హోండా డబ్ల్యూఆర్-వి కు లభిస్తున్న అనూహ్యమైన ఆదరణ

హోండా మోటార్స్ మార్చి 2017న ఇండియన్ మార్కెట్లోకి విడుదల చేసిన డబ్ల్యూఆర్-వి మీద విపరీతమైన బుకింగ్స్ నమోదవుతున్నాయి. ఇప్పటి వరకు 18,000 లకు పైగా బుకింగ్స్ నమోదయ్యాయి.

By Anil

ఇండియన్ మార్కెట్లో బెస్ట్ సెల్లింగ్ కాంపాక్ట్ ఎస్‌యూవీగా ఉన్న మారుతి సుజుకి వితారా బ్రిజా కు గట్టి పోటీనిస్తూ హోండా మోటార్స్ డబ్ల్యూఆర్-వి క్రాసోవర్ ఎస్‌యూవీని విపణిలోకి తెచ్చింది. అయితే హోండా ఊహించిన విధంగానే దీనికి మంచి ఆదరణ లభిస్తోంది.

హోండా డబ్ల్యూఆర్-వి బుకింగ్స్

జపాన్ దిగ్గజ హోండా దేశీయంగా 9,919 యూనిట్ల డబ్ల్యూఆర్-వి ఎస్‌యూవీలను విక్రయించేసింది, అయితే ఈ జూన్ లో10,000 యూనిట్ల మైలు రాయిని దాటే అవకాశం ఉంది. హోండా రీసెర్చ్ అండ్ డెవలప్‌‌మెంట్ బృందం ఇండియాలో అభివృద్ది చేసి, తొలి విడుదల మరియు ప్రొడక్షన్ కూడా దేశీయంగానే చేపట్టింది.

హోండా డబ్ల్యూఆర్-వి బుకింగ్స్

కాంపాక్ట్ క్రాసోవర్ ఎస్‍‌‌యూవీ సెగ్మెంట్లోకి వచ్చిన హోండా డబ్ల్యూఆర్-వి నిజానికి వితారా బ్రిజాకు మాత్రమే కాకుండా ఫోర్డ్ ఎకో స్పోర్ట్ కు గట్టి పోటీనిస్తోంది. డబ్ల్యూఆర్-వి పెట్రోల్ మరియు డీజల్ ఇంధన వేరియంట్లో అందుబాటులో ఉంది.

హోండా డబ్ల్యూఆర్-వి బుకింగ్స్

సాంకేతికంగా హోండా డబ్ల్యూఆర్-వి లోని 1.2-లీటర్ ఐ-విటిఇసి పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 89బిహెచ్‌పి పవర్ మరియు 110ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేయును. అదే విధంగా ఇందులో ఉన్న 1.5-లీటర్ ఐ-డిటిఇసి డీజల్ ఇంజన్ గరిష్టంగా 99బిహెచ్‌పి పవర్ మరియు 200ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేయును.

ట్రాన్స్‌మిషన్ మరియు మైలేజ్

ట్రాన్స్‌మిషన్ మరియు మైలేజ్

5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ అనుసంధానంతో ఉన్న పెట్రోల్ ఇంజన్ లీటర్‌కు 17.5కిలోమీటర్ల మైలేజ్ ఇవ్వగలదు మరియు 6-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ గేర్‌బాక్స్ అనుసంధానం ఉన్న డీజల్ వేరియంట్ లీటర్‌కు 25.5కిలోమీటర్ల మైలేజ్ ఇవ్వగలదు.

హోండా డబ్ల్యూఆర్-వి లోని ఫీచర్లు

హోండా డబ్ల్యూఆర్-వి లోని ఫీచర్లు

డబ్ల్యూఆర్-వి ఇంటీరియర్‌లో వై-ఫై మరియు ఇంటర్నెట్ సపోర్ట్ గల 7-అంగుళాల పరిమాణం ఉన్న తాకే తెర గల ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, క్రూయిజ్ కంట్రోల్, ఇంజన్ స్టార్ట్ మరియు స్టాప్, మల్టీ ఫంక్షన్ స్టీరింగ్ వీల్, మరియు ఈ సెగ్మెంట్లో తొలి ఫీచర్ ఎలక్ట్రిక్ సన్ రూఫ్ ఇందులో కలదు.

భద్రత ఫీచర్లు

భద్రత ఫీచర్లు

హోండా మోటార్స్ డబ్ల్యూఆర్-విలో భద్రత పరంగా యాంటిలాక్ బ్రేకింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ మరియు ముందు వైపున డ్యూయల్ ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి.

హోండా డబ్ల్యూఆర్-వి బుకింగ్స్

ప్రస్తుతం డబ్ల్యూఆర్-వి మీద మంచి రెస్పాన్స్ లభిస్తుండటంతో హోండా ఇండియా లైనప్‌లో ఇది మంచి ఫలితాలనిచ్చే అవకాశం ఉంది. అయితే ఇదే తరహా విక్రయాలు రానున్న కాలంలో కూడా కొనసాగుతాయా లేదా అనేదాని వేచి చూడాలి మరి.

Most Read Articles

English summary
Read In Telugu To More About Honda WR-V Receives Tremendous Booking Response Since Launch.
Story first published: Friday, June 9, 2017, 10:09 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X