స్పోర్ట్స్ ఎడిషన్ ఫిగో మరియు ఆస్పైర్‌లను విడుదల చేసిన ఫోర్డ్

Written By:

అమెరికాకు చెందిన దిగ్గజ ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ ఫోర్డ్ మోటార్స్ తమ ఫిగో హ్యాచ్‌బ్యాక్ మరియు ఆస్పైర్ కాంపాక్ట్ సెడాన్‌లను స్పోర్ట్స్ ఎడిషన్ రూపంలో మార్కెట్లోకి విడుదల చేసింది. సాధారణ ఫిగో మరియు ఆస్పైర్‌లతో పోల్చుకుంటే భిన్నంగా ఉండేందుకు ఇందులో అనేక కాస్మొటిక్ సొబగులద్దడం జరిగింది.

  • ఫోర్డ్ ఫిగో స్పోర్ట్స్ ఎడిషన్ పెట్రోల్ వేరియంట్ ధర రూ. 6.31 లక్షలు
  • ఫోర్డ్ ఫిగో స్పోర్ట్స్ ఎడిషన్ డీజల్ వేరియంట్ ధర రూ. 7.21 లక్షలు
  • ఫోర్డ్ ఆస్పైర్ స్పోర్ట్స్ ఎడిషన్ పెట్రోల్ వేరియంట్ ధర రూ. 6.50 లక్షలు
  • ఫోర్డ్ ఆస్పైర్ స్పోర్ట్స్ ఎడిషన్ డీజల్ వేరియంట్ ధర రూ. 7.60 లక్షలు
అన్ని ధరలు ఎక్స్-షోరూమ్ ఢిల్లీగా ఉన్నాయి.

స్పోర్ట్స్ ఎడిషన్ ఫిగో మరియు ఆస్పైర్ పెట్రోల్ వేరియంట్లు

ఫిగో మరియు ఆస్పైర్ లలో 1.2-లీటర్ సామర్థ్యం గల పెట్రోల్ ఇంజన్ కలదు. ఇది గరిష్టంగా 87బిహెచ్‌పి పవర్ మరియు 113ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేయును. దీనికి 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ గేర్‌బాక్స్ అనుసంధానం కలదు.

స్పోర్ట్స్ ఎడిషన్ ఫిగో మరియు ఆస్పైర్ డీజల్ వేరియంట్లు

స్పోర్ట్ ఎడిషన్ ఫిగో మరియు ఆస్పైర్ పెట్రోల్‌తో పాటు డీజల్ ఇంజన్ ఆప్షన్‌లో కూడా లభించును. ఇందులోని శక్తివంతమైన 1.5-లీటర్ సామర్థ్యం ఉన్న డీజల్ ఇంజన్ గరిష్టంగా 99బిహెచ్‌పి పవర్ మరియు 215ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేయును. దీనికి 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ గేర్‌బాక్స్ అనుసంధానం కలదు.

ఫోర్డ్ మోటార్స్ ఫిగో మరియు ఆస్పైర్‌లలో 1.5-లీటర్ సామర్థ్యం ఉన్న పెట్రోల్ ఇంజన్‌ను కూడా అందుబాటులో ఉంచింది. అయితే ఇది కొత్తగా విడుదల చేసిన స్పోర్ట్స్ ఎడిషన్‌ ఫిగో మరియు ఆస్పైర్‌లలో కాకుండా రెగ్యులర్ వెర్షన్‌లో మాత్రమే లభిస్తోంది.

రెగ్యులర్ ఫిగో మరియు ఆస్పైర్‌లలోని 1.5-లీటర్ సామర్థ్యం ఉన్న పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 110బిహెచ్‌పి పవర్ ఉత్పత్తి చేయును. దీనికి డ్యూయల్ క్లచ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ గల గేర్‌బాక్స్ అనుసంధానం కలదు. నాణ్యమైన రైడింగ్ కోసం ఇందులో అత్యుత్తమ సస్పెన్షన్ సిస్టమ్ అందించినట్లు ఫోర్డ్ తెలిపింది.

