మార్కెట్ నుండి మూడు మోడళ్లను తొలగించిన షెవర్లే ఇండియా

Written By:

అమెరికాకు చెందిన జనరల్ మోటార్స్ దేశీయంగా షెవర్లే బ్రాండ్ పేరుతో కార్లను విక్రయిస్తూ వచ్చింది. అయితే ఇప్పుడు దేశీయంగా తమ కార్యకలాపాలను పూర్తిగా నిలిపివేసే దిశగా చర్యలు తీసుకుంటోంది. అందులో భాగంగా ఒకే సారి మూడు మోడళ్లను విపణి నుండి తొలగించింది. తవేరా, సెయిల్ మరియు ఎంజాయ్ ఎమ్‌పీవీ వెహికల్స్‌ను ఇక మీదట షోరూమ్‌లలో కొనుగోలు చేయలేరు.
 

షెవర్లే ఇండియా ఏప్రిల్ 2017 నుండి తమ లైనప్‌లో ఉన్న వాహనాల ఉత్పత్తిని పూర్తిగా నిలిపివేయడానికి సన్నద్దమవుతోంది. బిఎస్-III షెవర్లే తవేరా వెహికల్ అర్బన్ మార్కెట్లో ఆశించిన ఫలితాలు సాధించలేదు.

నిజానికి షెవర్లే ఇండియాకు దేశీయంగా తవేరా అత్యుత్తమ అమ్మకాలు సాధించిపెట్టేది. అయితే ఇప్పుడు విక్రయాల్లో వృద్దిని సాధించలేదనే నెపంతో మరియు తమ కార్యకలాపాలను పూర్తిగా నిలిపివేయనున్నట్లు తరుణంలో దీనిని విపణి నుండి తొలగించింది.

జనరల్ మోటార్స్ షేవర్లే బ్రాండ్ పేరుతో 2013లో ఎంజాయ్ ఎమ్‌పీవీని విడుదల చేసింది. అయితే ఎమ్‌పీవీ శ్రేణిలో పోటీని ఎదుర్కోలేకపోయింది. తద్వారా ఎంజాయ్ ఎమ్‌‌పీవీని కూడా మార్కెట్ నుండి తొలగించింది.

తవేరా, ఎంజాయ్ లతో పాటు వరుసగా సెయిల్ మరియు సెయిల్ యువా లను తమ లైనప్‌ నుండి నిష్క్రమించింది. ప్రస్తుతం షెవర్లే వద్ద ట్రయల్‌బ్లేజర్ ప్రీమియమ్ ఎస్‌యూవీ, బీట్ హ్యాచ్‌బ్యాక్ మరియు క్రజ్ సెడాన్‌లు ఉన్నాయి.

నిజానికి ట్రయల్‌బ్లేజర్ ప్రీమియమ్ ఎస్‌యూవీ స్వల్పమేర విక్రయాలు జరుపుతుండగా బీట్ మరియు క్రజ్ కార్ల విక్రయాలు మాత్రమే షెవర్లేని ఇన్ని రోజులు నిలబెడుతూ వచ్చాయి.

జనరల్ మోటార్స్ ఇప్పుడు ఎసెన్షియా కాంపాక్ట్ సెడాన్ ను తీసుకువస్తోంది. బీట్ హ్యాచ్‌బ్యాక్ ఆధారంతో రూపొందించబడిన దీనిని ఈ ఏడాదిలో ఆలస్యంగా విడుదల చేసే అవకాశం ఉంది. ఇండియాలో బీట్ హ్యాచ్‌బ్యాక్‌కు మంచి ఆదరణ ఉంది. ఎసెన్షియా ద్వారా దాన్ని మరింత పెంచే ప్రయత్నాలు చేస్తోంది.

జనరల్ మోటార్స్ షెవర్లే ఇండియా మీద సుమారుగా 1,000 మిలియన్ డాలర్ల పెట్టుబడి పెడుతున్న ఓ ప్రకటనలో వెల్లడించింది. అయితే ఈ మొత్తాన్ని ఫ్యూచర్ మోడల్స్ అభివృద్ది కోసం వినియోగించనున్నట్లు తెలిసింది.
ఇతరులు ఎక్కువగా చదువుతున్నవి:

హ్యాచ్‌బ్యాక్ కొనుగోలు చేసే ఆలోచనలో ఉన్నారా..? అయితే టాటా మోటార్స్ తమ సక్సెస్‌ఫుస్ టియాగో ఆధారిత సెడాన్ టిగోర్ ను విక్రయాలకు సిద్దం చేస్తోంది. దీని గురించి పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...

నూతన ఉత్పత్తుల తయారీ, విక్రయ కేంద్రాలను పంచుకోవడం, విడి భాగాల తయారీ పరంగా పరస్పరం సహకారం కోసం టాటా మోటార్స్ మరియు వోక్స్‌వ్యాగన్ భాగస్వామ్యపు ఒప్పందం కుదుర్చుకున్నాయి - మారుతికి కోలుకోలేని షాక్ ఇచ్చిన టాటా మరియు వోక్స్ వ్యాగన్

ఫ్యూచర్ హెలికాఫ్టర్ ఆవిష్కరించిన బెల్: కృతిమ మేధస్సు దీని ప్రత్యేకత!!

 

టాటా మోటార్స్ ఈ ఏడాది ప్రారంభంలో టాటా హెక్సా ఎస్‌యూవీని విడుదల చేసింది. శక్తివంతమైన ఇంజన్ ఆప్షన్‌తో 6 మరియు 7 సీటింగ్ సామర్థ్యం ఉన్న టాటా హెక్సా ఫోటోల కోసం క్రింది గ్యాలరీ మీద క్లిక్ చేయండి.

Click to compare, buy, and renew Car Insurance online

Buy InsuranceBuy Now

Story first published: Thursday, March 16, 2017, 14:58 [IST]
English summary
Chevrolet To Discontinue Three Cars In India — Bestselling Car Among The Victims
Please Wait while comments are loading...

Latest Photos