హ్యుందాయ్ యొక్క నెక్ట్స్ కాంపాక్ట్ ఎస్‌యూవీ "కోనా"

హ్యుందాయ్ మోటార్స్ దేశీయ కాంపాక్ట్ ఎస్‌యూవీ సెగ్మెంట్లోకి కోనా అనే పేరుతో సరికొత్త ఎస్‌యూవీని విడుదలకు సిద్దం చేస్తోంది. దీనికి చెందిన పూర్తి వివరాలు ఇవాళ్టి కథనంలో చూద్దాం రండి...

By Anil

కొరియాకు దిగ్గజ నాణ్యమైన కార్ల తయారీ సంస్థ హ్యుందాయ్ మోటార్స్ ఈ ఏడాది వేసవి కాలంలో తమ కోనా ఎస్‌యూవీని మార్కెట్లోకి విడుదల చేసింది, అక్టోబర్ 2017 నుండి పూర్తి స్థాయి విక్రయాలకు సిద్దం చేస్తున్నట్లు తెలిసింది. కాంపాక్ట్ ఎస్‌యూవీ సెగ్మెంట్లోకి విడుదల కానున్న కోనా ఎస్‌యూవీ గురించి మరిన్ని వివరాలు మీ కోసం....

హ్యుందాయ్ కోనా కాంపాక్ట్ ఎస్‌యూవీ

అమెరికా దేశాలకు పడమర దిక్కున ఉన్న ఉత్తర పసిఫిక్ సముద్రంలో గల హవాయ్ దీవుల సమూహంలో ఉన్న ఓ ప్రాంతానికి గల కోనా అనే పేరును హ్యుందాయ్ మోటార్స్తమ కాంపాక్ట్ ఎస్‌యూవీ కోసం ఎంపిక చేసింది.

హ్యుందాయ్ కోనా కాంపాక్ట్ ఎస్‌యూవీ

మరికొన్ని నెలల్లో హ్యుందాయ్ మోటార్స్ కోనా ఎస్‌యూవీని ప్రపంచ వ్యాప్తంగా పరిచయం చేయడానికి ఏర్పాట్లు పూర్తి చేసుకుంటోంది. 2017 న్యూ యార్క్ మోటార్ షో వేదిక మీద కోనా ఎస్‌యూవీని అధికారికంగా ఆవిష్కరించే అవకాశం ఉంది.

హ్యుందాయ్ కోనా కాంపాక్ట్ ఎస్‌యూవీ

ప్రస్తుతం అంతర్జాతీయ విపణిలో ఉన్న హ్యుందాయ్ ఐ30ని ఆధారం చేసుకుని దీనిని నిర్మించిన వేదిక మీదే కోనా ఎస్‌యూవీని అభివృద్ది చేసినట్లు సమాచారం. కాబట్టి ఇది కొద్దిగా ఐ30 యొక్క క్రాసోవర్ శైలిలో కూడా ఉండనుంది.

హ్యుందాయ్ కోనా కాంపాక్ట్ ఎస్‌యూవీ

కొరియా తయారీదారుల యొక్క లైనప్‌లో ఉన్న టక్సన్ ఎస్‌యూవీకి దిగువ స్థానాన్ని ఇది భర్తీ చేయనుంది. ప్రస్తుతం విపణిలో ఉన్న హోండా హెచ్ఆర్-వి మరియు టయోటా సిహెచ్-ఆర్ వంటి ఎస్‌యూవీలకు బలమైన పోటీనివ్వనుంది.

హ్యుందాయ్ కోనా కాంపాక్ట్ ఎస్‌యూవీ

హ్యుందాయ్ తమ అప్‌కమింగ్ కాంపాక్ట్ ఎస్‌యూవీ పేరును కోనా గా ఖరారు చేయడానికి వినియోగించిన హెడ్ ల్యాంప్ కోనా ఎస్‌యూవీకి చెందిందే, దీనిని పరిశీలిస్తే, ప్రస్తుతం హ్యుందాయ్ లైనప్‌లో ఉన్న మరే ఇతర వేరియంట్లలో గుర్తించలేం. కాబట్టి ఇది పూర్తిగా నూతన డిజైన్ భాషలో రూపొందుతున్నట్లు తెలుస్తోంది.

హ్యుందాయ్ కోనా కాంపాక్ట్ ఎస్‌యూవీ

హ్యుందాయ్ గతంలో ఉన్న మరే ఉత్పత్తులకు పోలిక లేకుండా సెగ్మెంట్ శ్రేణిలో నూతన మరియు ఆధునిక ఇంటీరియర్‌ను అందిస్తోంది. అంతే కాకుండా ప్రస్తుతం కాంపాక్ట్ ఎస్‌యూవీలు పనితీరు పరంగా ఎదుర్కుంటున్న విమర్శలను దృష్టిలో ఉంచుకుని అత్తుత్తమ ఇంజన్ పనితీరు ప్రమాణాలతో దీనిని అభివృద్ది చేస్తోంది.

హ్యుందాయ్ కోనా కాంపాక్ట్ ఎస్‌యూవీ

హ్యుందాయ్ మోటార్స్ సాంకేతికంగా తమ కోనా కాంపాక్ట్ ఎస్‌యూవీలో 1.4-లీటర్ సామర్థ్యం ఉన్న నాలుగు సిలిండర్ల పెట్రోల్ మరియు 1.6-లీటర్ సామర్థ్యం ఉన్న డీజల్ ఇంజన్‌ను అందిస్తోంది.

Most Read Articles

English summary
Also Read In Telugu: India Bound Hyundai Compact SUV 'Kona' Teased
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X