ఇండియాలో కార్ల విక్రయాలకు ముగింపు పలికిన షెవర్లే

Written By:

అమెరికాకు చెందిన దిగ్గజ ఆటోమోటివ్ సంస్థ జనరల్ మోటార్స్ దేశీయంగా తమ కార్యకలాపాలకు పూర్తిగా పులిస్టాప్‌ పెడుతూ, ఇక మీద షెవర్లే తమ ప్యాసింజర్ కార్లను విక్రయించదని అధికారికంగా ప్రకటించింది.

దేశీయంగా తయారీ రంగాన్ని ప్రోత్సహించేందుకు మోడీ గారు చేపట్టిన మేకిన్ ఇండియా ప్రోగ్రామ్ కూడా షెవర్లేకు ఉపయోగపడలేకపోయింది. రెండు దశాబ్దాలుగా పోటీమార్కెట్లో ప్రధాన పాత్ర పోషించిన షెవర్లే ఇప్పుడు శాస్వతంగా తమ కార్యకలాపాలకు చెక్ పెట్టింది.

సమాచార వర్గాల కథనం మేరకు, జనరల్ మోటార్స్ ఇండియన్ మార్కెట్లో షెవర్లే బ్రాండ్ పేరు క్రింది విక్రయిస్తున్న ప్యాసింజర్ కార్ల మార్కెట్ వాటా దేశీయ ప్యాసింజర్ కార్ల విక్రయాల్లో ఒక్క శాతానికి కన్నా తక్కువగా ఉంది.

ఆశాజనకంగా లేని ఫలితాలే షెవర్లే ఇండియా నుండి నిష్క్రమించడానికి ప్రధాన కారణం అని భావించవచ్చు. అయితే పూర్తిగా ఇండియా నుండి వైదొలగడం లేదని తెలుస్తోంది.

ఇండియాలో ఉన్న జనరల్ మోటార్స్ తయారీ ప్లాంట్లలో కార్ల ఉత్పత్తి చేసి విదేశీ మార్కెట్లకు ఎగుమతి చేయనుంది మరియు దేశీయంగా ఉన్న షెవర్లే రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ సెంటర్లలో పరిశోధనలు యథావిధిగా కొనసాగనున్నాయి.

జనరల్ మోటార్స్‌కు చెందిన షెవర్లేకు బెంగళూరులో ఓ రీసెర్చ్ సెంటర్, అదే విధంగా గుజరాత్‌లోని హలోల్ సమీపంలో ఓ ప్రొడక్షన్ ప్లాంటు మరియు ముంబాయ్‌కు సమీపంలోని తలెగావ్ ప్రాంతంలో మరో ప్రొడక్షన్ ప్లాంటు కలదు.

హలోల్ ప్రొడక్షన్ ప్లాంటును చైనాకు చెందిన SIAC ఆటోమోటివ్ సంస్థకు విక్రయిస్తోంది. మరియు తలెగావ్ ప్లాంటులో ఉత్పత్తి చేపట్టి విదేశీ మార్కెట్లకు ఎగుమతి కోసం వినియోగించుకోనుంది. ఇక బెంగళూరులోని రీసెర్చ్ సెంటర్‌ను యథావిధిగా కొనసాగించనుంది.

ఒక్క 2015/16 మధ్య కాలంలో తెలగావ్ ప్లాంటు నుండి మెక్సికో మరియు లాటిన్ అమెరికా మార్కెట్లకు 70,969 యూనిట్లు ఎగుమతి అయ్యాయి. గత ఆర్థిక సంవత్సరం నుండి ఈ సంఖ్య రెండింతలు అయ్యింది. మహారాష్ట్రలోని తలెగావ్ ప్లాంటు సామర్థ్యం ఏడాదికి 1,30,000 యూనిట్లుగా ఉంది.

దేశీయ ప్యాసింజర్ కార్ల మార్కెట్లో రాణించాలంటే షెవర్లేకి రెండు దారులున్నాయి. అందులో ఒకటి, అత్యుత్తమ ప్రమాణాలతో మరియు అంతర్జాతీయ ఫ్లాట్‌ఫామ్‌లను ఉపయోగించి కొత్త ఉత్పత్తులను దేశీయ మార్కెట్ కోసం అభివృద్ది చేయాల్సి ఉంది.

రెండవ మార్గం, దేశీయ ఆటోమోటివ్ సంస్థతో చేతులు కలపడం. తద్వారా దేశవ్యాప్తంగా కార్యకలాపాలను విస్తరించడం, తక్కవ ధరతో విడి పరికరాల ఉత్పత్తి మరియు సప్లై సరిగ్గా ఉంటుంది. తద్వారా మార్కెట్లో రాణించే అవకాశం ఉంది.

Story first published: Thursday, May 18, 2017, 18:00 [IST]
English summary
Read In Telugu Chevrolet To Stop Selling Cars In India
Please Wait while comments are loading...

Latest Photos