హోండా కార్ కొనే ఆలోచనలో ఉన్నారా ? త్వరగా కొనేయండి లేదంటే నష్టపోతారు

హోండా మోటార్స్ దేశీయంగా ఉన్న లైనప్‌లోని అన్ని వాహనాల మీద ధరలను పెంచనుంది.

By Anil

హోండా మోటార్స్‌కు చెందిన ఏదేని కారును కొనుగోలు చేసే ఆలోచనలో ఉన్నారా ? అయితే త్వరలో కొనేయండి లేదంటే తరువాత నష్టపోయామని భాదపడతారు. ఎందుకంటే తమ లైనప్‌లో ఉన్న కార్ల ధరలను సుమారుగా పదివేల వరకు పెంచనున్నట్లు విశ్వసనీయ సమాచారం.

పెరిగిన హోండా కార్ల ధరలు

అన్ని మోడళ్ల మీద సుమారుగా రూ. 10,000 ల వరకు ధరల పెంపు చేపట్టనుంది. ధరల సవరణ ఖచ్చితంగా జరిగితే నూతన ధరలు ఏప్రిల్ మొదటి వారం నుండే అమల్లోకి రానున్నాయి.

పెరిగిన హోండా కార్ల ధరలు

అయితే హోండా మోటార్స్ తాజాగ ఇండియన్ మార్కెట్లోకి విడుదల చేసిన హోండా డబ్ల్యూఆర్-వి క్రాసోవర్ మీద ఎలాంటి పెంపు ఉండదని తెలిసింది. కాబట్టి ప్రస్తుతం అందుబాటులో ఉన్న ధరతో దీనిని ఎంచుకోవచ్చు. డబ్ల్యూఆర్-వి గురించి మరిన్ని వివరాలు...

పెరిగిన హోండా కార్ల ధరలు

ధరల పెంపుకు గల కారణాలను వెల్లడిస్తూ, ముడిసరుకు మరియు ఉత్పాదక వ్యయం పెరిగిన నేపథ్యంలో తమ ఉత్పత్తుల ధరల పెంపు తప్పడం లేదని పేర్కొంది. 2017 ఏడాదిలో హోండా మోటార్స్ రెండవ సారి ధరలు పెంపును చేపట్టింది. చివరి ధరల సవరణ ఏడాది ప్రారంభంలో జరిగింది.

పెరిగిన హోండా కార్ల ధరలు

హోండా మోటార్స్ మార్కెటింగ్ మరియు సేల్స్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ జ్ఞానేశ్వర్ సేన్ ఈ అంశం మీద స్పందిస్తూ, కార్ల ఉత్పత్తిలో కీలకమైన ముడి సరుకు కొనుగోలు మరియు ఉత్పాదక వ్యయం పెరిగిన నేపథ్యంలో ధరల పెంపు తప్పనిసరైందని వివరించాడు.

పెరిగిన హోండా కార్ల ధరలు

2017 ఏప్రిల్ మొదటి వారం నుండి డబ్ల్యూఆర్-వి క్రాసోవర్ ఎస్‌యూవీ మినహా అన్ని కార్ల కొత్త ధరలు అమల్లోకి రానున్నట్లు జ్ఞానేశ్వర్ వెల్లడించారు.

పెరిగిన హోండా కార్ల ధరలు

2017 ప్రారంభంలో హోండా మోటార్స్‌తో దేశీయంగా ఉన్న దిగ్గజ ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థలన్నీ తమ ఉత్పత్తుల మీద ధరల పెంపును చేపట్టాయి. అప్పట్లో హోండా మోటార్స్ 3 శాతం మేర ధరలను పెంచింది.

పెరిగిన హోండా కార్ల ధరలు

హోండా మోటార్స్ ఇండియాలో అందుబాటులో ఉంచిన అన్ని కార్ల ఆన్ రోడ్ మరియు ఎక్స్-షోరూమ్ ధరలు, ఇంజన్, మైలేజ్, ఫీచర్లు, పోటీదారులు గురించి పూర్తి వివరాలు తెలుగులో తెలుసుకోండి.....

Most Read Articles

English summary
Honda To Hike Car Prices By Up To Rs 10,000 — Buy Yours Now
Story first published: Wednesday, March 22, 2017, 13:05 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X