ఫారడే ఫ్యూచర్ ఎలక్ట్రిక్ ఎస్‌యువి: 36 గంటల్లో 64,000 ల బుకింగ్స్

Written By:

ఫారేడ్ ఫూచర్ తమ మొదటి ఎక్ట్రిక్ ఎస్‌యువిని ఆవిష్కరించింది. ఈ ఏడాది ప్రారంభంలో లాస్ వెగాస్ లో జరిగిన 2017 కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్ షో వేదిక మీద ఎఫ్ఎఫ్91 అనే ఎస్‌యువిని ప్రదర్శించింది. 2018 నాటికి విడుదల కానున్న దీనిని ఇప్పటికే 64,000 ల మందికి పైగా బుక్ చేసుకున్నారు.

ఫారడే ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యువిని రెండు రకాలుగా బుక్ చేసుకునే సదుపాయాన్ని కల్పించింది. భారీగా బుకింగ్స్ నమోదవుతున్న తరుణంలో భవిష్యత్తులో పెద్ద సవాళ్లనే ఎదుర్కోవాల్సి వస్తుందని ప్రపంచ మార్కెట్ వర్గాల అంచనా.

ఇప్పటికే తమ ప్రొడక్షన్ ప్లాంటుకు సంభందించిన అద్దె చెల్లించడంలో ఫారడే ఫ్యూచర్ ఆర్థికంగా ఇబ్బందులు పడుతోంది, ఈ సమయంలో వినియోగదారుల నుండి బుకింగ్ రూపంలో డబ్బును సేకరించి ముందుగా ప్రకటించిన సమయానికి డెలివరీను ఇవ్వకపోతే పెను సవాళ్లను ఎదుర్కోవడం తప్పదు.

ఫారడే ఈ ఎస్‌యువిని రెండు రకాలుగా బుక్ చేసుకునే కల్పించిన అవకాశాల్లో మొదటిది రూ. 5,000 డాలర్లను చెల్లించడం అంటే ఇండియన్ కరెన్సీలో 3.41 లక్షలతో అన్నమాట. మరొకటి ఉచితంగా బుక్ చేసుకోవడం, వీటిని పరిమిత సంఖ్య వరకు మాత్రమే బుక్ చేసుకునే అవకాశం కల్పించింది ఫారడే ప్యూచర్.

ప్రస్తుతం బుకింగ్ కోసం చెల్లించిన మొత్తాన్ని బుకింగ్ రద్దు చేసుకుని తిరిగి పొందే అవకాశం కలదు. మొదటి లాట్ లో ఉత్పత్తి అయిన వాహనాలను డబ్బు చెల్లించి బుక్ చేసుకున్న వారికి మొదటి ప్రాధాన్యత క్రింద డెలివరీ ఇవ్వనుంది మరియు సాధారణంగా బుక్ చేసుకున్న వారికి రెండవ ప్రాధ్యానత క్రింద డెలివరీ ఇవ్వనుంది.

ఫారడే ఫ్యూచర్ అభివృద్ది చేసిన ఈ ఎఫ్ఎఫ్91 ఎస్‌యువి ఆల్ వీల్ డ్రైవ్ కలిగి ఉంది. దీని గరిష్ట పరిధి 600 కిలోమీటర్లుగా ఉంది. ఈ ఎస్‌యువి కేవలం 2.5 సెకండ్ల కాలంలోనే గంటకు 0 నుండి 100 కిలోమీర్ల వేగాన్ని అందుకుంటుంది.

ఫారడే ఫ్యూచర్ తమ ఎలక్ట్రిక్ ఎస్‌యువి యొక్క ధరను వెల్లడించలేదు. ఈ ఎఫ్ఎఫ్91 ఎస్‌యువి ప్రొడక్షన్ 2018 నుండి ప్రారంభించనున్నట్లు తెలిసింది.

తొలి ఎలక్ట్రిక్ బస్సు సర్వీస్ ప్రారంభించిన ఘనత వీరిదే...!!
నగర రవాణా కోసం ఎలక్ట్రిక్ బస్సు సర్వీసులను ప్రారంభించిన భారత దేశపు మొట్ట మొదటి నగరం బెంగళూరు. బెంగళూరు మెట్రోపాలిటన్ ట్రాన్స్‌పోర్ట్ కార్పోరేషన్ ఎలక్ట్రిక్ బస్సు సర్వీసులను ప్రారంభించింది.

2017 మోడల్ స్విప్ట్ అతి త్వరలో విడుదల కానుంది... దీని పూర్తి ఫోటోలు మీకోసం.....
 

Click to compare, buy, and renew Car Insurance online

Buy InsuranceBuy Now

Story first published: Tuesday, January 10, 2017, 11:14 [IST]
English summary
Faraday Future’s FF91 Electric SUV Garners 64,000 Bookings In Just 36 Hours
Please Wait while comments are loading...

Latest Photos