2017 మోడల్ క్రెటా విడుదల చేసిన హ్యుందాయ్: ధర, ఇంజన్, ఫీచర్లు మరియు ఇతర వివరాలు

Written By:

దక్షిణ కొరియా ప్యాసింజర్ కార్ల తయారీ దిగ్గజం హ్యుందాయ్ మోటార్స్ తమ 2017 ఎలైట్ ఐ20 ను విడుదల చేసిన అనంతరం, తమ బెస్ట్ సెల్లింగ్ కాంపాక్ట్ ఎస్‌యూవీ క్రెటాను 2017 మోడల్‌గా అప్‌డేట్స్ నిర్వహించి విపణిలోకి లాంచ్ చేసింది. సరికొత్త 2017 క్రెటా ధర, ఇంజన్, ఫీచర్లు మరియు మరిన్ని వివరాల కోసం...

వేరియంట్ల వారీగా హ్యుందాయ్ క్రెటా ధరల వివరాలు

 • ఇ వేరియంట్ ధర రూ. 9,28,547 లు
 • ఇ ప్లస్ వేరియంట్ ధర రూ. 9,99,900 లు
 • ఇ ప్లస్ (1.4-లీటర్ డీజల్) ధర రూ. 9,99,900 లు
 • ఎస్ (1.4-లీటర్ డీజల్) ధర రూ. 11,33,808 లు

 • ఎస్ ప్లస్ (1.4-లీటర్ డీజల్) ధర రూ. 12,274,488 లు
 • ఎస్ ప్లస్ ఆటోమేటిక్ (1.6-లీటర్ డీజల్) ధర రూ. 13,70,288 లు
 • ఎస్ఎక్స్ (1.6-లీటర్ డీజల్) ధర రూ. 12,50,337 లు
 • ఎస్ఎక్స్ ప్లస్ ధర రూ. 11,97,393 లు

 • ఎస్ఎక్స్ ప్లస్ (1.6-లీటర్ డీజల్) ధర రూ. 13,50,245 లు
 • ఎస్ఎక్స్ ప్లస్ ఎస్ఇ (1.6-లీటర్ డీజల్) ధర రూ. 13,88,291 లు
 • ఎస్ఎక్స్ ప్లస్ ఆటోమేటిక్ ధర రూ. 12,99,914 లు
 • ఎస్ఎక్స్ ప్లస్ ఆటోమేటిక్ (1.6-లీటర్ డీజల్) ధర రూ. 14,56,615 లు

హ్యుందాయ్ క్రెటా లోని ఇ ప్లస్ డీజల్ వేరియంట్ ఇప్పుడు ఎంట్రీ లెవల్ డీజల్ యూనిట్ 1.4-లీటర్ డీజల్ ఇంజన్‌తో కూడా లభిస్తోంది. ఇక టాప్ ఎండ్ వేరియంట్లను ప్రత్యేకమైన డ్యూయల్ టోన్ పెయింట్ స్కీమ్‌లతో అందుబాటులో ఉంచింది.

సరికొత్త 2017 హ్యుందాయ్ క్రెటా లోని అన్ని వేరియంట్లలో ఉన్న మూడు రకాల ఇంజన్ ఆప్షన్‌లలో ఎలాంటి మార్పులు చోటుచేసుకోలేదు. అదే విధంగా 6-స్పీడ్ మ్యాన్యువల్ మరియు మునుపటి ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ గేర్‌బాక్స్ వేరియంట్లలో కూడా ఎలాంటి మార్పు లేదు.

టాప్ ఎండ్ వేరియంట్ క్రెటా ఎస్‌యూవీ విషయానికి వస్తే, మొదటి యానివర్సరీ ఎడిషన్ తరహాలో డ్యూయల్ టోన్ కలర్ ఆప్షన్‌లలో ఎంచుకోవచ్చు. డ్యూయల్ టోన్ పెయింట్ జాబ్ ఆప్షన్లు - తెలుపు మరియు నలుపు అదే విధంగా ఎరుపు మరియు నలుపు.

టాప్ ఎండ్ క్రెటా వేరియంట్లో మునుపు ఉండే సాధారణ బీజి కలర్ సీట్లకు బదులుగా డ్యూయల్ టోన్ స్పోర్టివ్ రెడ్ అండ్ బ్లాక్ సీట్లను అందివ్వడం జరిగింది.

ఆపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటో మరియు మిర్రర్ లింక్ అప్లికేషన్లను సపోర్ట్ చేసే 7.0-అంగుళాల పరిమాణం గల ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ కలదు.

హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ మరియు ముఖ్య కార్యనిర్వహణ అధికారి వైకె కూ మాట్లాడుతూ, ఇండియన్ కాంపాక్ట్ ఎస్‌యూవీలో భారీ విక్రయాలతో క్రెటా ముందు స్థానంలో ఉంది. ఎస్‌యూవీ సెగ్మెంట్లో ఫస్ట్ క్లాస్ లీడింగ్ ఫీచర్లను 2017 క్రెటాలో అందించినట్లు తెలిపాడు.

అద్వితీయమైన పనితీరును కనబరిచే మా క్రెటా ఎస్‌యూవీ యొక్క విజయవంతమైన జర్నీ ద్వారా గర్వంగా ఉన్నట్లు చెప్పుకొచ్చాడు. కస్టమర్ల అవసరాలకు అనుగుణంగా మార్కెట్లో ఉన్న నూతన ఫీచర్లను అందిపుచ్చుకుని తమ ఉత్పత్తుల్లో మేళవిస్తూ మరింత మంది ఔత్సాహిక కొనుగోలుదారులకు చేరువవుతున్నట్లు కెవై కూ పేర్కొన్నాడు.

Click to compare, buy, and renew Car Insurance online

Buy InsuranceBuy Now

English summary
Read In Telugu about to know about 2017 hyundai creta facelift. Get more details about hyundai creta price, engine, features, specifications, photos and more.
Please Wait while comments are loading...

Latest Photos