జిఎస్‌టి అమలు ఆటోమొబైల్‌ పరిశ్రమకు లాభమా...? నష్టమా...?

Written By:

దేశవ్యాప్తంగా ఒకే విధమైన పన్ను విధానం, "వస్తు మరియు సేవా పన్ను" (GST) దేశీయంగా అమల్లోకి వచ్చింది. మరి ఈ నూతన పన్ను విధానం ఆటోమొబైల్ పరిశ్రమ మీద ఎలాంటి ప్రభావం చూపుతోంది. దీని వలన వాహన పరిశ్రమకు లాభమా.... నష్టమా.... ఇవాళ్టి కథనంలో చూద్దాం రండి.

టూ వీలర్లు మరియు ఫోర్ వీలర్ల మీద

మీరు కొత్త మోటార్ సైకిల్ లేదా కొత్త కారును కొనుగోలు చేస్తున్నారా...? కొత్త పన్ను విధానం వస్తు మరియు సేవా పన్ను అమల్లోకి వచ్చింది కాబట్టి ట్యాక్స్‌తో పాటు అదనపు సెస్‌ కూడా చెల్లించాల్సి ఉంది.

చిన్న పెట్రోల్ కార్ల మీద

1200సీసీ మరియు ఇంత కన్నా తక్కువ కెపాసిటి ఉన్న పెట్రోల్ కార్లను కొనుగోలు చేసే వారు నూతన పన్ను విధానం జిఎస్‌టి ప్రకారం కారు మొత్తం విలువలో ఒక్క శాతం సెస్‌ ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుంది.

చిన్న డీజల్ కార్ల మీద

విపణిలో ఉన్న 1,500సీసీ సామర్థ్యం మరియు ఇంత కన్నా తక్కువ సామర్థ్యం గల ఇంజన్‌లు ఉన్న కార్ల మొత్తం ధరలో 3 శాతాన్ని సెస్‌గా చెల్లించాల్సి ఉంటుంది.

స్పోర్ట్స్ యుటిలిటి వెహికల్స్, లగ్జరీ కార్లు మరియు పెద్ద సెడాన్ కార్లు ఈ నూతన జిఎస్‌టి విధానం ద్వారా లాభపడ్డాయని చెప్పవచ్చు. అంటే 1,200సీసీ కంటే ఎక్కువ ఇంజన్ సామర్థ్యం ఉన్న పెట్రోల్ మరియు 1,500సీసీ కన్నా ఎక్కువ ఇంజన్ సామర్థ్యం ఉన్న అన్ని వాహనాలు ఈ సెగ్మెంట్ క్రింది వస్తాయి.

ఎక్కువ పరిమాణంలో ఇంజన్ సామర్థ్యం ఉన్న అన్ని వెహికల్స్(పైన తెలిపిన వెహికల్స్) మీద వాటి మొత్తం ధరలో 15 శాతం సెస్ చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఈ వాహనాల మీద ప్రస్తుతం ఉన్న ట్యాక్స్‌ కన్నా కొత్తగా అమల్లోకి వచ్చిన జిఎస్‌టి ద్వారా అమలయ్యే సెస్ తక్కువగా ఉండటం గమనార్హం.

టూ వీలర్ల మీద జిఎస్‌టి ప్రభావం

టూ వీలర్ల సెగ్మెంట్లో 350సీసీ కన్నా ఎక్కువ ఇంజన్ సామర్థ్యం ఉన్న వాటి మీద మొత్తం ధరలో 3 శాతం సెస్ అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. అయితే 350సీసీ కన్నా తక్కువ సామర్థ్యం ఉన్న టూ వీలర్ల మీద ఎలాంటి సెస్‌లు ఉండబోవు.

ఇక ఇండియాలో ఎవరయినా వ్యక్తిగత అవసరాల కోసం ప్రయివేట్ విమానం లేదా యాచ్ (నౌక) లను కొనుగోలు చేసే వారు. దాని మొత్తం ధరలో 3 శాతం సెస్‌ను చెల్లించాల్సి ఉంటుంది.

దేశీయంగా ఉన్న అన్ని ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థలు కూడా చిన్న కార్ల మార్కెట్‌ మీదే ఆధారపడ్డాయి. జిఎస్‌టి ద్వారా చిన్న పెట్రోల్ మరియు డీజల్ కార్లు భారీగా పెరగనున్నాయి, ఇక పెద్ద కార్ల మీద ధరలు తగ్గనున్నాయి. దీంతో ఎంట్రీ లెవల్ సెగ్మెంట్ కార్ల విక్రయాల మీద నూతన పన్ను విధానం తీవ్ర ప్రభావం చూపనుంది.

ఆటోమొబైల్ విడి పరికారల మీద విధించే కొత్త పన్ను వివరాల మీద దేశీయ వాహన పరిశ్రమ నిపుణులు స్పష్టత కోరుకుంటున్నారు. అయితే కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి ప్రకారం మధ్య స్థాయి పరిశ్రమ ఉత్పత్తుల మీద 18 ట్యాక్స్ ఉండవచ్చని తెలిసింది.

అయితే ఈ 18 ట్యాక్స్ ఆటోమొబైల్ విడి పరికరాల ఉత్పత్తుల కేటగిరీకి వర్తిస్తుందా లేదా అనే విషయం మీద ఎలాంటి స్పష్టత లేదు.

జిఎస్‌టి అమలైన తరువాత మారుతి సుజుకి చైర్మెన్ ఆర్‌సి భార్గవ మాట్లాడుతూ, వివిధ సెగ్మెంట్లలోని వాహనాలకు తుది ధరలను ప్రకటించినపుడు వాహన ధరలపై జిఎస్‌టి ప్రభావం స్పష్టం అవుతుందిని తెలిపాడు.

నూతన ట్యాక్స్ విధానం, వస్తు మరియు సేవ పన్ను (GST) ప్రభావం చిన్న కార్ల మీద ఎక్కువగా ఉంది, అయితే ఈ విధానం ద్వారా సూపర్ కార్లు, లగ్జరీ మరియు అత్యంత ఖరీదైన కార్ల మీద అంతగా లేదు. కాబట్టి హై ఎండ్ కార్ల మార్కెట్ పుంజుకోనుంది.

Click to compare, buy, and renew Car Insurance online

Buy InsuranceBuy Now

Story first published: Saturday, May 20, 2017, 12:34 [IST]
English summary
Read In Telugu All You Need To Know About The Impact Of GST On The Automobile Industry
Please Wait while comments are loading...

Latest Photos