GST ఎఫెక్ట్: భారీగా పెరగనున్న ట్రాక్టర్ ధరలు

నూతన ట్యాక్స్ విధానం వస్తు సేవల పన్ను(GST) ప్రకారం లగ్జరీ కార్ల ధరలు తగ్గుముఖం పడుతుండగా, రైతులకు ఉపయోగపడే ట్రాక్టర్ల ధరలు మాత్రం భారీగా పెరగనున్నాయి.

By Anil

చిన్న చిన్న బైకులు మరియు కార్ల నుండి కోట్ల రుపాయలు విలువైన కార్లు అన్నింటి మీద 28 శాతం ట్యాక్స్ మాత్రమే నిర్ణయించారు. కానీ రైతులకు ఎంతగానో ఉపయోగపడే ట్రాక్టర్లు మరియు వ్యవసాయ పనిముట్ల మీద అధిక ట్యాక్స్‌ నిర్ణయించారు. నూతన జిఎస్‌టి అమల్లోకి వస్తే, ప్రస్తుతం ఉన్న ట్రాక్టర్ల ధరలు భారీగా పెరగనున్నాయి.

భారీగా పెరగనున్న ట్రాక్టర్ ధరలు

నూతన ట్యాక్స్ విధానం వస్తు సేవల పన్ను(GST) ప్రకారం లగ్జరీ కార్ల ధరలు తగ్గుముఖం పడుతుండగా, రైతులకు ఉపయోగపడే ట్రాక్టర్ల ధరలు మాత్రం భారీగా పెరగనున్నాయి.

భారీగా పెరగనున్న ట్రాక్టర్ ధరలు

జిఎస్‌టి అమల్లోకి వస్తే, ప్రస్తుతం ఉన్న ట్రాక్టర్ ధరలు రూ. 25,000 ల వరకు పెరగనున్నాయి. నిజానికి ట్రాక్టర్ల తయారీ అయ్యే మొత్తాన్ని, వాటిని విక్రయించే మొత్తంతో పోల్చుకుంటే భారీ తేడా ఉంది.

భారీగా పెరగనున్న ట్రాక్టర్ ధరలు

ఇంజన్ మరియు విడి పరికరాల సమూహమే ట్రాక్టర్‌ కాబట్టి ట్రాన్స్‌మిషన్, ఇంజన్ ల మీద ట్యాక్స్ 12 శాతంగా ఉంది. కానీ ట్రాక్టర్‌లోని ఇతర విడి పరికరాల మీద 28 శాతం ట్యాక్స్ నిర్ణయించడం జరిగింది. ట్రాక్టర్ మొత్తం ట్యాక్స్ లెక్కిస్తే 28 శాతం కంటే ఎక్కువ అవుతుంది. తయారీ సంస్థలు ఈ భారాన్ని కొనుగోలుదారుల మీద మోపనున్నారు.

భారీగా పెరగనున్న ట్రాక్టర్ ధరలు

ట్రాక్టర్ విడిపరికరాల మీద ఉన్న 28 శాతం ట్యాక్స్‌ను 18 శాతానికి తగ్గించాలని ట్రాక్టర్స్ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ (TMA) కేంద్రాన్ని కోరింది. దీనిని కేంద్ర అంగీకరిస్తే ట్రాక్టర్ ధరలు తగ్గే అవకాశం ఉంది.

భారీగా పెరగనున్న ట్రాక్టర్ ధరలు

దేశీయ ట్రాక్టర్ల తయారీ దిగ్గజ టాఫే(ట్రాక్టర్స్ అండ్ ఫార్మ్ ఎక్విప్‌మెంట్ లిమిటెడ్) ఛైర్మెన్ మరియు ముఖ్య కార్య నిర్వహణాధికారి శ్రీమతి మల్లికా శ్రీనివాసన్ మాట్లాడుతూ, "ట్రాక్టర్స్ మరియు విడి పరికరాల మీద వేరు వేరు ట్యాక్స్ నిర్ణయించడంతో ట్రాక్టర్ ధరలు రూ. 25,000 ల వరకు పెరిగే అవకాశం ఉందని తెలిపారు".

భారీగా పెరగనున్న ట్రాక్టర్ ధరలు

కేంద్ర ప్రభుత్వం జిఎస్‌టి ద్వారా దేశీయ వాహన పరిశ్రమలోని అన్ని ఉత్పత్తుల మీద సాధారణ పన్నును నిర్ణయించింది. దీంతో పర్యావరణ అనుకూలమైన(హైబ్రిడ్) వాహనాల మీద ట్యాక్స్ పెరగడం మరియు పర్యావరణానికి హానికారకమైన వాహనాల(పెట్రోల్ మరియు డీజల్) మీద ట్యాక్స్ తగ్గడం జరిగింది. ప్రత్యేకించి రైతులకు ఉపయోగపడే ట్రాక్టర్ల ధరలు కూడా పెరగనున్నాయి.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

జిఎస్‌టిని అమల్లోకి తీసుకురావడానికి మునుపే పన్ను హైబ్రిడ్, పెట్రోల్, డీజల్, లగ్జరీ కార్లు, ట్రాక్టర్లు మరియు వ్యవసాయ పనిముట్ల మీద కేటాయించిన ట్యాక్స్‌లో సవరణలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Most Read Articles

English summary
Read In Telugu GST Effect: Tractors To Become Pricier
Story first published: Thursday, June 15, 2017, 17:46 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X