అడ్డదిడ్డంగా పార్కింగ్ చేసారా ? ఫోటో కొట్టండి వంద పట్టండి...!!

నో పార్కింగ్ ప్రదేశాల్లో కారు పార్కింగ్ చేసినట్లయితే మీ చేతిలో ఉన్న మొబైల్‌తో ఫోటో క్లిక్‌మనిపించండి, రూ. 100 రుపాయల రివార్డ్ పొందండి. త్వరలో దీనిని అమలు చేయడానికి కేంద్ర రవాణా శాఖ సిద్దమవుతోంది.

Written By:

సాధారణంగా పార్కింగ్ అండ్ నో పార్కింగ్ అనే ప్రదేశాలను సూచించే సైన్ బోర్డులు తప్పకుండా ఉంటాయి. ఐదు నిమిషాలే, పది నిమిషాలే కదా అనుకుని నో పార్కింగ్ ఏరియాల్లో పార్క్ చేస్తుంటారు చాలా మంది. అయితే ఇక మీదట అలా చేయకండి. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం త్వరలో ఒక చట్టాన్ని తీసుకురానుంది. అటుగా వెళ్లేవారికి మంచి ఆదాయాన్నివ్వగలదు.

అసలు కథనంలోకి వస్తో నో పార్కింగ్ ప్రదేశాల్లో కార్లు లేదా బైకులు పార్కింగ్ చేస్తే, వారు చేసిన పార్కింగ్ తీరును మీ వద్ద ఉన్న కెమెరా లేదా ఫోన్‌తో ఫోటో క్లిక్ మనిపించి సంభందింత అధికారులకు సెండ్ చేస్తే రూ. 100 ల రివార్డ్ పొందగలరు.

ఈ ఏడాది దేశీయ వాహన రంగం మీద భారత ప్రభుత్వం భారీగా దృష్టిసారించింది. ఇందుకోసం పైన తెలిపిన ఆలోచనను అమలు పరచడానికి కేంద్ర రవాణా శాఖ మంత్రి మార్గదర్శకాలను సిద్దం చేస్తున్నాడు. ఇందుకోసం కేంద్ర పట్టణాభివృద్ది శాఖ మంత్రితో కూడా మంతనాలు జరుపుతున్నట్లు తెలిసింది.

అయితే దేశీయంగా ప్రధాన నగరాలలో ట్రాఫిక్ మరియు పార్కింగ్ మీద ధీర్ఘదృష్టి సారించినట్లు తెలిసింది. గత నాలుగైదేళ్ల నుండి కార్ల కొనుగోళ్లు పెరుగుతున్న తరుణంలో రహదారుల మీద పార్కింగ్ చేసే వారి సంఖ్య నానాటికి పెరుగుతోంది. ఫలితంగా రహదారుల మీద ట్రాఫిక్ పెచ్చులు మీరుతోంది.

ఇప్పటికే కొత్త కారును కొనుగోలు చేసే వారు, ఆ కారు కోసం గల పార్కింగ్ స్థలాన్ని చూపే ఆధారాన్ని సమర్పించాలని ప్రకటించిన సంగతి విధితమే. ప్రస్తుతం దీనిని ఢిల్లీ మరియు కేంద్ర రాజధాని పరిధికి మాత్రమే పరిమితం చేసారు. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం కూడా దీనిని అమలు చేయాలని ఆలోచనలో ఉంది.

కాబట్టి మీ సమీపంలో, మీరు వెళ్లే దారిలో ఎవరయినా అస్తవ్యస్తంగా నో పార్కింగ్ ఏరియాల్లో పార్కింగ్ చేసినట్లయితే మొబైల్‌తో ఫోటోలు తీసి సంభందిత అధికారులకు సెండ్ చేయడానికి సిద్దమవ్వండి.

కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ మాట్లాడుతూ, దీని గురించి క్యాబినెట్ సభ్యులతో మరియు కేంద్ర పట్టణాభివృద్ది శాఖ మంత్రి వెంకయ్య నాయుడిగారితో చర్చించి తదుపరి నిర్ణయం తీసుకున్నట్లు అదే విధంగా ముందుగా దీనిని అమలు చేయనున్న నగరం గురించి వంటి అనేక వివరాలను త్వరలో వెల్లడిస్తాని తెలిపాడు.

ఇక మీదట హైదరాబాద్‌లో కార్లు కొనడం కష్టమే: ఎందుకంటే...?
హైదరాబాద్‌లో కొత్తగా కొనుగోలు చేసిన కార్ల రిజిస్ట్రేషన్ కు పార్కింగ్ స్పేస్ తప్పనిసరి అని చట్టాన్ని తీసుకొచ్చే నిర్ణయంలో తెలంగాణ సర్కారు ఉన్నట్లు తెలిసింది.

లీకైన టాటా హెక్సా ధరలు; ఎంతో తెలుసా...?
టాటా మోటార్స్ వచ్చే జనవరి 18, 2017 నాటికి ఇండియన్ మార్కెట్లోకి తమ హెక్సా ను విడుదల చేయనుంది. అయితే టాటా అధికారిక వెబ్‌సైట్ నుండి ఈ హెక్సా ధరలు లీక్ అయ్యాయి.

 

Click to compare, buy, and renew Car Insurance online

Buy InsuranceBuy Now

English summary
Click Photo Of Car Parked Wrongly Get Rs 100 Reward
Please Wait while comments are loading...

Latest Photos