3 లక్షల శ్రేణిలో 2018 శాంట్రో కారును విడుదలకు సిద్దం చేస్తున్న హ్యుందాయ్

Written By:

హ్యుందాయ్ మోటార్స్ 2015 లో అధికారికంగా శాంట్రో చిన్న కారు విక్రయాలను నిలిపివేసింది. దీంతో ఇది మార్కెట్లో లేని లోటు హ్యుందాయ్ విక్రయ కేంద్రాలలో కొట్టొచ్చినట్లు కనబడినప్పటికీ, ఇండియన్ రోడ్ల మీద శాంట్రో కారు ఇప్పటికీ తిరుగుతూనే ఉంది. దీనిని దృష్టిలో ఉంచుకుని 2018 నాటికి కొత్త తరం శాంట్రో కారుతో శాంట్రో లేని లోటు తీర్చడానికి హ్యుందాయ్ మోటార్స్ సిద్దమైంది.

నిజానికి హ్యుందాయ్ మోటార్స్ ఈ నెక్ట్స్ జరేషన్ శాంట్రో కారును అదే టాల్ బాయ్ డిజైన్ శైలిలో 2016 నవంబర్‌లో విడుదల చేయాలని ప్రణాళికలు వేసుకుంది.

అయితే గట్టి పోటీని సృష్టిస్తున్న ఇతర ఉత్పత్తులను దృష్టిలో ఉంచుకుని పూర్తిగా నూతన బాడీ శైలిలో 2018 నాటికి సిద్దం చేయాలని నిర్ణయించుకుంది.

ఎక్ట్సీరియర్ నూతన బాడీ స్టైల్, విభిన్న కాస్మొటిక్ మెరుగులు, ఉత్తమ ఇంజన్ ఆప్షన్లు మరియు అత్యుత్తమ ఇంటీరియర్ ఫీచర్లతో విపణిలోని పోటీదారులను ఏరిపారేసే లక్ష్యంతో 2018 శాంట్రోని హ్యుందాయ్ సిద్దం చేస్తోంది.

శాంట్రో కారును లైనప్ నుండి తొలగించిన అనంతరం దీని స్థానంలో పాత ఐ10 కారు అమ్మకాల్లో ఉండేది. అయితే 2018 శాంట్రో ఇయాన్‌కు పైన మరియు గ్రాండ్ ఐ10 కు క్రింది స్థానంలో నిలవనుంది.

పాత శాంట్రో కారు యొక్క టాల్ బాయ్ డిజైన్ ప్రేరణతో ఈ నూతన శాంట్రోను ఇండియాలో ఉన్న హ్యుందాయ్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ సెంటర్ అభివృద్ది చేసింది.

ఇంజన్ పరంగా ఎలాంటి స్పష్టమైన సమాచారం లేదు, అయితే ఇది 1.1-లీటర్ సామర్థ్యం ఉన్న ఐఆర్‌డిఇ మరియు 1.2-లీటర్ సామర్థ్యం ఉన్న కప్పా పెట్రోల్ ఇంజన్ ఆప్షన్‌లతో వచ్చే అవకాశం ఉంది.

ఇంజన్ ఆప్షన్‌లు ఏవేమనప్పటికీ వీటికి ట్రాన్స్‌మిషన్ అనుసంధానం కోసం 5-స్పీడ్ మ్యాన్యువల్ మరియు ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌లను ఎంచుకోనుంది.

1998లో హ్యుందాయ్ మోటార్స్ మొదటి సారిగా విపణిలోకి ప్రవేశపెట్టిన మోడల్ శాంట్రో, అనతి కాలంలో భారతదేశపు బెస్ట్ సెల్లింగ్ బ్యాక్‌ల జాబితాలోకి చేరింది. ఆ తరువాత 2003లో దీనికి అప్‌డేటెడ్ మోడల్‌గా శాంట్రో జింగ్‌ను పరిచయం చేసింది.

హ్యుందాయ్ శాంట్రో జింగ్ హ్యాచ్‌బ్యాక్‌లో అందించిన 1.1-లీటర్ సామర్థ్యం ఉన్న పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 62బిహెచ్‌పి పవర్ మరియు 89ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేసేది.

2018 శాంట్రో కారును సుమారుగా రూ. 3 నుండి 4 లక్షల మధ్య ప్రారంభ ధరతో విడుదల చేసే అవకాశం ఉంది. ఇదే సెగ్మెంట్లో ఉన్న వ్యాగన్ ఆర్, సెలెరియో మరియు టాటా టియాగో వంటి వాటికి పోటీనిచ్చే అవకాశం ఉంది.

అచ్చం 2018 హ్యుందాయ్ శాంట్రో శైలిలో మారుతి సుజుకి సరికొత్త ఆల్టో 800 ను అభివృద్ది చేసింది. దీనిని కూడా 2018 లోనే విడుదలకు సిద్దం చేసింది. 2018 మారుతి ఆల్టో 800 మరిన్ని వివరాల కోసం...

మారుతి సుజుకి ఈ ఏడాది ప్రారంభంలో ఇగ్నిస్ క్రాసోవర్ కారును ఆవిష్కరించింది. కేవలం రెండు నెలల్లోనే 12 వేలకు పైగా అమ్ముడుపోయాయి. ఇంతలా ఎంచుకుంటున్న ఇగ్నిస్ ను చూడాలనుకుంటున్నారా...? అయితే క్రింది గ్యాలరీ మీద క్లిక్ చేయండి....

Click to compare, buy, and renew Car Insurance online

Buy InsuranceBuy Now

Story first published: Friday, March 10, 2017, 13:07 [IST]
English summary
Hyundai to launch new Santro in 2018, here’s what to look out for
Please Wait while comments are loading...

Latest Photos