మరి అలాంటి వారి పరిస్థితి ఏమిటని వాహన పరిశ్రమ వర్గాలు ప్రశ్నిస్తున్నాయి.

భారత్‌లో బిఎస్-III వాహనాల అమ్మకాలపై నిషేధం

సర్వోన్నత న్యాయస్థానం తీసుకున్న నిర్ణయం బాగానే ఉంది, అయితే ఈ నిర్ణయం గతంలో బుక్ చేసుకున్న వారికీ వర్తిస్తుందా...? ఈ నిషేధం లేకముందు బిఎస్-III వాహనాలు బుక్ చేసుకున్న వారు గడువు తరువాత రిజిస్ట్రేషన్‌కు వెళితే తప్పు ఎవరిది ? మరియు ఈ అయోమయపు నిర్ణయం అన్యాయం అని సియామ్ వెల్లడించింది.

భారత్‌లో బిఎస్-III వాహనాల అమ్మకాలపై నిషేధం

టాటా మోటార్స్ ప్రెసిడెంట్ మయాంక్ పరీక్ దీని గురించి స్పందిస్తూ, ఎగుమతులపై ఈ ప్రభావం తీవ్రంగా ఉంటుంది. తద్వారా అంతర్జాతీయ విపణిలో దేశీయ వాహనాల విక్రయాలకు అంతరాయం కలగనుందని తెలిపాడు.

భారత్‌లో బిఎస్-III వాహనాల అమ్మకాలపై నిషేధం

అమ్ముడుపోకుండా నిలిచిపోయిన బిఎస్-III వాహనాలు తయారీదారుల వద్ద ఎంత శాతం మేరకు ఉండిపోయాయో అనే విషయం స్పష్టంగా తెలియదు. అయితే ముందస్తు ప్రణాళిక ప్రకారం భారీ సంఖ్యలో ఉత్పత్తి చేసిపెట్టుకున్న బిస్-III వాహనాల ద్వారా సంస్థలు భారీ నష్టాన్ని చవిచూసే ప్రమాదం ఉందని అభిప్రాయపడ్డారు.

భారత్‌లో బిఎస్-III వాహనాల అమ్మకాలపై నిషేధం

ఇదే విషయమై బజాజ్ ఆటో స్పందిస్తూ, కేంద్ర నియమాల్ని పాటిస్తూ, భాద్యతగా మార్చి 31, 2017 లోపే తమ అన్ని వాహనాలలో బిఎస్-IV ఇంజన్‌లను అందించాల్సి ఉంటుంది. ఈ క్రమంలో బజాజ్ తమ లైనప్‌లోని అన్నింటిలో బిఎస్-IV అప్‌గ్రేడ్స్ నిర్వహించింది. గడువు తరువాత కూడా బిఎస్-III వాహనాలను విక్రయించడం మంచిది కాదని పేర్కొంది.

పర్యావరణ పరిరక్షకులు

పర్యావరణ పరిరక్షకులు

పర్యావరణ మరియు ప్రజా ఆర్యోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని సుప్రీం కోర్టు తీసుకున్న నిర్ణయం ప్రతి ఒక్కరూ స్వాగతించదగినదని తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. పర్యావరణ మేలు మరియు ప్రజా ఆరోగ్యంకంటే ఏదీ ఎక్కువ కాదు. కాబట్టి మిగిలిపోయిన బిఎస్-III వాహనాల విక్రయాలను పూర్తిగా నిషేధించాలని పర్యావరణ పరిరక్షకులు పట్టుబడుతున్నారు.

భారత్‌లో బిఎస్-III వాహనాల అమ్మకాలపై నిషేధం

సుప్రీం కోర్టు గడువును వెల్లడించినప్పటికీ విక్రయాలను టార్గెట్ చేస్తూ బిఎస్-III వాహనాల ఉత్పత్తిని భారీగా చేపట్టడం ద్వారానే ఇప్పుడు స్టాక్ ఎక్కువైపోయిందని దుమ్మెత్తిపోస్తున్నారు.

భారత్‌లో బిఎస్-III వాహనాల అమ్మకాలపై నిషేధం

ఇంజన్‌లు ఉద్గారం చేసే ఉద్గారాల విలువను సవరణ చేస్తూ బిఎస్-III స్థానంలో బిఎస్-IV ఇంజన్‌లను మాత్రమే అందించివాహన విక్రయాలు చేపట్టాలని సుప్రీం కోర్టు తీసుకున్న నిర్ణయం ఏప్రిల్ 1, 2017 నుండి అమల్లోకి రానుంది.

భారత్‌లో బిఎస్-III వాహనాల అమ్మకాలపై నిషేధం

టాటా మోటార్స్ హేవళంబినామ సంవత్సర ఉగాది పర్వదినాన తమ టిగోర్ స్టైల్ బ్యాక్ సెడాన్ కారును దేశీయ మార్కెట్లోకి విడుదల చేసింది. టాటా టిగోర్ ధర, ఇంజన్, మైలేజ్, ఫీచర్లలతో పాటు పూర్తి వివరాలు తెలుసుకుందాం రండి....

Most Read Articles

English summary
BS-III Vehicles Banned In India: Experts' Reactions
Story first published: Thursday, March 30, 2017, 12:31 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X