కోనా సబ్ కాంపాక్ట్ ఎస్‌యూవీని ఆవిష్కరించిన హ్యుందాయ్

నెల రోజుల నుండి వరుసగా టీజర్ ఫోటోలను విడుదల చేస్తూ వచ్చిన హ్యుందాయ్ ఇప్పుడు అధికారికంగా తమ కోనా కాంపాక్ట్ ఎస్‌యూవీని ఆవిష్కరించింది. ఫోటోలు మరియు ఇతర సాంకేతిక వివరాలు నేటి కథనంలో...

By Anil

నాలుగు మీటర్ల కన్నా కాస్తంత పొడవున్న కోనా కాంపాక్ట్ ఎస్‍‌‌యూవీని తమ లైనప్‌లో ఉన్న క్రెటా ఎస్‌యూవీకి పై స్థానంలో మరియు టక్సన్ ఎస్‌యూవీకి క్రింది స్థానాన్ని భర్తీ చేసే విధంగా ఆవిష్కరించింది హ్యందాయ్.

అద్బుతమైన డిజైన్, ఇంటీరియర్ ఫీచర్లు మరియు శక్తివంతమైన బాడీ డిజైన్ కలిగిన ఉత్పత్తుల రూపకల్పనలో హ్యుందాయ్‌కు ప్రపంచ స్థాయిలో మంచి పేరుంది. అన్ని అంశాలకు అనుగుణంగా తీర్చిదిద్దిన కోనా కాంపాక్ట్ ఎస్‌యూవీ గురించి పూర్తి వివరాలు...

డిజైన్

డిజైన్

హ్యుందాయ్ ఐ30 ఫ్రంట్ డిజైన్‌లో ఉన్న ఫ్రంట్ గ్రిల్ శైలిలో కోనా కాంపాక్ట్ ఎస్‌యూవీలో క్యాస్కేడింగ్ ఫ్రంట్ గ్రిల్ అందివ్వడం జరిగింది. చిన్న పరిమాణంలో ఉన్న ఎల్ఇడి హెడ్ లైట్లు, వీటికి మధ్యలో చిన్న బానెట్ గ్రిల్ కలదు. పగటి పూట వెలిగే లైట్లు, ఫాగ్ ల్యాంప్స్ మరియు హెడ్ ల్యాంప్ క్లస్టర్‌లో ఉన్న ఇండికేటర్ ల్యాంప్స్ ఉన్నాయి.

హ్యుందాయ్ కోనా సబ్ కాంపాక్ట్ ఎస్‌యూవీ

సైడ్ డిజైన్ విషయానికి వస్తే, ప్లాస్టిక్ వీల్ క్లాడింగ్, రియర్ టెయిల్ ల్యాంప్ అంచుల వద్ద ముగిసిపోయిన డోర్ హ్యాండిల్స్ మీదుగా వెళ్లే క్యారెక్టర్ లైన్స్, కాంతిని పరావర్తనం చెందించే రూఫ్ టాప్, మరియు నూతన శైలిలో ఉన్న అల్లాయ్ వీల్స్ ఉన్నాయి.

హ్యుందాయ్ కోనా సబ్ కాంపాక్ట్ ఎస్‌యూవీ

కోనా కాంపాక్ట్ ఎస్‌యూవీలో హ్యుందాయ్ వద్ద మునుపు ఉన్న అదే ఇంటీరియర్ డిజైన్ పరిచయం చేసింది. డ్యాష్ బోర్డ్ మధ్యలో పై భాగంలో కూర్చున్న డిస్ల్పే, ఫ్లోటింగ్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, కాంపాక్ట్ హెచ్‌విఎసి కంట్రోల్స్‌తో పాటు హ్యుందాయ్‌లోనే తొలిసారిగా హెడ్స్ అప్ డిస్ల్పే పరిచయం చేయడం జరిగింది.

