ఫోన్లకు మాత్రమే కాదు... కార్లలో కూడా కార్నింగ్ గొరిల్లా గ్లాస్

ఇంత వరకు మొబైల్ స్క్రీన్‌కు ఏం కాకుండా ఉండేందుకు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ వినియోగించే వాళ్లం. ఇప్పుడు కార్ల కోసం కార్నింగ్ సంస్థ గొరిల్లా గ్లాస్‌ను రూపొందించింది.

Written By:

టెక్నాలజీ ఎప్పటికీ పరిమితం కాదు, ఏ రోజుకారోజు నూతన పరిజ్ఞానం ఆవిష్కరణ జరుగుతూనే ఉంటుంది. అది ఏ రంగంలో అయినా దానికి సంభందిత వేదిక మీద ఎప్పటికప్పుడు ప్రదర్శితమవుతూనే ఉంటుంది.

అందులో ఒకటి కార్ల కోసం రూపొందించిబడిన గొరిల్లా గ్లాస్. మొబైల్స్ ప్రపంచంలో కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విప్లవాన్ని సృష్టించిందనే చెప్పాలి. అయితే ఆటోమొబైల్ రంగంలో కూడా దీని ప్రభావాన్ని నిరూపించుకోనుంది.

అందులో ఒకటి కార్ల కోసం రూపొందించిబడిన గొరిల్లా గ్లాస్. మొబైల్స్ ప్రపంచంలో కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విప్లవాన్ని సృష్టించిందనే చెప్పాలి. అయితే ఆటోమొబైల్ రంగంలో కూడా దీని ప్రభావాన్ని నిరూపించుకోనుంది.

సరిగ్గా ఏడాది క్రితం 2017 ఫోర్డ్ జిటి కారులో గొరిల్లా గ్లాస్ అందిస్తామని ఫోర్డ్ తెలియజేశారు. అయితే 2017 కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్ షో వేదిక మీద ధృడమైన గొరిల్లా గ్లాస్ గల కాన్సెప్ట్ కారును కార్నింగ్ సంస్థ ప్రదర్శించింది.

కార్నింగ్ సంస్థ అంతర్గతంగా ఆటోమొబైల్ గ్లాస్‌ల అభివృద్ది మరియు తయారీ కోసం ప్రత్యేక విభాగాన్ని ప్రారంభించింది. డజన్ల కొద్దీ స్మార్ట్ ఫోన్లు మరియు ట్యాబ్ లలో వినియోగించే గొరిల్లా గ్లాస్‌ల కన్నా మరింత ధృడంగా కార్ల కోసం గొరిల్లా అద్దాలను అభివృద్ది చేస్తోంది ఈ ప్రత్యేక విభాగం.

అత్యధిక వేడి మరియు అత్యధిక చలిని తట్టుకుని నిలబడే విధంగా గొరిల్లా గ్లాస్‌లను రూపొందిస్తున్నారు. కార్నింగ్ సంస్థ ప్రదర్శించిన కారులో ముందు వైపు అద్దం, వెనుక వైపు అద్దం, డ్యాష్ బోర్డ్ డిస్ల్పే, స్టీరింగ్ వీల్ మీదున్న డిస్ల్పే, మరియు ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ మీదు గల తాకే తెర వంటి భాగాలలో గొరిల్లా గ్లాస్‌ను అందించింది.

వాహనాలలో వినియోగించే సాధారణ సాంప్రదాయకమైన అద్దాలతో పోల్చితే ఇది అత్యంత ధృడంగా ఉంటుంది. ప్రస్తుతం ఆటోమొబైల్ పరిశ్రమలో వినియోగిస్తున్న గ్లాస్‌ల కన్నా తక్కువ మందం మరియు తక్కువ బరువును కలిగి ఉంటాయి.

తాకే తెరల మీద వినియోగించే ఈ గ్లాస్ ద్వారా సింగల్ టచ్‌తో ఆపరేట్‌ చేయవచ్చు, అపారదర్శకం అనే ఇబ్బంది లేకుండా ఈ కార్నింగ్ కొరిల్లా గ్లాస్ సేవలందిస్తుంది.

కార్నింగ్ ఎక్జ్సిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ మరియు ఇన్నోవేటివ్ ఆధికారి మార్టి కర్రన్ మాట్లాడుతూ, కార్నింగ్ సంస్థ ఆటోమొబైల్ పరిశ్రమలో వాహనాలకు వినియోగించే గ్లాస్‌లు తక్కువ బరువు, ధృడత్వం, స్పష్టంగా చూడగలిగే అవకాశం మరియు భద్రత పరమైన లక్షణాలను కలిగి ఉంటాయని తెలిపాడు.

మొబైల్ డివైజ్‌ల గ్లాస్ కవర్ అందివ్వడంలో కార్నింగ్ సంస్థ ప్రపంచ వ్యాప్తంగా ప్రముఖ పాత్ర పోషిస్తోంది. తమ సాంకేతిక పరిజ్ఞానాన్ని మొబైల్ మరియు టాబ్‌లకు మాత్రమే సొంతం చేయకుండా ఆధునిక టెక్నాలజీని అభివృద్ది చేసి కారులో గ్లాస్ వినియోగించే అన్ని భాగాలలో కూడా కార్నింగ్ గొరిల్లా గ్లాస్ అందించింది.

మీలో ఎవరయినా స్విఫ్ట్ అభిమానులు ఉన్నారా...? అయితే మీ కోసం డ్రైవ్‌స్పార్క్ తెలుగు ఈ ఏడాదిలో విడుదల కానున్న 2017 మారుతి స్విఫ్ట్ ఫోటోలను గ్యాలరీగా అందిస్తోంది. అస్సలు మిస్సవకండి...
 

Click to compare, buy, and renew Car Insurance online

Buy InsuranceBuy Now

English summary
CES 2017: Corning Develops New Gorilla Glass, Not For Phones But Cars
Please Wait while comments are loading...

Latest Photos