బీట్ హ్యాచ్‌బ్యాక్ ఆధారిత సెడాన్ ఎసెన్షియాను విడుదలకు సిద్దం చేస్తున్న షెవర్లే

Written By:

షెవర్లే ఇండియా మొదటి సారిగా ఎసెన్షియా కాంపాక్ట్ సెడాన్‌ను 2016 ఇండియన్ ఆటో ఎక్స్ పో వేదిక మీద ప్రదర్శించింది. బీట్ హ్యాచ్‌బ్యాక్ ఆధారంతో అభివృద్ది చేసిన కాంపాక్ట్ సెడాన్‌ ఎసెన్షియాను అతి త్వరలో దేశీయంగా విడుదల చేయనుంది. ఇప్పటికే పలుమార్లు పరీక్షలు పూర్తి చేసుకుని ఇప్పుడు రహదారి పరీక్షలకొచ్చింది.

అమెరికా ఆధారిత ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ షెవర్లే సబ్ నాలుగు మీటర్ల కాంపాక్ట్ సెడాన్ సెగ్మంట్లోకి ప్రొడక్షన్ రెడీ మోడల్‌గా 2016 ఇండియన్ ఆటో ఎక్స్ పో వేదిక మీద ప్రదర్శించింది.

ఎక్ట్సీరియర్ మరియు ఇంటీరియర్‌కు చెందిన ఎలాంటి ఫీచర్లను గుర్తించడానికి వీల్లేకుండా నలుపు, తెలుపు చారలున్న కవర్‌తో కప్పేసి, రహదారి పరీక్షలను నిర్వహించారు. అయితే బీట్ ఎసెన్షియా కాంపాక్ట్ సెడాన్ యొక్క ఫీచర్లను స్వల్పమేర గుర్తించడం జరిగింది. ఆ వివరాలు.....

ఎసెన్షియా సెడాన్ వెనుక వైపు డిజైన్‌లో నిలువుటాకారం ఉన్న టెయిల్ ల్యాంప్స్ గుర్తించగలరు. ఎలాంటి హంగులు లేకుండా ప్లేన్ డిజైన్ శైలిని ఇక్కడ ఆవిష్కృతమవుతుంది.

సాంకేతికంగా ఇది 1.2-లీటర్ సామర్థ్యం ఉన్న స్మార్టెక్ పెట్రోల్ ఇంజన్‌తో రానుంది. ఇది గరిష్టంగా 76.8బిహెచ్‌పి పవర్ మరియు 106.5ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేయును.

డీజల్ వేరియంట్లో 1.0-లీటర్ సామర్థ్యం ఉన్న స్మార్టెక్ ఇంజన్ అందివ్వనుంది. ఈ డీజల్ ఇంజన్ గరిష్టంగా 56.3బిహెచ్‌పి పవర్ మరియు 142.5ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేయగలదు.

షెవర్లే ఇండియా దేశీయ కాంపాక్ట్ సెడాన్ సెగ్మెంట్లోకి మార్చి 2017 న విడుదల చేసే అవకాశం ఉంది. తాజా ఆటోమొబైల్ సమాచారం తెలుగులో పొందడానికి చూస్తూ ఉండండి తెలుగు డ్రైవ్‌స్పార్క్.

గాలితో నడిచే ఎయిర్ పోడ్ కారును సృష్టించిన టాటా
టాటా మోటార్స్ గాలితో నడిచే కారును అభివృద్ది చేస్తోంది. వచ్చే మూడేళ్ల నాటికి పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకురానున్నట్లు టాటా తెలిపింది.

 

Click to compare, buy, and renew Car Insurance online

Buy InsuranceBuy Now

English summary
Spy Pics: Chevrolet Beat Essentia Spotted Testing
Please Wait while comments are loading...

Latest Photos