మేడిన్ ఇండియా మంత్రానికి దాసోహం అయిన అమెరికా కార్ల తయారీ సంస్థ

ప్రపంచ వ్యాప్తంగా జీప్ సంస్థ వాహనాలకు ఉన్న డిమాండ్ అందరికీ తెలిసిందే. అలాంటి జీప్ సంస్థ ఇప్పుడు ఇండియాలో తమ ఉత్పత్తులను తయారీ చేసి లెఫ్ట్ హ్యాండ్ డ్రైవింగ్ మార్కెట్లకు ఎగుమతి చేయడానికి సిద్దమైంది.

By Anil

అమెరికాకు చెందిన దిగ్గజ ఎస్‌యూవీ వాహనాల తయారీ సంస్థ జీప్ మేడియన్ ఇండియా ట్యాగ్ లైన్‌తో పూనే‌లోని రంజన్‌గాన్ తయారీ కేంద్రంలో తమ కంపాస్ వాహనాన్ని ఉత్పత్తి చేయనుంది. దీనిని ప్రపంచ వ్యాప్తంగా లెఫ్ట్ హ్యాండ్ డ్రైవింగ్ దేశాలకు ప్రసిద్దిగాంచిన ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా మరియు జపాన్ వంటి దేశాలకు ఎగుమతులకు సిద్దం చేయనుంది.

మేడియన్ ఇండియా జీప్ ఉత్పత్తులను ఎగుమతులకు సిద్దం చేస్తున్న జీప్ సంస్థ

జీప్ ఇండియా విభాగం ఫియట్ క్రిస్లర్ ఆటోమొబైల్స్, (FCA) తాజాగా తమ అత్యంత సరసమైన జీప్ కంపాస్ ఎస్‌యూవీని మార్కెట్లోకి విడుదల చేసింది. దీనిని 2017 లోని మూడవ త్రైమాసికం నుండి విక్రయాలకు అందుబాటులోకి తీసుకురానుంది.

మేడియన్ ఇండియా జీప్ ఉత్పత్తులను ఎగుమతులకు సిద్దం చేస్తున్న జీప్ సంస్థ

జీప్ సంస్థ దేశీయంగా ఉత్పత్తిని ప్రారంభించిన మొదటి మోడల్ కంపాస్. ఆటో కార్ ఇండియా కథనం మేరకు దేశీయంగా తయారయ్యే ఈ కంపాస్‌ ఎస్‌యూవీని ప్రపంచ లెఫ్ట్ హ్యాండ్ డ్రైవింగ్ మార్కెట్లకు ఎగుమతి చేయనున్నట్లు తెలిసింది.

మేడియన్ ఇండియా జీప్ ఉత్పత్తులను ఎగుమతులకు సిద్దం చేస్తున్న జీప్ సంస్థ

పూనేకు సమీపంలో ఉన్న రంజన్‌గాన్ ప్రొడక్షన్ ప్లాంటులో కంపాస్ ఎస్‌యూవీని ఉత్పత్తి చేయనుంది. మరియు కంపాస్ వాహనాన్ని ఆస్ట్రేలియా,ఇంగ్లాండ్ మరియు జపాన్ దేశాలకు ఎగుమతి చేయనుంది.

మేడియన్ ఇండియా జీప్ ఉత్పత్తులను ఎగుమతులకు సిద్దం చేస్తున్న జీప్ సంస్థ

దేశీయంగా విడుదలైన కంపాస్ ఎస్‌యూవీలో రెండు ఇంజన్ ఆప్షన్‌లు ఉన్నాయి. అవి, 1.4-లీటర్ టుర్బో ఛార్జ్‌డ్ పెట్రోల్ మరియు 2-లీటర్ల సామర్థ్యం ఉన్న డీజల్ ఇంజన్ కలదు. పెట్రోల్ వేరియంట్ 160బిహెచ్‌పి పవర్ మరియు 170ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేయును.

మేడియన్ ఇండియా జీప్ ఉత్పత్తులను ఎగుమతులకు సిద్దం చేస్తున్న జీప్ సంస్థ

రెండు ఇంజన్ ఆప్షన్‌లకు 6-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ లేదా 7-స్పీడ్ డ్యూయల్ క్లచ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ గల గేర్‌బాక్స్ అనుసంధానం కలదు.

మేడియన్ ఇండియా జీప్ ఉత్పత్తులను ఎగుమతులకు సిద్దం చేస్తున్న జీప్ సంస్థ

జీప్ కంపాస్ ఎస్‌యూవీలో ఫోర్ వీల్ డ్రైవ్ సిస్టమ్ కలదు మరియు ఐదు రకాల డ్రైవింగ్ మోడ్స్ ఇందులో ఉన్నాయి. అవి, ఆటో, స్నో, స్పోర్ట్, శాండ్/మడ్ మరియు రాక్.

మేడియన్ ఇండియా జీప్ ఉత్పత్తులను ఎగుమతులకు సిద్దం చేస్తున్న జీప్ సంస్థ

భద్రత పరంగా జీప్ కంపాస్ ఎస్‌యూవీలో ఆరు ఎయిర్ బ్యాగులు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటి కంట్రోల్, యాంటి లాక్ బ్రేకింగ్ సిస్టమ్, డైనమిక్ స్టీరింగ్ టార్క్, హిల్ స్టార్ట్ అసిస్ట్, అడాప్టివ్ బ్రేక్ లైట్స్ అండ్ ప్యానిక్ బ్రేక్ అసిస్ట్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

మేడియన్ ఇండియా జీప్ ఉత్పత్తులను ఎగుమతులకు సిద్దం చేస్తున్న జీప్ సంస్థ

జీప్ కంపాస్ ఇండియన్ మార్కెట్లోకి పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే, ఇది రూ. 18 లక్షల నుండి 25 లక్షల మధ్య ప్రారంభ ధరతో లభించే అవకాశం ఉంది.

మేడియన్ ఇండియా జీప్ ఉత్పత్తులను ఎగుమతులకు సిద్దం చేస్తున్న జీప్ సంస్థ

జీప్ కు చెందిన అత్యంత సరసమైన కంపాస్ ఎస్‌యూవీ ప్రస్తుతం దేశీయ విపణిలో ఉన్న హ్యుందాయ్ టక్సన్ మరియు హోండా సిఆర్-వి వంటి ఎస్‌యూవీలకు బలమైన పోటీనివ్వనుంది.

Most Read Articles

Read more on: #జీప్ #jeep
English summary
Read in Telugu to know about India-Made Jeep Compass To Be Exported To Right-Hand Drive Global Markets. Get more details about jeep compass suv price, engine, features, specifications and more.
Story first published: Monday, April 17, 2017, 11:08 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X