బ్లాక్ ఎడిషన్ ఆర్-టైప్ హోండా సివిక్ విడుదల

Written By:

హోండా మోటార్స్ ప్రస్తుతం అందుబాటులో ఉంచిన ప్రస్తుత తరం యొక్క హ్యాచ్ సివిక్ ఆర్-టైప్ మోడల్ ప్రొడక్షన్‌ను త్వరలో నిలిపివేయనుంది. అయితే ఈ వేరియంట్‌ను చివరిగా కేవలం 100 యూనిట్లను బ్లాక్ ఎడిషన్ పేరుతో ఉత్పత్తి చేయనుంది. హోండా లోని ఆర్ టైప్ జిటి ప్రేరణతో రూపొందించిన ఇది అత్యంత శక్తివంతమైనది.

జపాన్‌కు చెందిన దిగ్గజ కార్ల తయారీ సంస్థ హోండా మోటార్స్ ఈ లిమిటెడ్ బ్లాక్ ఎడిషన్ ఆర్-టైప్ సివిక్ కార్ల 100 యూనిట్లను ఇంగ్లాండులోని స్విండన్ ప్లాంటులో ఉత్పత్తి చేయనుంది. ఈ 100 కార్ల ఉత్పత్తి అనంతరం సివిక్ ఎక్స్ ఆధారిత న్యూ జనరేషన్ టైప్ ఆర్ కార్ల తయారీకి ప్లాంటును రూపొందించనుంది.

ప్రస్తుతం చివరిగా హోండా అందుబాటులోకి తీసుకున్న బ్లాక్ ఎడిషన్ సివిక్ ఆర్ టైప్ కారులో 2.0-లీటర్ సామర్థ్యం గల విటిఇసి డైరెక్ట్ ఇంజెక్టెడ్ టుర్బో ఛార్జ్‌డ్ నాలుగు సిలిండర్ల పెట్రోల్ ఇంజన్ కలదు. ఇది సుమారుగా 306బిహెచ్‌పి పవర్ మరియు 400ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేయును.

హోండా దీనికి ప్రత్యేకంగా అందించిన పేరు బ్లాక్ ఎడిషన్ కు తగ్గట్లుగానే ఇంటీరియర్ మరియు ఎక్ట్సీరియర్ పూర్తిగా బ్లాక్ రంగును పులుముకుంది. మోటోస్పోర్ట్స్‌ను తలపించే రీతిలో అంతర్గతంగా మరియు బాహ్యభాగాలలో ఆకర్షణీయంగా ఎరుపు రంగు సొబగులద్దారు.

ఈ ఎడిషన్ అనంతరం హోండా నెక్ట్స్ జనరేషన్ సివిక్ కార్లను ఉత్పత్తి చేయనుంది, వీటిని మార్చి 2017 నుండి ప్రపంచ వ్యాప్తంగా అందుబాటులోకి తీసుకురానుంది. అత్యుత్తమ పనితీరును కనబరిచే ఆర్ టైప్ తరహా వేరియంట్‌ను నెక్ట్స్ జనరేషన్ సివిక్ లో పరిచయం చేసి సెప్టెంబర్ 2017 నాటికి అమ్మకాలకు సిద్దం చేయనుంది.

హోండా ఇంగ్లాండ్ విభాగాధిపతి, ఫిల్ వెబ్ మాట్లాడుతూ, హోండా మోటార్స్ త్వరలో ఆర్ టైప్ బ్లాక్ ఎడిషన్ను అందుబాటులోకి తీసుకురానుంది, అయితే ఇందులో ఓ ప్రత్యేకత ఉంది. ఏమిటంటే ప్రపంచ వ్యాప్తంగా కేవలం 100 యూనిట్లను మాత్రమే లిమిటెడ్ ఎడిషన్‌గా విడుదల చేస్తున్నట్లు తెలిపాడు. అరుదైన కార్లను సేకరించే వారు ఆ అవకాశాన్ని వదులుకోరని తెలిపాడు.

హోండా పరిచయం చేయనున్న 10 వ తరానికి చెందిన హోండా సివిక్ 2017 జెనీవా మోటార్ షో వేదిక మీద ప్రదర్శనకు రానుంది. ఈ షో మార్చిలో ప్రారంభం కానుంది.

బుకింగ్స్ లో సునామీ రేపుతున్న బజాజ్ డామినర్ 400
బజాజ్ ఆటో గత ఏడాది డిసెంబర్‌లో ఇండియన్ మార్కెట్లోకి విడుదల చేసిన డామినర్ 400 క్రూయిజర్ బైకు భారీ బుకింగ్స్ దిశగా దూసుకుపోతోంది.

ఈ సురక్షితమైన విమానాల గురించి తెలుసుకుంటే, చావుతో భయపడాల్సిన పనిలేదు
కార్ల విషయానికి వస్తే భద్రత పరంగా ఏది బెస్ట్ ఏది వేస్ట్ అని ఇట్టే చెప్పేయగలం. మరి విమానాలకయితే ఎలా...? ఒక్కసారి టేకాఫ్ తీసుకున్న తరువాత అన్ని అంశాలు కలిసొస్తేనే సురక్షితంగా ల్యాండ్ అవ్వగలం.

మహీంద్రా అండ్ మహీంద్రా టయోటా ఫార్చ్యూనర్ ప్రీమియమ్ ఎస్‌యువికి పోటీగా ఖరీదైన ఎస్‌యువిని విడుదలకు సిద్దం చేస్తోంది. దాని తాలుూకు ఫోటోలు....

Click to compare, buy, and renew Car Insurance online

Buy InsuranceBuy Now

English summary
Honda Civic Type R Black Edition Launched
Please Wait while comments are loading...

Latest Photos