తీవ్ర దుమారం రేపుతున్న జీప్ కంపాస్ ధరలు

జీప్ కంపాస్ ఎస్‌యూవీ ధరల విషయంలో పోటీగా ఉన్న కార్ల సంస్థలకు చెమటలు పుట్టిస్తున్నాయి. ఆగష్టు 2017 న విడుదల కానున్న జీప్ కంపాస్ దెబ్బకు పోటీగా ఉన్న ఎస్‌యూవీలు బిక్కుబిక్కుమంటున్నాయి.

By Anil

జీప్ సంస్థ ఆగష్టు 2017 న కంపాస్ ఎస్‍‌యూవీ విడుదలతో ఇండియన్ ఎస్‌యూవీ మార్కెట్లో తీవ్ర దుమారం రేపనుంది. ధర పరంగా కంపాస్‌కు పోటీగా నిలిచే మోడళ్లకు పెద్ద షాక్ ఇవ్వనుంది. జీప్ మంచి బ్రాండ్ వాల్యూ మరియు అత్యుత్త ఫీచర్లను కలిగి ఉండటంతో దేశీయంగా ఇదే సెగ్మెంట్లో ఉన్న ఇతర మోడళ్లకు ధర పరంగా చూక్కలు చూపించనుంది.

జీప్ కంపాస్ ఎస్‌యూవీ విడుదల వివరాలు

రిపోర్ట్స్ ప్రకారం, కంపాస్ ధర రూ. 15 నుండి 16 లక్షలతో ప్రారంభమయ్యి టాప్ ఎండ్ వేరియంట్ ధర రూ. 23 లక్షల వరకు ఉండనుంది(అంచనాగా). అంటే మహీంద్రా ఎక్స్‌యూవీ500, క్రెటా మరియు టక్సన్ బదులుగా కంపాస్ ఎంచుకోవచ్చన్నమాట.

జీప్ కంపాస్ ఎస్‌యూవీ విడుదల వివరాలు

జీప్ కంపాస్ ధరలు తక్కువగా ఉండటానికి ప్రధానం కారణం దేశీయంగానే తయారవుతుండటం. తక్కువ తయారీ ఖర్చులు, రాయితీలు మరియు ట్యాక్స్ కూడా తగ్గుతుండటంతో తమ ఎంట్రీ లెవల్ ఎస్‌యూవీని సరసమైన ధరలోనే విడుదల చేయనుంది.

జీప్ కంపాస్ ఎస్‌యూవీ విడుదల వివరాలు

జీప్ కంపాస్ ఎస్‌యూవీ ఇండియన్ మార్కెట్లో ఉన్న హ్యుందాయ్ టక్సన్, హోండా సిఆర్-వి, హ్యుందాయ్ క్రెటా మరియు మహీంద్రా ఎక్స్‌యూవీ500 లకు గట్టిపోటీనివ్వనుంది.

జీప్ కంపాస్ ఎస్‌యూవీ విడుదల వివరాలు

ఫియట్ క్రిస్లర్ ఇండియా ప్రెసిడెంట్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ కెవిన్ ఫ్లిన్ మాట్లాడుతూ, "కంపాస్ ఎస్‌యూవీని వ్యూహాత్మక ప్రణాళికలతో తీసుకురావడం జరిగిందని" తెలిపాడు.

జీప్ కంపాస్ ఎస్‌యూవీ విడుదల వివరాలు

జీప్ కంపాస్ ఎస్‌యూవీని ఆన్‌లైన్ మరియు దేశవ్యాప్తంగా ఉన్న జీప్ డీలర్‌షిప్‌ల ద్వారా రూ. 50,000 లు చెల్లించి బుక్ చేసుకోవచ్చు. 65 శాతం దేశీయంగా తయారైన విడి పరికరాలతో రాజస్థాన్‌లోని రంజన్‌గావ్ ప్రొడక్షన్ ప్లాంటులో ఉత్పత్తి చేయడం ద్వారా అతి తక్కవ ధరతో విడుదల చేయడం సాధ్యమవుతోంది.

జీప్ కంపాస్ ఎస్‌యూవీ విడుదల వివరాలు

జీప్ ఇండియా దేశీయంగా వ్రాంగ్లర్ మరియు గ్రాండ్ చిరోకీ ఎస్‌యూవీలను పూర్తి స్థాయిలో దిగుమతి చేసుకొని విక్రయిస్తోంది. దిగుమతి చేసుకోవడం వలన వీటి ధరలు కోటి రుపాయలపైనే ఉంది. కానీ 65 శాతం వరకు మేడిన్ ఇండియా పరికరాలను వినియోగించడంతో కంపాస్ ధర తక్కువగా ఉండనుంది.

జీప్ కంపాస్ ఎస్‌యూవీ విడుదల వివరాలు

సాంకేతికంగా జీప్ కాంపాస్‌ ఎస్‌యూవీలో 160బిహెచ్‌పి పవర్ మరియు 260ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేయగల 1.4-లీటర్ సామర్థ్యం ఉన్న మల్టీ ఎయిర్ పెట్రోల్ ఇంజన్ అదే విధంగా 170బిహెచ్‌పి పవర్ మరియు 350ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేయగల 2.0-లీటర్ సామర్థ్యం ఉన్న డీజల్ ఇంజన్ వేరియంట్లు ఉన్నాయి.

జీప్ కంపాస్ ఎస్‌యూవీ విడుదల వివరాలు

రెండు ఇంజన్ వేరియంట్లలో లభించే కంపాస్‌ను 7-స్పీడ్ ఆటోమేటిక్ లేదా 6-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ గల ట్రాన్స్‌మిషన్ మరియు అన్ని వేరియంట్లలో స్టాండర్డ్‌గా ఫోర్-వీల్ డ్రైవ్ ఫీచర్ కలదు.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

సాధారణ ఎస్‌యూవీలే 15 లక్షల ధరలో శ్రేణిలో మంచి ఫలితాలు సాధిస్తున్నాయి. అత్యుత్తమ డిజైన్, డ్రైవ్, ట్రాన్స్‌మిషన్ మరియు ఇంటీరియర్ ఫీచర్లతో మంచి బ్రాండ్ వ్యాల్యూ కలిగిన కంపాస్ రూ. 15 లక్షల ప్రారంభ ధరతో విడుదలైతే ఈ సెగ్మెంట్లో సంచలనాలు ఖాయం! మరిన్ని ఆటో న్యూస్ కోసం డ్రైవ్‌స్పార్క్ తెలుగుతో కలిసి ఉండండి.

Most Read Articles

Read more on: #జీప్ #jeep
English summary
Read In Telugu Jeep Compass Prices In India Might Trigger A War Among SUVs
Story first published: Thursday, June 22, 2017, 16:14 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X