డబ్ల్యూఆర్-వి మైక్రో సైట్ ప్రారంభించిన హోండా మోటార్స్

Written By:

హోండా మోటార్స్ విడుదలకు సిద్దం చేసిన డబ్ల్యూఆర్-వి క్రాసోవర్ కోసం ప్రత్యేకంగా మైక్రో సైట్ ప్రారంభించింది.(మైక్రోసైట్ - ప్రత్యేకించి డబ్ల్యూ-ఆర్ కోసం మాత్రమే, దీని విడుదల సమాచారం, అమ్మకాలు బుకింగ్స్ రిజిస్ట్రేషన్ వంటి వాటి కోసం). చాలా వరకు ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థలు త్వరలో తమ ఉత్పత్తుల విడుదల ఉన్న నేపథ్యంలో ఇలా వాటి పేరు ప్రత్యేక మైక్రో సైట్ ప్రారంభిస్తున్నాయి.

హోండా డబ్ల్యూఆర్-వి గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం రండి...

జపాన్ దిగ్గజ ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ హోండా మోటార్స్ తమ డబ్ల్యూఆర్-వి క్రాసోవర్‌ను మార్చి 16, 2017 ఇండియన్ మార్కెట్లోకి విడుదల చేయడానికి సిద్దమైంది, ఆసక్తిగలవారు హోండా డబ్ల్యూఆర్-వి పేరుతో మైక్రోసైట్ మీద తమను సంప్రదించవలసిన వివరాలను నమోదు చేయవచ్చు.

హోండా యొక్క జాజ్ ప్రీయమిమ్ హ్యాచ్‌బ్యాక్ ఆధారంగా డబ్ల్యూఆర్-వి ని అభివృద్ది చేసినప్పటికీ హ్యాచ్‌బ్యాక్‌ కంటే చాలా భిన్నంగా ఉండేలా క్రాసోవర్ శైలిలో తీర్చిదిద్దింది.

సరికొత్త డబ్ల్యూఆర్-వి ఫ్రంట్ డిజైన్ గమనిస్తే, ఆధునిక ఫ్రంట్ గ్రిల్, ఆకర్షణీయమైన ఎయిర్ ఇంటేకర్, బాడీకి క్రిందుగా బంపర్, రీ డిజైన్ చేయబడిన పగటి పూట వెలిగే ఎల్ఇడి లైట్ల జోడింపతో ఉన్న హెడ్ ల్యాంప్స్ ఇందులో ఉన్నాయి.

ప్రస్తుతం జాజ్ ప్రీమియమ్ హ్యాచ్‌బ్యాక్‌లో ఉన్నటువంటి అవే 1.2-లీటర్ సామర్థ్యం ఉన్న పెట్రోల్ మరియు 1.5-లీటర్ సామర్థ్యం డీజల్ ఇంజన్ ఆప్షన్ల నుండి డబ్ల్యూఆర్-వి లోని చక్రాలకు వవర్ అందుతుంది.

పెట్రోల్ వేరియంట్లో 5-స్పీడ్ మ్యాన్యువల్ మరియు డీజల్ వేరియంట్లో 6-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ గల గేర్‌బాక్స్ అనుసంధానం రానుంది. అయితే రెండు ఇంధన ఆప్షన్లలోని ఏ వేరియంట్లో కూడా ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ రావడం లేదు.

డబ్ల్యూఆర్-వి క్రాసోవర్ సుమారుగా రూ. 6.8 లక్షల నుండి రూ. 10 లక్షల ఎక్స్-షోరూమ్ ప్రారంభ ధరతో విడుదలయ్యే అవకాశం ఉంది.

హోండా మోటార్స్ ఈ క్రాసోవర్‌ను పూర్తి స్థాయిలో అమ్మకాలకు సిద్దం చేస్తే, ప్రస్తుతం విపణిలో ఉన్న మారుతి సుజుకి వితారా బ్రిజా, ఫోర్డ్ ఎకో స్పోర్ట్, హ్యుందాయ్ ఐ20, టయోటా ఎటియోస్ క్రాస్, వోక్స్‌వ్యాగన్ క్రాస్ పోలో మరియు ఫియట్ అవెంచురా వంటి వాటికి గట్టి పోటీనివ్వనుంది. దీని విడుదల ఇటు కాంపాక్ట్ ఎస్‌యూవీ అటు క్రాసోవర్ శ్రేణిలో అలజడినే సృష్టించనుంది.

హోండా మోటార్స్ ఈ ఏడాది తమ 2017 సిటి ప్రీమియమ్ సెడాన్ కారును మార్కెట్లోకి విడుదల చేసింది. 2017 సిటి సెడాన్ ఫోటోల కోసం క్రింది గ్యాలరీ మీద క్లిక్ చేయండి...

 

Click to compare, buy, and renew Car Insurance online

Buy InsuranceBuy Now

English summary
Honda WR-V Microsite Goes Live Ahead Of India Launch
Please Wait while comments are loading...

Latest Photos