నూతన కాంపాక్ట్ ఎస్‌యూవీకి "కోనా" పేరును ఖరారు చేసిన హ్యుందాయ్

హ్యుందాయ్ మోటార్స్ గత ఏడాది ప్రారంభంలో జరిగిన 2016 ఇండియన్ ఆటో ఎక్స్ పో వేదిక వేదిక మీద తమ అప్‌కమింగ్ కాంపాక్ట్ ఎస్‌‌యూవీని హెచ్‌ఎన్‌డి-14 కార్లినో కాన్సెప్ట్ పేరుతో ప్రదర్శించింది. అయితే ఇప్పుడు దీని

Written By:

దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ హ్యుందాయ్ మోటార్స్ ఎంట్రీ లెవల్ ఎస్‌యూవీని ప్రస్తుతం మార్కెట్లో ఉన్న మారుతి సుజుకి వితారా బ్రిజా మరియు టాటా వారి అప్‌కమింగ్ ఎస్‌యువి నెక్సాన్‌కు పోటీగా అభివృద్ది చేస్తోంది. ప్రారంభంలో హెచ్‌ఎన్‌డి-14 కార్లినో అనే పేరుతో పరిచయం చేసిన దీనికి కోనా అనే పేరును ఖరారు చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలిసింది.

మోటార్ ఆక్టేనే అనే ఆన్‌లైన్ పత్రిక ప్రచురించిన కథనం మేరకు, హ్యుందాయ్ మోటార్స్ తమ కాంపాక్ట్ ఎస్‌యూవీకి కోనా అనే పేరును ఎంపిక చేసే ఆలోచనలో ఉన్నట్లు పేర్కొంది.

ప్రారంభంలో దీనికి క్యూఎక్స్ఐ అనే పేరును కూడా ఎంపిక చేసుకునే అవకాశం ఉన్నట్లు కూడా వార్తలొచ్చాయి. ఇది మార్కెట్లోకి విడుదలైతే, ప్రస్తుతం హ్యుందాయ్ ఎస్‌యూవీ లైనప్‌లో ఉన్న క్రెటా, టక్సన్ మరియు శాంటా ఫే సరసన చేరనుంది.

హ్యుందాయ్ గత ఏడాది జరిగిన 2016 ఇండియన్ ఆటో ఎక్స్ పో వేదిక మీద హెచ్‌ఎన్‌డి-14 కార్లినో అనే పేరుతో కాన్సెప్ట్ రూపంలో ప్రదర్శించింది. కోనా ఎస్‌యూవీని ఇదే వేదిక మీద అభివృద్ది చేస్తోంది.

ఈ నూతన ఎస్‌యూవీని డిజైన్‌ను సరికొత్త ఐ30 హ్యాచ్‌బ్యాక్ మరియు టక్సన్ ఎస్‌యూవీ డిజైన్ లక్షణాలతో అభివృద్ది చేస్తోంది. నిర్మాణం పరంగా ఇది మోనోక్యూక్ ఛాసిస్ లతో పాటు ఐ20 మరియు క్రెటా ఎస్‌యూవీ ఫీచర్ల జోడింపుతో రానుంది.

ప్రస్తుతం అందుతున్న నివేదికల ప్రకారం, ఇది ప్రారంభ ధర రూ. 12 లక్షల ధరల శ్రేణితో విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు తెలిసింది.

ఇంజన్ విషయానికి వస్తే, కోనా కాంపాక్ట్ ఎస్‌యూవీ ఐ20 లో ఉన్న ఇంజన్ ఆప్షన్ లతో పాటు, హ్యుందాయ్ వారి సరికొత్త 1.0-లీటర్ సామర్థ్యం ఉన్న టుర్బో పెట్రోల్ ఇంజన్ రానుంది. ఇది సుమారుగా 118బిహెచ్‌పి పవర్ ఉత్పత్తి చేయును.

ట్రాన్స్‌మిషన్ పరంగా కోనా ఎస్‌యూవీ స్టాండర్డ్ వేరియంట్‌గా 6-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌ను అందివ్వనున్నారు. మరియు ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో కుడా పరిచయం కానుంది. 2018 నాటికి విడుదల కానున్న ఇందులో ఏఎమ్‌టి ట్రాన్స్‌మిషన్ పరిచయం కానుంది.

హ్యుందాయ్ కాంపాక్ట్ ఎస్‌యువి కోనా మార్కెట్లోకి విడుదలయితే ప్రస్తుతం అందుబాటులో ఉన్న మారుతి సుజుకి వితారా బ్రిజా, ఫోర్డ్ ఎకో స్పోర్ట్ మరియు టాటా వారి అప్‌కమింగ్ ఎస్‌యూవీ నెక్సాన్ లకు గట్టి పోటీనివ్వనుంది.

 

Click to compare, buy, and renew Car Insurance online

Buy InsuranceBuy Now

English summary
Hyundai’s New Compact SUV To Be Named ‘Kona’
Please Wait while comments are loading...

Latest Photos