టయోటా ఫార్చ్యూనర్ మరియు ఫోర్డ్ ఎండీవర్‌లకు బలమైన పోటీ: ఇసుజు ఎమ్‌యు-ఎక్స్

ఇసుజు మోటార్స్ ఇండియన్ మార్కెట్లోకి ఎమ్‌యు-ఎక్స్ ఎస్‌యూవీని విడుదల చేయడానికి సిద్దమైంది. ప్రస్తుతం ప్రీమియమ్ ఎస్‌యూవీ సెగ్మెంట్లో ఉన్న పోర్డ్ ఎండీవర్ మరియు టయోటా ఫార్చ్యూనర్ లకు గట్టి పోటీనివ్వనుంది.

Written By:

జపాన్‌కు చెందిన దిగ్గజ కార్ల తయారీ సంస్థ ఇసుజు మోటార్స్ దేశీయ మార్కెట్లోకి ఎమ్‌యు-ఎక్స్ ఎస్‍‌యూవీని విడుదల చేయడానికి సిద్దమైంది. ఇసుజు గత కొంత కాలంగా పలు దశలలో తమ ఎస్‌యూవీని పరీక్షిస్తూ వచ్చింది.

మే 11, 2017 న విపణిలోకి ఎమ్‌యు-ఎక్స్ ఎస్‌యూవీని విడుదల చేయడానికి సర్వం సిద్దం చేసుకుంది.

ఇసుజు మోటార్స్ తమ ఎమ్‌యు-ఎక్స్ ఎస్‌యూవీని వివిధ రకాల ఇంజన్ మరియు ట్రాన్స్‌మిష్ ఆప్షన్‌లలో ప్రి ఫేస్‌లిఫ్ట్‌గా విడుదల చేయడానికి సిద్దమైంది. దీనిని టూ వీల్ మరియు ఆల్ వీల్ డ్రైవ్ సిస్టమ్‌లలో కూడా ఎంచుకోవచ్చు.

ఈ ఎమ్‌యు-ఎక్స్ ఎస్‌యూవీ ఫ్రంట్ డిజైన్ డి-మ్యాక్స్ వి-క్రాస్ పికప్ ట్రక్కును పోలి ఉంటుంది. ముందు మరియు వెనుక వైపున నూతన బంపర్లు కలవు. ఇంటీరియర్ విషయానికి వస్తే, స్వల్పంగా షెవర్లే ట్రయల్‌బ్లేజర్‌ను పోలి ఉంటుంది.

ఇసుజు తమ ఎమ్‌యు-ఎక్స్ ఎస్‌యూవీని ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లాలోని శ్రీసిటిలో గల తయారీ ప్లాంటులో ఉత్పత్తి చేస్తోంది. ఇదే ప్లాంటులో డి-మ్యాక్స్ మరియు విక-క్రాస్ వాహనాలను ఉత్పత్తి చేస్తోంది.

ఇప్పటికే దేశవ్యాప్తంగా ఉన్న ఇసుజు విక్రయ కేంద్రాలు ఎమ్‌యు-ఎక్స్ మీద బుకింగ్స్ ప్రారంభించాయి. ఈ సరికొత్త ఎస్‌‌యూవీని విడుదల అనంతరం త్వరలోనే డెలివరీలు కూడా ప్రారంభిస్తామని తెలిపారు.

 

Click to compare, buy, and renew Car Insurance online

Buy InsuranceBuy Now

Read more on: #ఇసుజు #isuzu
English summary
Isuzu MU-X India Launch Date Revealed
Please Wait while comments are loading...

Latest Photos