చివరికి హ్యుందాయ్ క్రెటాను కూడా వదల్లేదు

ఇండియన్ వెహికల్ మోడిఫికేషన్ మార్కెట్లో దిగ్గజ సంస్థగా రాణిస్తున్న డిసి డిజైన్స్ తమ పనితనాన్ని మరో మారు నిరూపించుకుంది. క్రెటా యొక్క ఇంటీరియర్ మరియు ఎక్ట్సీరియర్‌ను నమ్మశక్యంగాని రీతిలో మోడిఫై చేసింది.

Written By:

ఏ వానహనాన్నైనా మనకు నచ్చిన రీతిలో, మిగతా వాహనాల కన్నా విభిన్నంగా కనబడేందుకు ఎక్ట్సీరియర్ పెయింట్ జాబ్, బాడీ కిట్ లతో పాటు ఇంటీరియర్ డిజైన్‌ను కూడా మోడిఫై చేయగల సంస్థగా ఇండియన్స్‌కు బాగా సుపరిచితం డిసి డిజైన్స్. ఎలాంటి వాహనాన్ని అయినా అద్బుతంగా మోడిఫై చేయడంలో ప్రసిద్దిగాంచిన డిసి ఇప్పుడు హ్యుందాయ్ పాపులర్ కాంపాక్ట్ ఎస్‌యూవీ క్రెటాను నూతన శైలిలో ఆవిష్కరించింది.

మోడిఫికేషన్‌లో ప్రధానంగా గుర్తించే అంశం ఫ్రంట్ డిజైన్. ఫ్రంట్ డిజైన్‌ మీద దృష్టిపెట్టిన డిసి డిజైన్స్ మునుపటి పదునైన రూపాన్ని కలిగిన క్రెటాను కండలు తిరిగిన ఫ్రంట్ డిజైన్‌లోకి మార్చేసింది. ఇందులో ప్రధానంగా ఎరుపు రంగులో ఉన్న ఎయిర్ వెంట్ నెంబర్ ప్లేట్ కోసం నల్లటి స్ట్రిప్‌ను జోడించింది.

తెలుపు రంగులో ఎరుపు యొక్క సమ్మేళనం కంటికి ఇంపుగా కనిపిస్తుంది. దీని పసిగట్టిన డిసి క్రెటా ప్రక్కవైపుల కూడా ఎర్రటి రంగులో ఉన్న ప్లాస్టిక్ స్కర్ట్స్‌ను అందివ్వడం జరిగింది. రెడ్ స్కర్ట్స్‌కు వ్యతిరేకంగా నలుపు రంగులో వీల్ ఆర్చెస్ మరియు వీల్ స్కర్ట్స్‌ను అందివ్వడం జరిగింది.

మీరు ఎరుపు రంగు ప్రేమికులయితే, ఇది మీ కోసమే. డిసి ఈ మోడిఫైడ్ క్రెటా ఇంటీరియర్‌ను పూర్తిగా ఎరుపు రంగులో తీర్చిదిద్దింది. రెడ్ కలర్ లెథర్ సీట్లు, డోర్లకు లోపలివైపున మరియు స్టీరింగ్ వీల్ తొడుగును కూడా ఎరుపు రంగుల్లో అందివ్వడం జరిగింది. డ్యాష్ బోర్డులో వుడెన్ ఎలిమెంట్స్ మరింత ఆకర్షణీయంగా ఉన్నాయి.

 

ఎరుపు రంగులో మాత్రమే కాదు, మీకు నచ్చిన రంగులో మీ వాహనాన్ని మోడిఫై చేయడానికి డిసి డిజైన్స్ ఎల్లప్పుడూ సిద్దమే అని తెలిపింది.

డిసి డిజైన్స్ క్రెటా ఇంటీరియర్‌ను మరో శైలిలో కూడా మోడిఫై చేసింది. ఫీచర్లకు పెద్ద పీట వేస్తున్న చేసిన మోడిఫికేషన్ ఈ ఇంటీరియర్‌లో గమనింవచ్చు.

వినోదం కోసం పెద్ద పరిమాణంలో ఉన్న టెలివిజన్(టీవీ) తెర, బెడ్ తరహాలో సీటును ఇందులో అందివ్వడం జరిగింది.

లిమోసిన్ శైలిలో విలాసానికి ప్రధాన్యతనిస్తూ సౌకర్యవంతైన రియర్ సీటింగ్ అచ్చం విమానంలోని సీటింగ్ వ్యవస్థను తలపిస్తోంది.

డ్యాష్ బోర్డ్‌లో ఉండే అనేక కంట్రోల్స్‌ను సెంటర్ కన్సోల్ వద్ద పొడవుగా ఉన్న బాక్స్ ఆకారంలో అందివ్వడం జరిగింది, సాధారణంగా ఇలాంటి ఆకృతిని అత్యంత విలాసవంతమైన లగ్జరీ కార్లలో గమనిస్తుంటాం. లగ్జరీ కార్ల ఇంటీరియర్‌కు ఏ మాత్రం తీసిపోకుండా ఇలా తీర్చిదిద్దింది.

పూర్తి స్థాయిలో లెథర్ చేసిన ఇంటీరియర్. సీట్లు, డోర్లకు లోపలి వైపున, రూఫ్ టాప్‌కు క్రింది వైపున కూడా లెథర్ ఫినిషింగ్ గుర్తించగలరు.

చిన్న స్థాయి ఫ్రిజ్. నీరు లేదా పానీయాలను స్టోర్ చేయాలన్నా, శీతలంగా ఉంచాలన్నా ఓ చిన్న పాటి ఫ్రిజ్ ఉండాల్సిందే. అందు కోసం డిలి డిజైన్స్ స్మాల్ ఫ్రిజ్‌కు మోడిఫైడ్ క్రెటా ఇంటీరియర్‌లో స్థానం కల్పించింది.

మీ టియువి300 ని కోటి రుపాయల విలువైన గ్రాండ్ చిరోకీ తరహాలో మోడిఫై చేయాలా...?
సుమారుగా 80 లక్షలు విలువైన జీపు వాహనాన్ని పోలి ఉండేవిధంగా కేవలం రూ. 1.50 లక్షలతో టియువి300 ను మోడిఫై చేసారు. పూర్తి వివరాలు....

 

మారుతి నుండి లిమిటెడ్ ఎడిషన్ మోడిఫైడ్ వితారా బ్రిజా
మారుతి సుజుకి అధీకృత డీలర్ కళ్యాణి మోటార్స్ హైదరాబాద్ మరియు బెంగళూరులో లిమిటెడ్ ఎడిషన్‌గా మోడిఫైడ్ వితారా బ్రిజా కాంపాక్ట్ ఎస్‌యువిని అందుబాటులో ఉంచింది. మీకు ఇలాంటిది కావాలంటే ఈ కథనాన్ని పూర్తిగా చూడండి...

ఆరు లక్షలకే బెంజ్ కార్: ఇదెలా సాధ్యం?
ఒక రూపంలో ఉన్న కారును మరో రూపంలోకి మార్చాలంటే తగిన నైపుణ్యం ఖచ్చితంగా అవసరం. లేదంటే ఇదిగో ఈ మోడఫైడ్ మారుతి బాలెనొ తరహాలో ఉంటుంది.

 

Click to compare, buy, and renew Car Insurance online

Buy InsuranceBuy Now

English summary
Hyundai Creta customized by DC Design
Please Wait while comments are loading...

Latest Photos