 ఇంజన్ మరియు గేర్‌బాక్స్ వివరాలు

ఇంజన్ మరియు గేర్‌బాక్స్ వివరాలు

హ్యుందాయ్ తమ కోనా కాంపాక్ట్ ఎస్‌యూవీ ప్రస్తుతం రెండు పెట్రోల్ ఇంజన్‌లను అందించింది. అయితే త్వరలో డీజల్ ఇంజన్ వేరియంట్‌ను కూడా పరిచయం చేయనుంది. కోనాలోని 1.0-లీటర్ సామర్థ్యం ఉన్న టుర్బోఛార్జ్‌డ్ పెట్రోల్ ఇంజన్ ఉత్పత్తి చేసే 118బిహెచ్ పవర్ 6-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ ద్వారా ముందు చక్రాలకు అందుతుంది.

హ్యుందాయ్ కోనా సబ్ కాంపాక్ట్ ఎస్‌యూవీ

కోనా లోని మరో పెట్రోల్ వేరియంట్ 1.6-లీటర్ టుర్బోఛార్జ్‌డ్ ఇంజన్ గరిష్టంగా 175బిహెచ్‌పి పవర్ ఉత్పత్తి చేయును. ఈ ఇంజన్ ఆప్షన్‌లోని అన్ని కోనా వేరియంట్లలో 7-స్పీడ్ డ్యూయల్ క్లచ్ గేర్‌బాక్స్ అనుసంధానం చేసింది.

హ్యుందాయ్ కోనా సబ్ కాంపాక్ట్ ఎస్‌యూవీ

హ్యుందాయ్ తదుపరి తమ కోనాలో అందించాలని భావిస్తున్న ఇంజన్ 1.6-లీటర్ సామర్థ్యం ఉన్న డీజల్. ఇది 113 మరియు 131బిహెచ్‌పి లతో రెండు రకాల పవర్ ఉత్పత్తి చేస్తుంది. ఆల్ డ్రైవ్ మరియు 7-స్పీడ్ డ్యూయల్ క్లచ్ ట్రాన్స్‌మిషన్ లలో రానుంది.

హ్యుందాయ్ కోనా సబ్ కాంపాక్ట్ ఎస్‌యూవీ

సస్పెన్షన్ వ్యవస్థలో హ్యుందాయ్ కీలకమైన మార్పులు తీసుకొచ్చింది. వెనుక వైపు సస్పెన్షన్ వ్యవస్థలో ఉపయోగించే టార్షన్ బీమ్ సస్పెన్షన్ స్థానంలో, అడ్వాన్స్‌డ్ ట్రాక్షన్ కార్నరింద్ కంట్రోల్ అనే పిలువబడే కాంప్లెక్స్ మల్టీ-లింక్ సెటప్ సస్పెన్షన్‌ను అందించింది. మలుపుల్లో ట్రాక్షన్‌ను పెంచి, కుదుపులను నియంత్రిచండంలో ప్రముఖ పాత్రపోషిస్తుంది.

హ్యుందాయ్ కోనా సబ్ కాంపాక్ట్ ఎస్‌యూవీ

హ్యుందాయ్ కోనా కాంపాక్ట్ ఎస్‌యూవీ ప్రారంభ వేరియంట్ ధర ఇంగ్లాండులో 15,000 ల యూరోలుగా ఉంది. ఇండియన్ కరెన్సీలో దీని ధర సుమారుగా రూ. 12.23 లక్షలుగా ఉంది.

హ్యుందాయ్ కోనా సబ్ కాంపాక్ట్ ఎస్‌యూవీ

అయితే హ్యుందాయ్ మోటార్స్ కోనా ఎస్‌యూవీని ఇండియన్ మార్కెట్లోకి తీసుకురావడంపై ఎలాంటి ప్రకటన చేయలేదు. ఈ ఎస్‌యూవీపై మీ అభిప్రాయాన్ని క్రింది కామెంట్ సెక్షన్‌లో వ్రాయండి!

హ్యుందాయ్ కోనా సబ్ కాంపాక్ట్ ఎస్‌యూవీ

రూ. 20 వేలతో బిజినెస్ ప్రారంభించి, నేడు 16 సంస్థలకు అధిపతి అయ్యాడు!మరి అలాంటి వ్యక్తి గురించి తెలుసుకోవాలని లేదా ?

Most Read Articles

English summary
Read In Telugu Hyundai Kona Subcompact SUV Revealed [In Pictures]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X