విడుదలకు సిద్దమైన హోండా ఫేస్‌లిఫ్ట్ జాజ్

Written By:

అంతర్జాతీయ మార్కెట్లోకి జూన్ 2017లో విడుదల చేయనున్న తరుణంలో హోండా మోటార్స్ తమ జాజ్ ఫేస్‌లిఫ్ట్‌ను జపాన్‌లో ఆవిష్కరించింది. ప్రపంచ మార్కెట్‌ను దృష్టిలో ఉంచుకుని డిజైన్‌లో మార్పులు చేర్పులు నిర్వహించి, మరిన్ని భద్రత ఫీచర్లను జోడించింది.

హోండా జాజ్ ఫేస్‌లిఫ్ట్‌లోని ఫ్రంట్ డిజైన్‌లో 2017 హోండా సిటి సెడాన్ డిజైన్ పోలికలు ఎక్కువగానే ఉన్నాయి. దాదాపు అదే ఆకృతిలో ఉన్న హెడ్ ల్యాంప్స్, ప్రంట్ గ్రిల్, బంపర్ మరియు రెండు ఎల్ఇడి లైట్లను కలుపుతూ మధ్యలో మందమైన గ్లాస్ ప్లేట్ కలదు.

మునుపటి మోడల్ జాజ్‌తో పోల్చుకుంటే ఇందులో ముందు వైపు ఉన్న ఎయిర్ ఇంటేకర్ మరియు ఫాగ్ ల్యాంప్ అమరికను మరింత అందంగా చెక్కినట్లు స్పష్టమవుతుంది. అంతే కాకుండా నూతన డిజైన్‌లో ఉన్న అల్లాయ్ వీల్స్ కూడా సరికొత్త జాజ్‌లో గమనించవచ్చు.

మునుపటి మోడల్ జాజ్‌తో పోల్చుకుంటే ఇందులో ముందు వైపు ఉన్న ఎయిర్ ఇంటేకర్ మరియు ఫాగ్ ల్యాంప్ అమరికను మరింత అందంగా చెక్కినట్లు స్పష్టమవుతుంది. అంతే కాకుండా నూతన డిజైన్‌లో ఉన్న అల్లాయ్ వీల్స్ కూడా సరికొత్త జాజ్‌లో గమనించవచ్చు.

ఇంటీరియర్ విషయానికి వస్తే, డ్యాష్ బోర్డ్ మరియు డ్యూయల్ టోన్ అప్‌హోల్‌స్ట్రేలో అచ్చం అవుట్ గోయింగ్ మోడల్‌నే పోలి ఉన్నాయి. జాజ్ ఫేస్‌లిఫ్ట్ ఇంటీరియర్‌లో పెద్దగా గుర్తించదగిన మార్పులేవీ సంభవించలేదు.

అయితే భద్రత పరమైన ఫీచర్లను అందివ్వడం మీద హోండా దృష్టి సారించిందని స్పష్టం అవుతోంది. ఇందులో, పాదచారుల ప్రమాదాన్ని నివారించే ఫీచర్, ప్రమాదంలో బ్రేక్ అప్లే చేసే ఫీచర్, ట్రాఫిక్ గుర్తులను గుర్తించే వ్యవస్థ, వంటివి ఉన్నాయి.

అదే విధంగా ఇందులో ఆడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్ మరియు లేన్ కీప్ అసిస్టెన్స్ ఫంక్షన్లను కూడా అందించింది. దేశీయంగా విడుదల కానున్న జాజ్ ఫేస్‌లిఫ్ట్‌లో ఈ సేఫ్టీ ఫీచర్లు వస్తాయని తెలిపే సమాచారం లేదు.

ప్రస్తుతం జపాన్ మార్కెట్లో ఆవిష్కరించిన జాజ్ ఫేస్‌లిఫ్ట్ 1.3-లీటర్ మరియు 1.5-లీటర్ సామర్థ్యం ఉన్న నాలుగు సిలిండర్ల పెట్రోల్ అదే విధంగా హైబ్రిడ్ డ్రైవ్‌ట్రైన్ ఇంజన్ వేరియంట్లలో కూడా అందుబాటులో ఉంది.

ప్రస్తుతం ఇండియన్ మార్కెట్లో ఉన్న జాజ్ రెండేళ్లు పూర్తి చేసుకుంది. అయితే దీనికి కొనసాగింపుగా ఫేస్‌లిఫ్ట్ జాజ్ రావడానికి మరింత సమయం పట్టనుంది.

జాజ్ ఫేస్‌లిఫ్ట్‌ ఇండియన్ మార్కెట్లోకి వస్తే, 2017 సిటి సెడాన్ తరహాలో నూతన డిజైన్, ఇంటీరియర్ మరియు సేఫ్టీ ఫీచర్లతో పాటు అప్‌డేటెడ్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌తో వచ్చే అవకాశం ఉంది.

సాంకేతికంగా ఇండియన్ మోడల్ జాజ్ ఫేస్‌లిఫ్ట్ ప్రస్తుతం ఉన్న అవే 1.5-లీటర్ డీజల్ మరియు 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్ వేరియంట్లను కొనసాగించనుంది.

Click to compare, buy, and renew Car Insurance online

Buy InsuranceBuy Now

English summary
Read In Telugu Honda Jazz Facelift Revealed Ahead Of Launch
Please Wait while comments are loading...

Latest Photos