నూతన డిజైన్ మరియు సరికొత్త ఇంజన్ ఆప్షన్‌లతో 2017 హ్యుందాయ్ ఎక్సెంట్ ఫేస్‌లిఫ్ట్

హ్యుందాయ్ మోటార్స్ తమ 2017 ఎక్సెంట్ ఫేస్‌లిఫ్ట్‌ను ఈ నెలలో (ఏప్రిల్ 2017) విపణిలోకి విడుదల చేయడానికి ఏర్పాట్లు చేస్తోంది. డిజైన్ మార్పులతో, నూతన ఇంజన్ ఆప్షన్‌లతో రానున్న దీని గురించి పూర్తి వివరాలు.

Written By:

దక్షిణ కొరియాకు చెందిన దిగ్గజ ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ హ్యుందాయ్ మోటార్స్ ఇండియన్ మార్కెట్లోకి విడుదల ఎక్సెంట్ కాంపాక్ట్ సెడాన్ కారు మంచి విక్రయాలు సాధిస్తోంది. వ్యక్తిగత కొనుగోళ్ల కన్నా ట్యాక్సీలుగా దీనిని ఎక్కువ వినియోగిస్తున్నారు. ఈ ధోరణిని మార్చేందుకు డిజైన్ మార్పులతో పాటు నూతన ఇంజన్ జోడింపుతో ఎక్సెంట్ కాంపాక్ట్ సెడాన్‌ను 2017 ఎక్సెంట్ ఫేస్‌లిఫ్ట్‌గా విడుదల చేయడానికి సన్నద్దం అవుతోంది.

హ్యుందాయ్ తమ 2017 ఎక్సెంట్ ఫేస్‌లిఫ్ట్‌లో సరికొత్త స్పోర్ట్ బ్రాండ్ న్యూ డీజల్ ఇంజన్ అందివ్వనుంది మరియు గతంలో హ్యుందాయ్ విడుదల చేసిన గ్రాండ్ ఐ10 ఫేస్‌లిఫ్ట్‌లో గుర్తించిన డిజైన్ ఫీచర్లు కూడా ఇందులో రానున్నాయి.

2017 ఫేస్‌లిప్ట్ ఎక్సెంట్ లోని ఫ్రంట్ డిజైన్ దాదాపుగా గ్రాండ్ ఐ10 ఫేస్‌లిఫ్ట్ మోడల్‌ను పోలిఉండనుంది. రివైజ్ చేయబడిన ఫ్రంట్ గ్రిల్, పగటి పూట వెలిగే ఎల్ఇడి లైట్లు, సరికొత్త ఫాగ్ ల్యాంప్, వెనుక డిజైన్‌లో కూడా మార్పులు చేస్తూ ఈ కాంపాక్ట్ సెడాన్‌లో అధనాతన అల్లాయ్ వీల్స్ అందివ్వనున్నారు.

ఇంటీరియర్‌లో సరికొత్త కలర్ ఆప్షన్ పరిచయం చేస్తూ టాప్ ఎండ్ వేరియంట్లో ఆపిల్ కార్ ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో అప్లికేషన్లను సపోర్ట్ చేయగల 7.0-అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ మరియు ప్రారంభ వేరియంట్ ఎక్సెంట్ ఫేస్‌లిఫ్ట్‌లో 5.0-అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ రానుంది.

ప్రస్తుతం హ్యుందాయ్ ఎక్సెంట్‌లో ఉన్న 1.1-లీటర్ సామర్థ్యం గల డీజల్ ఇంజన్ స్థానంలోకి మూడు సిలిండర్ల 1.2-లీటర్ సామర్థ్యం ఉన్న డీజల్ ఇంజన్ రానుంది. ఇది గరిష్టంగా 74బిహెచ్‌పి పవర్ మరియు 180ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేయును.

నూతన డీజల్ ఇంజన్ 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్గల గేర్‌బాక్స్ అనుసంధానంతో రానుంది, అయితే మునుపటి ఎక్సెంట్ వేరియంట్లో ఉన్న 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్ వేరియంట్లో ఎలాంటి మార్పులు చోటుచేసుకోలేదు.

2017 హ్యుందాయ్ ఎక్సెంట్ ఫేస్‌లిఫ్ట్ పూర్తి స్థాయిలో విపణిలోకి విడుదల అయితే ప్రస్తుతం మార్కెట్లో ఉన్న టాటా టిగోర్ స్టైల్ బ్యాక్, మారుతి సుజుకి స్విఫ్ట్ డిజైర్, ఫోర్డ్ ఫిగో ఆస్పైర్ వంటి మోడళ్లకు బలమైన పోటీనివ్వనుంది.

హ్యుందాయ్ ఈ 2017 ఎక్సెంట్ ఫేస్‌లిఫ్ట్‌ను రూ. 5.50 లక్షల ప్రారంభ ధరతో విడుదల చేసే అవకాశం ఉంది.

WHAT OTHERS ARE READING

Click to compare, buy, and renew Car Insurance online

Buy InsuranceBuy Now

Story first published: Tuesday, April 4, 2017, 11:12 [IST]
English summary
2017 Hyundai Xcent Facelift India Launch Expected This Month. All details abo0ut up coming 2017 hyundai xcent facelift.
Please Wait while comments are loading...

Latest Photos

LIKE US ON FACEBOOK