స్పోర్ట్స్ ఎడిషన్ ఫిగో మరియు ఆస్పైర్‌ రెండింటిలో కూడా చిన్న మరియు అతి ముఖ్యమైన కాస్మొటిక్ మార్పులు చోటు చేసుకున్నాయి. రెండు కార్లకు ఫ్రంట్ గ్రిల్‌ను బ్లాక్ కలర్‌లో అందిస్తూ, నల్లటి పొగచూరిన తరహాలో ఉన్నస్వెప్ట్ బ్లాక్ హెడ్ ల్యాంప్స్ అందివ్వడం జరిగింది.

ఫ్రంట్ బంపర్‌లో మలచబడిన తీరుగా ఉన్న గీతలు ద్వారా ఫ్రంట్ బంపర్ మరింత అగ్రెసివ్‌ లుక్‌ను తీసుకొచ్చింది. బంపర్‌కు ఇరువైపులా ఫాగ్ ల్యాంప్స్‌ను జోడించడం జరిగింది.

ఫోర్డ్ ఈ స్పోర్ట్స్ ఎడిషన్ హ్యాచ్‌బ్యాక్ మరియు కాంపాక్ట్ సెడాన్‌లలో ఎక్కువగా నలుపు రంగుతో కాస్మొటిక్ మెరుగులు అద్దింది. అందులో 15-అంగుళాల పరిమాణం ఉన్న అధునాతన బ్లాక్ అవుట్ స్పోర్టివ్ అల్లాయ్ వీల్స్, ఇంటిగ్రేటెడ్ టర్న్ ఇండికేటర్స్ గల గ్లోసి బ్లాక్ అవుట్ సైడ్ రియర్ వ్యూవ్ మిర్రర్స్ మరియు బ్లాక్ ఎండ్ రూఫ్ కలదు.

సాధారణ స్టాండర్డ్ మోడళ్లతో పోల్చుకుంటే ఈ స్పోర్ట్స్ ఎడిషన్ మోడళ్లలో బాడీ ప్రక్క వైపుల స్పోర్ట్స్ ఎడిషన్‌ను సూచించే విధంగా ఎస్ లెటర్ అందివ్వడం జరిగింది.

ఫిగో హ్యాచ్‌బ్యాక్ స్పోర్ట్స్ ఎడిషన్‌లో రూఫ్ మౌంటెడ్ స్పాయిలర్ మరియు కారుకు వెనుక వైపున రియర్ బంపర్ మీద ప్రత్యేక డీకాల్స్ అందించింది. అదే విధంగా ఫోర్డ్ ఆస్పైర్ రియర్ డిజైన్‌లో ఎలాంటి మార్పు లేదు.

ఎక్ట్సీరియర్‌ మీద ప్రధాన ప్రదేశాలలో స్పోర్ట్స్ ఎడిషన్‌ను గుర్తించేందుకు గాను ఎస్ లెటర్ అందివ్వడం జరిగింది. ఈ స్పోర్ట్స్ ఎడిషన్ ఫిగో మరియు ఆస్పైర్‌ ఎక్ట్సీరియర్ తరహాలోని ఇంటీరియర్‌లో కూడా స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి.

ఫిగోలోని అప్‌హోల్‌స్ట్రేను ఎరుపు రంగు దారంతో మరియు ఆస్పైర్లోని అప్‌హోల్‌స్ట్రేను ఫాగ్ గ్రే కలర్ దారంతో కుట్టడం జరిగింది. స్టీరింగ్ వీల్ కోసం సరికొత్త లెథర్ తొడుగులు అందించారు. ఇవి మినహాయిస్తే ఇంటీరియర్‌లో ఎలాంటి మార్పులు జరగలేదు.

Click to compare, buy, and renew Car Insurance online

Buy InsuranceBuy Now

Story first published: Monday, April 17, 2017, 17:41 [IST]
English summary
Read In Telugu to know about sports edition figo and aspire from ford. Get more details about price, engine, design, features and specifications of new ford special edition figo and aspire.
Please Wait while comments are loading...

Latest Photos