భారీగా ధర తగ్గింపు ప్రకటించిన ఫియట్ ఇండియా

Written By:

ఫియట్ ఇండియా లీనియా సెడాన్ ధరను పది లక్షల లోపు ఉండే విధంగా ధరల సవరణలు చేసారు. ప్రస్తుతం ధరల తగ్గింపు మీద తీసుకున్న ఆకస్మిక నిర్ణయం ప్రకారం అన్ని ఉత్పత్తుల మీద సుమారుగా 7 నుండి 7.3 శాతం మేర ధరల తగ్గింపు చేపట్టినట్లు ఫియట్ తెలిపింది.

ఫియట్ ఇండియా లైనప్‌లో ఉన్న లీనియా, పుంటో ఎవో మరియు అవెంచురా మీద ధరలను తగ్గించింది. దేశీయంగా ఉన్న అనేక కార్ల తయారీ సంస్థలు ఉత్పత్తి వ్యయం పెరిగిందనే కారణం చేత ధరల పెంపును చేపట్టాయి. అయితే ఫియట్ తమ ఉత్పత్తుల ధరలు తగ్గించి మార్కెట్ ను ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

ఫియట్ ఇండియా తమ లీనియా సెడాన్ మీద రూ. 77,000 లు, ఫుంటో ఎవో హ్యాచ్‌బ్యాక్ మీద రూ. 47,000 లు మరియు అవెంచురా క్రాసోవర్ మీద రూ. 64,000 ల వరకు ధరలను తగ్గించింది.

లీనియా సెడాన్ మీద జరిగిన ధరల సవరణలు

ఫియట్ లీనియా ధరల సవరణ అనంతరం రూ. 7.25 నుండి 9.99 లక్షల మధ్య ధరలతో అందుబాటులో ఉంది. గతంలో లీనియా 7.82 లక్షల నుండి 10.76 లక్షల ధరల మధ్య ఉండేది. దీని మీద సుమారుగా 7.3 శాతం ధరను తగ్గించింది.

పుంటో మీద 7 శాతం ధరను తగ్గించినట్లు ఫియట్ తెలిపింది. గతంలో రూ. 5.85 లక్షల నుండి 7.92 లక్షల మధ్య అందుబాటులో ఉండేది. ధరల సవరణ అనంతరం ఇది 5.45 లక్షల నుండి 7.55 లక్షల మధ్య ధరలతో లభించనుంది.

గతంలో ఫియట్ అవెంచురా రూ. 7.87 నుండి 9.28 లక్షల ధరతో లభించేది. అయితే ధరల సవరణ అనంతరం ఇది 7.25 లక్షల నుండి 8.75 మధ్య ధరలతో లభ్యం కానుంది.

ధరల సవరణ విషయంలో వ్యూహాత్మకంగా వ్యవహరించినట్లు ఫియట్ తెలిపింది. పట్టణ విక్రయాల మీద దృష్టిసారిస్తూ ధరల్లో కోత విధించామని ఫియట్ క్రిస్లర్ ఇండియా ప్రెసిడెంట్, ఎండీ కెవియన్ ప్లయన్ పేర్కొన్నారు.

ఫోర్డ్ మస్టాంగ్ కొనుగోలు చేసిన "కొలవెరి స్టార్ ధనుష్"
"వై దీస్ కొలవెరి సాంగ్" తో మంచి పాపులారిటీ దక్కించుకున్న తమిళ హీరో ధనుష్ ఫోర్డ్ ఇకానిక్ స్పోర్ట్స్ కారు మస్టాంగ్ ను కొనుగోలు చేశాడు.

మారుతి సుజుకి స్విఫ్ట్ కొనాలనుకుంటున్నారా...? అయితే కొద్ది రోజులు వేచి ఉండండి. త్వరలో 2017 స్విప్ట్ మార్కెట్లోకి విడుదల కానుంది. నూతన డిజైన్ శైలిలో విడుదల కానున్న స్విఫ్ట్ ఎలా ఉందో ఇక్కడ ఉన్న ఫోటోల మీద క్లిక్ చేయండి....
 

Read more on: #ఫియట్ #fiat
Story first published: Friday, January 6, 2017, 13:11 [IST]
English summary
Fiat India Slashes Prices Of Linea, Punto Evo & Avventura; Here Are The New Prices
Please Wait while comments are loading...

Latest Photos