ఫిగో స్పోర్ట్స్ ఎడిషన్‌ను విడుదలకు సిద్దం చేస్తున్న ఫోర్డ్

Written By:

ఫోర్డ్ ఇండియా తమ అత్యుత్తమ హ్యాచ్‌బ్యాక్ ఫిగో ను స్పోర్ట్స్ ఎడిషన్‌గా విడుదల చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం తరం యొక్క ఫిగో హ్యాచ్‌బ్యాక్‌ ఎక్ట్సీరియర్ మీద కాస్మొటిక్ సొబగులందించి మరికొన్ని వారాల్లో దేశీయ విపణిలో అమ్మకాలకు సిద్దం చేయనున్నట్లు సమాచారం.

ఫోర్డ్ తమ సాధారణ ఫిగో హ్యాచ్‌బ్యాక్ కన్నా విభిన్నంగా ఉంచేందుకు స్పోర్ట్స్ ఎడిషన్‌లో ఎక్ట్సీరియర్ మీద కాస్మొటిక్ మెరుగులు అద్దనుంది. దీనిని కేవలం టైటానియమ్ వేరియంట్లో మాత్రమే అందించే అవకాశం ఉంది.

స్పోర్ట్స్ ఎడిషన్ ఫిగో హ్యాచ్‌బ్యాక్ ప్రస్తుతం ఇంగ్లాడులో అందుబాటులో ఉన్న ఫోర్డ్ కెఎప్లస్ బ్లాక్ అండ్ వైట్ ఎడిషన్‌ను పోలి ఉండనుందనే సమాచారం.

ఇందులోని ప్రత్యేకతల గురించి చూస్తే, 15-అంగుళాల బ్లాక్ అల్లాయ్ వీల్స్, తేనె తుట్టె ఆకారంలో ఉన్న ఫ్రంట్ గ్రిల్, రియర్ స్పాయిలర్ అదే విధంగా స్పోర్ట్స్ ఎడిషన్ ఫిగో హ్యాచ్‌బ్యాక్ ప్రక్క మరియు వెనుక వైపుల గ్రాఫిక్స్‌తో కూడా బాడీ డీకాల్స్ ఉన్నాయి.

డ్యూయల్ టోన్ కలర్ స్కీమ్, దీని రూఫ్ టాప్ మరియు అవుట్ సైడ్ రియర్ వ్యూవ్ మిర్రర్లను విభిన్నమైన కలర్ షేడ్‌లలో అందివ్వడం జరుగుతోంది.

ఇంటీరియర్ విషయానికి వస్తే లెథర్ తొడుగు ఉన్న స్టీరింగ్ వీల్, విభిన్నంగా ఉన్న కుట్లు మినహాయిస్తే, గుర్తించదగిన మార్పులు ఇందులో పెద్దగా చోటు చేసుకోలేదు.

టీమ్ బిహెచ్‌పి వెబ్‌సైట్ తెలిపిన వివరాలు మేరకు ఫిగో స్పోర్ట్ లిమిటెడ్ ఎడిషన్‌లో ఎలాంటి నూతన ఇంజన్ ఆప్షన్లు పరిచయం కావటం లేదు. మునుపటి ఫిగో వేరియంట్లలోని ఇంజన్‌లతో రానున్నట్లు సమాచారం.

ఇది మార్కెట్లోకి విడుదలయితే ప్రస్తుతం ఉన్న టైటానియమ్ మరియు టైటానియమ్ ప్లస్ వేరియంట్ల మధ్య నిలవనుంది. అయితే మిగతా ఫిగో వేరియంట్లు యథావిధిగా అమ్మకాలు సాగించనున్నాయి.

ఇండియన్ మార్కెట్లోకి తక్కువ ధరతో ఆరు ఎయిర్ బ్యాగులను అందించి ఫిగో హ్యాచ్‌బ్యాక్‌ను ప్రవేశపెట్టింది. దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం రండి.

ఫిగో హ్యాచ్‌బ్యాక్‌కు ప్రత్యామ్నాయ ఎంపిక కోరుకుంటున్నారా...? అయితే ఈ వేరియంట్ మీ కోసమే, మారుతి ఈ ఏడాది తమ నెక్ట్స్ జనరేషన్ స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్‌ను దేశీయంగా విడుదల చేయనుంది. దీనిని క్షుణ్ణంగా పరిశీలించాలి అనుకుంటే క్రింది ఫోటో గ్యాలరీ మీద ఓ లుక్కేసుకోండి.

 

Read more on: #ఫోర్డ్ #ford
Story first published: Saturday, February 18, 2017, 12:12 [IST]
English summary
Rumour: Ford Might Launch Figo 'Sports' Edition In India
Please Wait while comments are loading...

Latest Photos