యానివర్సరీ ఎడిషన్‌లో విడుదలైన డాట్సన్ గో మరియు గో ప్లస్

Written By:

జపాన్‌కు చెందిన సరసమైన కార్ల తయారీ సంస్థ నిస్సాన్ అనుభంద సంస్థ డాట్సన్ తమ గో హ్యాచ్‌బ్యాక్ మరియు గో ప్లస్ ఎమ్‌పీవీ కార్లను స్పెషల్ యానివర్సరీ ఎడిషన్‌లుగా మార్కెట్లోకి విడుదల చేసింది. డాట్సన్ దేశీయంగా కార్యకలాపాలు ప్రారంభించి మూడు సంవత్సరాలు గడిచిన నేపథ్యంలో తమ రెండు మోడళ్లను వార్షికోత్సవ ఎడిషన్‌గా విడుదల చేయడం జరిగింది.

  1. డాట్సన్ గో యానివర్సరీ ఎడిషన్ ధర రూ. 4.19 లక్షలు
  2. డాట్సన్ గో ప్లస్ యానివర్సరీ ఎడిషన్ ధర రూ. 4.9 లక్షలు
రెండు ధరలు ఎక్స్-షోరూమ్ ఢిల్లీగా ఉన్నాయి.
ఈ రెండు యానివర్సరీ ఎడిషన్‌లు గో మరియు గో ప్లస్ లో నూతన అదనపు ఫీచర్లు వచ్చినప్పటికీ టి(ఆప్షన్‌) వేరియంట్ ధరలనే కలిగి ఉన్నాయి.

డాట్సన్ గో మరియు గో ప్లస్ యానివర్సరీ ఎడిషన్స్ రెండింటిలో కూడా మొబైల్ ఫోన్ల కోసం యాంబియంట్ లైటింగ్ అప్లికేషన్లు కలవు. దీని ద్వారా క్యాబిన్ లోపల మనస్సుకు నచ్చిన లైటింగ్ ఎంచుకోవచ్చు.

గో మరియు గో ప్లస్ యానివర్సరీ ఎడిషన్ ఎక్ట్సీరియర్ విషయానికి వస్తే, యానివర్సరీ ఎడిషన్ బ్యాడ్జింగ్ పేరుతో సరికొత్త బాడీ గ్రాఫిక్స్ కలిగి ఉన్నాయి. మరియు రెండింటిలో కూడా స్పోర్టివ్ బ్లాక్ రియర్ స్పాయిలర్ కలదు.

ఇంటీరియర్‌లో మూడ్ లైట్ ఫీచర్‌తో పాటు నీలం రంగు చారలు గల సీట్లు మరియు డ్యాష్ బోర్డ్ కన్సోల్ కలదు.

అదనంగా ఇందులో యానివర్సరీ ప్లోర్ మ్యాట్లు, ఆర్ట్ లెథర్ సీట్లు, కీ లెస్ ఎంట్రీ సిస్టమ్, బ్లూటూత్ కనెక్టివిటి, రియర్ పార్కింగ్ సెన్సార్లు, రేడియో మరియు యుఎస్‌బి కనెక్టివిటి వంటి ఫీచర్లున్నాయి.

డాట్సన్ తమ అన్ని మోడళ్ల మీద రోడ్ సైడ్ ఉచిత అసిస్టెన్స్‌తో పాటు రెండు సంవత్సరాలు లేదా అపరిమితి కిలోమీటర్లు వారంటీ అందిస్తోంది.

ఈ రెండు స్పెషల్ ఎడిషన్ వేరియంట్ల విడుదల వేదిక మీద నిస్సాన్ మోటార్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ అరుణ్ మల్హోత్రా మాట్లాడుతూ, దేశీయంగా కార్యకలాపాలు ప్రారంభించిన మూడేళ్లలోపు అనేక మంది కస్టమర్లను చేరినట్లు తెలిపాడు.

డాట్సన్ ఉత్పత్తులు దేశీయంగా మంచి సక్సెస్ సాధించాయని, అందుకు గుర్తుగా యానివర్సరీ ఎడిషన్ వేరియంట్లుగా గో మరియు గో ప్లస్ వేరియంట్లను విడుదల చేసినట్లు తెలిపాడు.

ఇండియన్ మార్కెట్లో మూడు సంవత్సరాల పూర్తి చేసుకున్న సందర్భంగా డాట్సన్ ఇండియా సోషల్ మీడియా క్యాంపెయిన్ నిర్వహించి. కస్టమర్లు తమ కుటుంబంతో డాట్సన్ కార్ల ద్వారా గడిపిన క్షణాలను #UnitedByDatsun థీమ్‌తో ఆసక్తికరమైన స్టోరీగా పంచుకోగలరు.

గో మరియు గో ప్లస్ కార్ల విషయానికి వస్తే, రెండింటిలో కూడా 1.2-లీటర్ సామర్థ్యం ఉన్న పెట్రోల్ ఇంజన్ కలదు. ఇది గరిష్టంగా 67బిహెచ్‌పి పవర్ మరియు 104ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేయును.

గో మరియు గో ప్లస్ వేరియంట్లలోని ఇంజన్‌లకు 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ అనుసంధానం కలదు.

ఐదు మంది కూర్చునే సామర్థ్యం ఉన్న గో వేరియంట్ మరియు ఏడు మంది కూర్చునే సామర్థ్యం ఉన్న గో ప్లస్ వేరియంట్ రెండు కూడా లీటర్‌కు 20.63కిలోమీటర్ల మైలేజ్ ఇవ్వగలవు.

  • డాట్సన్ గో ప్రారంభ వేరియంట్‌ ధర రూ. 4,04,766
  • డాట్సన్ గో ప్లస్ ప్రారంభ వేరియంట్‌ ధర రూ. 4,69,942
రెండు ధరలు ఆన్ రోడ్ హైదరాబాద్‌గా ఉన్నాయి.

Click to compare, buy, and renew Car Insurance online

Buy InsuranceBuy Now

English summary
Read in Telugu to know about Datsun GO & GO+ Special Anniversary Edition Launched In India
Please Wait while comments are loading...

Latest Photos