షెవర్లే కార్ల ఓనర్ల పరిస్థితేంటి ? కస్టమర్ల ప్రశ్నలు... వాటికి షెవర్లే ఇచ్చిన సమాధానాలు!

Written By:

ఆశించిన స్థాయిలో ఫలితాలు సాధించనందున జనరల్ మోటార్స్‌కు షెవర్లే ఇండియన్ మార్కెట్ నుండి వైదొలిగింది. అంతే కాకుండా జనవరి 2018 నుండి ఎలాంటి విక్రయాలు జరగకుండా శాస్వతంగా కార్యకలాపాలను నిలిపివేయనున్నట్లు షెవర్లే తెలిపింది.

గుజరాత్‌లోని ఓ ప్లాంటును చైనాకు చెందిన ఆటోమొబైల్ సంస్థకు విక్రయించేసిన షెవర్లే, మహారాష్ట్రలోని తలెగావ్ ప్రొడక్షన్ ప్లాంటులో కార్లను యథావిధిగా ఉత్పత్తి చేసి విదేశీ మార్కెట్‌కు ఎగుమతి చేయనున్నట్లు ప్రకటించింది.

షెవర్లే ఇండియా వెబ్‌సైట్‌లో ఎలాంటి కార్యకలాపాలు ఉండవు, అయితే అధికారిక ప్రకటనలు మరియు కస్టమర్లు తరచూ అడిగే ప్రశ్నలకు సమాధానాలను ప్రచురించనుంది. మరి గత ఇరవైఏళ్లలో ఎంతో మంది షెవర్లే కార్లను కొనుగోలు చేసారు మరి వారందరీ పరిస్థితి ఏంటి ?

ప్రస్తుతం షెవర్లే కార్ల ఓనర్ల మదిలో మెదులుతున్న ప్రశ్నలు రెండే... వీటి సర్వీసింగ్ ఎలా ? మరియు వీడి విడి పరికరాల లభ్యత ఎలా ? దీనికి షెవర్లే ఇచ్చిన సమాధానాలు ఏంటో చూద్దాం రండి...

ఇది వరకు షెవర్లే ఇండియా విభాగం, స్పార్క్, బీట్, సెయిల్ హ్యాచ్‌బ్యాక్ మరియు సెయిల్ సెడాన్, క్రూజ్, ఎంజాయ్ మరియు తవేరా ఎమ్‌పీవీ, ట్రయల్‌బ్లేజర్ ఎస్‌యూవీ వాహనాలను అందుబాటులో ఉంచింది.

కస్టమర్లు....

మరి పై జాబితాలో ఉన్న కార్లను కొనుగోలు చేసిన కస్టమర్లు వాటికి చెందిన వారంటీ గురించి ఎలాంటి దిగులు చెందాల్సిన అవసరం లేదు. ఇందుకోసం దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో శిక్షణ పొందిన టెక్నీషియన్లతో సర్వీసింగ్ సెంటర్లను నిర్వహించనున్నట్లు షెవర్లే తెలిపింది.

జనవరి 2018 నుండి విక్రయాలను శాస్వతంగా నిలిపివేసినప్పటికీ ఏర్పాటు చేసిన అన్ని ప్రదేశాల్లోని సర్వీసింగ్ సెంటర్లను ప్రస్తుతం ఉన్న కస్టమర్ల కోసం కొనసాగిస్తున్నట్లు షెవర్లే పేర్కొంది.

విక్రయాల తరువాత స్పేర్ పార్ట్స్...

జనరల్ మోటార్స్ తమ కార్లను తయారు చేసే ప్లాంటులోని షెవర్లే ఉత్పత్తుల స్పేర్ పార్ట్స్‌ను తయారు చేయనుంది. విక్రయ కేంద్రాలను మూసివేసినప్పటికీ షెవర్లే కార్ల విడి పరికరాలను మార్కెట్లో అందుబాటులో ఉంచనుంది.

అన్నింటికంటే ప్రధానమైన అంశం, అన్ని వాహన తయారీ సంస్థలు తాము మార్కెట్ నుండి తొలగించే ఉత్పత్తులకు సంభందించిన స్పేర్ పార్ట్స్‌ను సుమారుగా 10 సంవత్సరాల వరకు అందుబాటులో ఉంచడాన్ని తప్పనిసరి చేసింది కేంద్ర ప్రభుత్వం.

దేశవ్యాప్తంగా షెవర్లే కొనసాగించనున్న 150 డీలర్ షిప్‌ల వద్ద షెవర్లే కార్లకు సంభందించిన అన్ని స్పేర్ పార్ట్స్‌ను అందుబాటులో ఉంచుతున్నట్లు తెలిపింది.

డీలర్లు...

విక్రయాల అనంతరం కార్లకు సర్వీసింగ్ నిర్వహించడానికి డీలర్లు అంగీకరించాయి. మరియు డీలర్లకు షెవర్లే పూర్తి అండగా నిలబడనున్నట్లు షెవర్లే నుండి సమాచారం. అయితే దీని గురించిన అధికారిక సమాచారం లేదు.

రీసేల్ వాల్యూ...

షెవర్లే ఇండియన్ మార్కెట్ నుండి నిష్క్రమించడానికి గల మరో ప్రధాన కారణం రీసేల్ వ్యాల్యూ. షెవర్లే కార్లకు మార్కెట్లో రీసేల్ వ్యాల్యూ ఉండదు అనే ప్రచారం ఎప్పటి నుండో జరుగుతూ వచ్చింది.

రీసేల్ వ్యాల్యూ సరిగ్గా లేదు అనే కారణంతో మంచి విక్రయాలు సాధించడంలో షెవర్లే అపజయాన్ని చవిచూసింది. అయితే షెవర్లే నిష్క్రమణ, షెవర్లే కార్లు విరివిగా ఓనర్లు చేతులు మారడం ఖాయం. తక్కువ ధరతో షెవర్లే కారు కొనాలనుకునే వారికి ఇదో సదావకాశం.

షెవర్లే తమ ఆర్&డి కేంద్రాన్ని తలెగావ్ ప్లాంట్లలో కార్యకలాపాలు యథావిధిగా కొనసాగించనుంది. మరియు కొత్త సాంకేతికతో కొత్త ఉత్పత్తులను అభివృద్ది చేసే పనిలో షెవర్లే నిమగ్నమవుతోంది. నూతన మోడళ్లతో షెవర్లే మళ్లీ ఏదో ఒక రోజున కార్యకలాపాలు ప్రారంభించే అవకాశం ఉంది.

Story first published: Sunday, May 21, 2017, 9:30 [IST]
English summary
Read In Telugu Chevrolet Exits India: What Happens If Your Are A Chevrolet Owner?
Please Wait while comments are loading...

Latest Photos